' భూభారతి చట్టం ' రైతుల మెలుకోసం ప్రజాపాలనలో చారిత్రక మార్పు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Madupa Santhosh CEO
ADB : 'భూభారతి చట్టం ' రైతుల మేలు కోసం ప్రజాపాలన లో చారిత్రక మార్పు: జిల్లాకలెక్టర్  రాజర్షి షాఅదిలాబాద్ : అక్షరతెలంగాణ 
 భూ భారతి చట్టం  రైతుల చుట్టం 
భూమి హక్కులు భద్రం
భూ సమస్యల సత్వర పరిష్కారం
రైతుల మేలు కోసం ప్రజాపాలన లో చారిత్రక మార్పు
జిల్లా పాలనాధికారి రాజర్షి షా.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టం అమలు పై జిల్లా లోని భీంపూర్ మండలం లో  గురువారం భూ భారతి అవగాహన సదస్సు  కార్యక్రమాన్ని జయ జయ హే తెలంగాణ పాట తో  జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా  భూ భారతి అవగాహన సదస్సు కార్యక్రమం లో భూ భారతి కొత్త ఆర్ ఓ ఆర్ చట్టం పై తహసిల్దార్ ప్రియ గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పలువురు రైతులు భూ భారతి చట్టం పై సందేహాలను కలెక్టర్ కు వివరించిన అనంతరం తహసిల్దార్ వారి సందేహాలను నివృత్తి చేశారు.అనంతరం జిల్లా పాలనాధికారి  మాట్లాడుతూ భూ భారతి చట్టం పై గ్రామస్తులు అందరికీ తెలుసుండాలని , అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆన్నారు.భూ భారతి కీలకాంశాలుధరణి స్థానం లో కొత్త భూమి హక్కుల రికార్డు భూ భారతి 
హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, మ్యాప్ తయారీ, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, వారసత్వంగా వచ్చిన భూములను మ్యూటేశన్ చేసే ముందు నిర్ణీత కాలం లో విచారణ, భూమి హక్కులు ఏ విదంగా సంక్రమించిన  మ్యుటేషన్ చేసి రికార్డులలో నమోదు, పాసుపుస్తకాలలో భూమి పటం, భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ, భూదార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు, అబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ్ రెవెన్యు రికార్డుల నిర్వహణ, మోసపూరితనంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారాలు ఉంటాయని ఆన్నారు.
భూ భారతి' నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూముల పై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఆనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టాన్ని తెచ్చిందని వివరించారు. భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించే భూ భారతి చట్టం పై అవగాహనను కల్పించుకొని  పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.
ఈ సదస్సులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్వి డి ఓ  వినోద్ కుమార్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డీ, తహసిల్దార్ ప్రియ, ప్రత్యేక అధికారి కిసాన్, డి ఎ ఓ శ్రీదర్ స్వామి, మండల కన్వీనర్ అశోక్, మాజీ సర్పంచ్ లింబాజి, రైతులు , తదితరులు పాల్గొన్నారు.
Comments