అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి సీతక్క

Madupa Santhosh CEO

 అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించిన మంత్రి సీతక్క .అదిలాబాద్ : ఇంద్రవెల్లి : అక్షరతెలంగాణ
జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం లో  అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని  ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన  కార్యక్రమం లో పంచాయితి రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ , గ్రామీణాభివృద్ధి  శాఖ, గ్రామీణ నీటి సరఫరా మంత్రి సీతక్క ఎంపీ గొడం నగేష్, ఎమ్మెల్సీ దండే విఠల్, శాసన సభ్యులు మంచిర్యాల ప్రేమ్ సాగర్, వెడ్మ బొజ్జు, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిణి ఖుష్బూ గుప్తా, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల్, ఆత్రం సక్కు, జిల్లా మేడీ లు,  తదితరులు ఘనంగా నివాళులర్పించారు.ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 20 న అమరవీరుల సంస్కరణ సభలు నిర్వహించడం జరుగుతుంది.
మొదటిసారిగా ఈ ఏడాది ఏప్రిల్ 20 న అధికారికంగా  ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం , జాతి, ప్రజల ప్రయోజనం కొరకు పోరాడిన 1981 ఏప్రిల్ 20 న ఇంద్రవెల్లి లో  జల్, జంగిల్, జమీన్ కోసం అడవి బిడ్డల సమావేశం లో  పోలీసులు కాల్పుల్లో అమరులయ్యారని 44 సంవత్సరాల క్రితం ఇక్కడ జరగరాని ఘటన దురదృష్టకరమైన ఘటన జరిగిందని, అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి అమరవీరులను స్మరించుకునేందుకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంద్రవెల్లి ఆమరవీరుల స్థూపం నుంచే ఎన్నికల శంఖారావం పూరించారని కాంగ్రెస్ అధికారంలో రాగానే అమరవీరుల స్థూపాన్ని స్మృతి వనంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారన్నారు.
ఇందుకనుగుణంగా అధికారంలోకి రాగానే
 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. స్థూపం చుట్టూ ప్రహరీ గోడ, సీసీ రోడ్డు నిర్మాణం, గెస్ట్ రూమ్, స్మృతివనం పనులు చేపట్టడం జరుగుతున్నదని ఆన్నారు.
ఈ సందర్భంగా అమరులైన 15 మంది కుటుంబాలకు  10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగిందనీ, కొందరికి
మోడల్ ఇందిరమ్మ ఇండ్లతో పాటు రూ.1.5 కోట్లతో ట్రైకార్ ద్వారా వివిధ రుణాలను అందించడం జరిగిందనీ, మిగితా వారికి కూడా త్వరితగతిన అందించాలని ఐటిడిఎ పిఓ కు మంత్రి సీతక్క సూచించారు.
ఐటీడీఏ పీవో ఆద్వర్యంలో  ఒక కమిటి ఏర్పాటు చేసి ఈ ఘటనలో  చనిపోయిన వారి వివరాలను సేకరించి న్యాయం చేస్తామని, అలాగే ఇప్పుడు గుర్తించిన కుటుంబాలలో అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చొరవ తీసుకుంటామని అన్నారు .
ఐటీడీఏ ల పనితీరు మరుగున పడ్డాయని, 29 శాఖలకు సంబంధించి బలోపేతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు.
ట్రైబల్ ఏరియాలో చెక్ డ్యాం లు నిర్మించాలని, సోలార్ ద్వారా విద్యుత్ ను అందించేందుకు కృషి చేయడం జరుగుతుందనీ, అలాగే వడ్డీలేని రుణాలు  23  కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాల కు అందించడం జరిగిందనీ ఆన్నారు.
అంతకుముందు కేబి కంప్లెక్ వైటిసి లో హేవి మోటార్ వెహికల్ శిక్షణ కార్యక్రమం లో పాల్గొని  వెహికల్ ను జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం టి డబ్లు పి.ఎస్  దేవుగూడ లో విద్యార్ధుల సౌకర్యార్థం  బెంచీ లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఏ హెచ్ ఎస్ జి.  ఇం ద్రవెల్లి లో గిరిజన శిక్షణ సహాయం 
STEM సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం, శిశు బెంచిల పంపిణీ (Modulus) ఉచిత ప్రవేశ పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులనద్దేశించి మాట్లాడుతూ వేసవి సెలవుల్లో  సమయం వృథా చేయకుండా  గంటపాటు చదువు పై శ్రద్దవహించాలని, ఆన్ని రంగాల్లో రాణించేందుకు పట్టుదలతో ముందుకు వెళ్లాలని, అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆన్నారు.
Comments