ఆదివాసీలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే ఉన్నత చదువులు చదవాలి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Madupa Santhosh CEO
ADB : ఆదివాసీలు  ఉన్నత స్థానాలకు ఎదగాలి అంటే.   ఉన్నత చదువును చదవాలి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.
ఆదిలాబాద్,( గాదిగూడ) అక్షరతెలంగాణ
 -గాదిగూడ మండలం కొలమ గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ.
-జనరల్ మెడిసిన్, ఆప్తమాలజీ, గైనకాలజీ, ఇఎన్టి విభాగాల నందు వైద్య సేవలు.
 -యువతకు గంజాయి మరియు సైబర్ క్రైమ్ పై అవగాహన.
-అత్యవసర సమయాలలో డయల్ 100 ను సంప్రదించాలి.
 -యువతకు స్పోర్ట్స్ కిట్స్ అందజేసిన జిల్లా ఎస్పీ.
మారుమూల ఆదివాసి తండాలలో గ్రామాలలో ఉంటున్న ప్రజలకు వైద్య సేవలు అందించాలని సదుద్దేశంతో జిల్లా పోలీసు యంత్రాంగం తరపున గాదిగూడ మండలంలోని కొలమ గ్రామం నందు జిల్లా వైద్యశాఖ సహకారంతో ఉచిత మేగా వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రారంభించడం జరిగింది. మొదటగా గ్రామ ప్రజలు జిల్లా ఎస్పీకి డప్పు వాయిద్యాలు నడుమ స్వాగతం పలికి సభా స్థలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువతకు చదువుపై ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఉన్నత చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.  చదువు వల్లే ఆదివాసీలు అభివృద్ధి చెందుతారు అని తెలిపారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుకోడానికి ప్రోత్సహించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు. అదేవిధంగా గంజాయి సమాజంలో చీడపురుగు అని, గంజాయి పండించడం వల్ల, వాడడం వల్ల సమాజ శ్రేయస్సుకు నష్టం కలుగుతుందని తెలియ జేశారు. గంజాయి పండించడం వల్ల ప్రభుత్వం వల్ల వచ్చే లబ్ధిని కోల్పోతారని, గంజాయి కేసులు నమోదు చేపడతాయని తెలియజేశారు. అదేవిధంగా డయల్ 100 యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100 ను సంప్రదించాలని క్షణాల విధిలో జిల్లా పోలీసు యంత్రాంగం తమకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరిస్తుందని తెలియజేశారు. జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. తదుపరి గ్రామంలో వైద్యశాఖ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంలో పాల్గొని ప్రారంభించి ఆదివాసులకు అన్ని రకాలుగా వైద్య సదుపాయాలు చెరువలోకి తీసుకురావడం సంతోష భావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గైనకాలజీ, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, ఆప్తమాలజీ కి సంబంధించిన డాక్టర్లు ఆదివాసీలకు వైద్య సేవలను అందించడం జరిగింది. వైద్య సేవలను తీసుకున్నానంతరం ప్రజలు ప్రతి ఒక్కరికి సరైన మెడిసిన్ ఉచితంగా అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు ఎఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్, నార్నూర్ సీఐ రహీం భాష, వైద్య సిబ్బంది, గాదిగూడ ఎస్ఐ నాగనాథ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments