కేసీఆర్ సభ తో బీ.ఆర్.ఎస్ పార్టీ నే తెలంగాణకు శ్రీరామ రక్ష: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

Madupa Santhosh CEO
ADB : కేసీఆర్ తో బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామ రక్ష : బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధావ్ 
అదిలాబాద్ : అక్షరతెలంగాణ
- గాంధీ నగర్ గ్రామంలో బీజేపీ ఖాళీ బీఆర్ఎస్ పార్టీలో చేరిన గాంధీ నగర్ గ్రామం. ఆర్మీ రిటైర్డ్ దీపక్ తో పాటు యువకులు బీఆర్ఎస్ లో చేరిక
- 12000 ఇస్తానని చెబితే మోస పోయి ఓటేసా  దుఃఖంతో అవ్వ బీఆర్ఎస్ లో చేరిక కండువా కప్పి ఆహ్వానించిన  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ .

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు లోబడిన ఇచ్చొడ మండలంలోని గాంధీ నగర్ గ్రామస్తులు ఈరోజు గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారి సమక్షంలో గ్రామమంతా ఏకమై బీఆర్ఎస్ పార్టీలో చేరింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారు పార్టీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను లోబడి మోసపోయామని కానీ కేసీఆర్ గారి ఒక్క పిలుపుతో లక్షలాదిగా తరలివచ్చిన ఆ జనాన్ని చూసి తెలిసింది తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని సభకు ప్రజలను ఎక్కువ మొత్తంలో తరలించడంలో కార్యకర్తలకు జోష్ నింపడంలో రాష్ట్రంలోనే కీలక పాత్ర పోషించిన మా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారిని చూసి అభిమానంతో నమ్మకంతో పార్టీలో చేరమన్నారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారు మాట్లాడుతూ గాంధీ నగర్ గ్రామస్తుల లాగే రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయారని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భూ స్థాపితం కావడం మొన్నటి కేసీఆర్ గారి సభతోనే తెలిపోయిందన్నారు. గాంధీ నగర్ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కృష్ణ రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రీతం రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల్ గౌడ్, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు పాండురంగ్, మాజీ సర్పంచ్ , ఇచ్చొడ మాజీ ఉప సర్పంచ్ శిరీష్ రెడ్డి, దీపక్, పోచాలు, సురేందర్ రెడ్డి, నాయకులు మహేందర్ రెడ్డి, అనిల్, రమేష్, దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments