రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లో గ్యాస్ట్రాలజీ ఒపి సేవలను ప్రారంభించిన ఎంపీ గొడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్

Madupa Santhosh CEO
ADB:  రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో గ్యాస్ట్రాలజీ ఓపి సేవలను ప్రారంభించిన ఎంపీ గేడం నగేష్ , ఎమ్మెల్యే పాయల్ శంకర్. Adilabad: అక్షరతెలంగాణ : 
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పూర్తి అయిన తర్వాత వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటే ఏ ఒక్క పేషెంట్ చికిత్స కోసం హైదరాబాద్ గాని నాగపూర్ గాని, మిగతా ప్రాంతాల్లో పోనవసరం ఉండదన్నారు.యశోద అపోలో అయినటువంటి  గొప్ప పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు. ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెనుకబడిన అదిలాబాద్ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మాణం చేయడం వల్ల, చిన్న విషయానికి అనారోగ్యానికి గురై లక్ష రూపాయలు హైదరాబాద్  వెళ్లి చికిత్సలు చేసుకోవాల్సిన స్తోమత లేదన్నారు. కార్డియాలజిస్ట్, తో పాటు మిగతా ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.          యవత మాల్ ,నాగపూర్, హైదరాబాద్ లో లేనటువంటి సదుపాయాలు ఆదిలాబాద్ లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉన్నాయన్నారు. ఆదిలాబాద్ ఆసుపత్రి నుంచి ఏ ఒక్కరోకి కూడా హైదరాబాద్కు ఇతర ప్రాంతాలు రిఫర్ చేయవద్దని ఉద్దేశంతోనే వైద్య సేవలు అందించాలన్నారు. 92 శాతం ఆస్పత్రిలో డాక్టర్ కోరతాలేదన్నారు, మిగతా సమస్యలను ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. త్వరలో జరగబోయే రివ్యూ సమావేశంలో ఎంపీతో కలిసి ఆ సమావేశంలో పాల్గొని సమస్యలను వివరిస్తామన్నారు.
Comments