ADB: ప్రధాన మంత్రి మోడీ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా. అదిలాబాద్

Madupa Santhosh CEO

 ప్రధాన మంత్రి మోడీ చేతుల మీదుగా అవార్డు అందుకొనున్న అదిలాబాద్ జిల్లా పాలనాధికారి రాజర్షి షా 
అదిలాబాద్ : అక్షరతెలంగాణ
ఏప్రిల్ 21 సివిల్ సర్వీసెస్ డే 
జిల్లా అడ్మినిస్ట్రేషన్  కార్యక్రమంలో భాగంగా నార్నూర్ బ్లాక్ అస్పరెషనల్ ప్రోగ్రాం 2024 కు గాను  జిల్లా కలెక్టర్  ఈ అవార్డుకు ఎంపిక.అయ్యారు.
ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారం 2024లో నార్నూర్ బ్లాక్ దేశంలో టాప్ 5లో ఎంపిక అయ్యింది 

ఆదిలాబాద్, జిల్లా – తెలంగాణకు గొప్ప గర్వం కలిగించే అంశంగా ఎదిగింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ బ్లాక్ 2024 సంవత్సరానికి ప్రగతిశీల బ్లాక్ ప్రోగ్రాం (ABP) కేటగిరీలో ఎంపిక కాగా  ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారం 2024లో దేశంలోని టాప్ 5 ఆస్పిరేషనల్ బ్లాకులలో ఒకటిగా ఎంపికైంది. దేశంలో 426 ఆస్పిరేషనల్ బ్లాకులలో నార్నూర్ అద్భుతమైన విజయాలను ప్రదర్శించి  టాప్ ,5 గుర్తింపును సాధించింది.
ఈ దేశస్థాయి పురస్కారం పరిపాలన అభివృద్ధిలో అద్భుతమైన పనిని సొంతం చేసుకున్న వారికి ఇవ్వబడుతుంది. 
ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2024 వరకు చేపట్టిన ముఖ్యమైన అభివృద్ధి పనులపై మదింపు చేస్తుంది. ఈ అవార్డు ప్రధానంగా ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి , మౌలిక వసతులలో కొలిచే పురోగతి పై దృష్టి పెట్టింది, అన్ని 5 ప్రధాన అంశాల్లో సమగ్ర అభివృద్ధి సాధించినందుకు నార్నూర్ ప్రత్యేకంగా గుర్తించబడింది.

మదింపు ప్రక్రియ అనేక దశలుగా జరుగుతుంది. మొదట, పరిపాలన సంస్కరణలు , ప్రజా దర్యాప్తు శాఖ (DARPG) పట్ల సీనియర్ అధికారులతో సమగ్ర పరిచయం ద్వారా వివరణాత్మక ప్రదర్శనను ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత, DARPG అధికారులు నార్నూర్ బెనిఫిషియరీలతో ప్రత్యక్షంగా మాట్లాడి వాటి పై గ్రౌండ్ స్థాయిలో ప్రభావం తేల్చుకునే ఒక ప్రత్యేక కాల్ సెంటర్ రౌండ్ నిర్వహించారు.
మూడవ దశలో, అదనపు కార్యదర్శి స్థాయి ఇద్దరు అధికారులు నార్నూర్ ను సందర్శించి, పథకాలు ఎలా అమలవుతున్నాయి, బ్లాక్ అంతటా వాటి ప్రభావాన్ని అంచనా వేసి భాగస్వాములతో సమావేశమయ్యారు. చివరగా, ఈ పర్యవేక్షణ తర్వాత కేబినెట్ కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి మదింపు జరిగింది.

వివిధ దశల సమగ్ర మదింపు తర్వాత, నార్నూర్ బ్లాక్ ABP కింద టాప్ 5 బ్లాకులుగా ప్రకటించబడింది, సమగ్ర  సుస్థిర అభివృద్ధి కొరకు ఒక ప్రామాణిక బలంగా నిలిచింది.
జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా,కృషి ఎంతో ఉంది ఆయన తన దూరదర్శితమైన నాయకత్వంతో అహర్నిశలు కష్టపడి క్రింది స్థాయి అధికారులకు దిశ నిర్దేశం చేస్తూ  నార్నూర్ బ్లాక్  అద్భుతమైన  మార్పు ప్రగతి సాధించడంలో జిల్లా కలెక్టర్ క్రియాశీలక పాత్ర ఉండడం మూలంగా  ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యారు.

కలెక్టర్ మార్గదర్శకత్వంలో నార్నూర్ అనేక కీలక రంగాలలో ప్రగతిని సాధించింది, ఇందులో గర్భిణీ , శిశు ఆరోగ్యం,అంగన్వాడి కేంద్రాల్లోని చిన్నారుల లో పోషకాహార లోపాన్ని గుర్తించి సరైన పౌష్టికాహారం అందించి పెరుగుదల పర్యవేక్షించడం, ప్రాథమిక శిశు సంరక్షణ, విద్యా ఫలితాలు, డిజిటల్ , ఆర్థిక చేర్పు, గిరిజన విద్యార్థులు సంక్షేమం (మోవా లడ్డు ద్వారా) సహజ వ్యవసాయం, మూడు దశల వ్యవసాయం, చెక్ డ్యామ్స్ నిర్మాణం,స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు అందించడం, ICT ఇంటర్వెన్షన్స్ (నార్నూర్ మానిటరింగ్ యాప్, వెబ్సైట్) మోడల్ CSC సెంటర్, వంటి నూతన ఆలోచనల ద్వారా జీవనోపాధి లో మంచి పురోగతి సాధించింది.

ప్రభుత్వ సహకారం తో పాటు , అనేక ఆసక్తి  NGO లు  తమ వంతు భాగస్వామ్యం చేయడం వారు అందించిన , CSR ఫండింగ్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ముఖ్యంగా  నార్నూర్  బ్లాక్ మరింత సుస్థిర అభివృద్ధిని అందించింది.
 ప్రజా భాగస్వామ్యం,తో ఈ విజయాన్ని సొంతం చేసుకుంది డేటా ఆధారిత తో  అభివృద్ధికి చేయుత నివ్వడం లో సమగ్ర అభివృద్ధి  దృఢమైన నిదర్శనంగా నిలవడం తో దేశ వ్యాప్తంగా మారుమూల ఉన్న నార్నూర్ బ్లాక్ దేశవ్యాప్తంగా  మార్పు తీసుకొచ్చే ఇతర ఆస్పరేషనల్ బ్లాకుల కోసం ఒక ప్రేరణగా నిలిచింది.
ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి రాజర్షి షా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క, జిల్లా పార్లమెంటు సభ్యులు గొడెం నగేష్, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్తా, ఆయా శాఖల జిల్లా అధికారులు, జిల్లా ఆకాంక్షిత నార్నూర్ బ్లాక్ సంబంధిత అధికారులు, ఆకాంక్షిత బ్లాక్ ప్రతినిధి రాహుల్, డివిజనల్ మండల్ ,  గ్రామ అధికారులు, నార్నూర్ మండల్ ప్రజా ప్రతినిధులు, గ్రామ పటేళ్ల సహకారంతో ఈ అవార్డు లభించిందని, ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
Comments