ఇంద్రవెల్లి లో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ధర్నాలో పాల్గొన్న : ఆత్రం సుగుణక్క

Madupa Santhosh CEO

ADB : ఇంద్రవెల్లిలో చేపట్టిన  కాంగ్రెస్ పార్టీ ధర్నాలో పాల్గొన్న ఆత్రం సుగుణక్కఅదిలాబాద్ : అక్షరతెలంగాణ: 
-దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబంపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది
ఇంద్రవెల్లి: దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసుల పేరుతో వేధింపులకు గురి చేయటాన్ని నిరసిస్తూ ఇంద్రవెల్లి మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు.కేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ నినాదాలు చేశారు.ఈ సందర్బంగా సుగుణక్క మాట్లాడుతూ..బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంటే అది తట్టుకోలేని మోడీ, అమిత్ షా కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. దేశంలో కాంగ్రెస్ బలపడుతుంది అని ఇలా ఈడీ కేసులతో ఇబ్బందులకు గురి చేస్తే రాబోవు రోజుల్లో బిజెపికి ప్రజలు గుణపాఠం చెప్తారని అన్నారు.దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబం పై బురదజల్లడానికి ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను దేశ ప్రజలు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు ఖండించాలని తెలిపారు.స్వంత ఆస్తులను దేశం కోసం త్యాగం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ నేతలది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లు దేశం కోసం ప్రాణాలు అర్పించారని,అలాంటి వారిపై ఈడీ కేసులు పెట్టటాన్ని తీవ్రంగా కండిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు విశాల్ పరత్వాగ్,మండల అధ్యక్షురాలు లక్ష్మీబాయి,యాకుబ్ భేగ్, తులసిరామ్, గోపీనాథ్, పీరాజి,గణేష్, నారాయన్, భగవాన్, సునిల్ జాదవ్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments