ఉత్కంఠ భరిత వాతావరణంలో అఘోరీకి లింగ నిర్దారణ పరీక్షలు

Madupa Santhosh CEO
ఉత్కంఠ భరిత వాతావరణంలో అఘోరి కి లింగ నిర్దారణ పరీక్షలు: సంగారెడ్డి : అక్షరతెలంగాణ
"జైలు ఏమన్నా నీ అత్తగారిల్లా"తగ్గేదే లే..! జైలులో కూడా ఇద్దరం కలిసే ఉంటాం.
జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది అఘోరీ
ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు  అఘోరీని  రెండు గంటల పాటు విచారించిన పోలీసులు.
విచారణ అనంతరం అఘోరీని చేవెళ్ల కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్లిన మోకిలా పోలీసులు.
చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న అఘోరీ
ప్రస్తుతానికి తానేమీ మాట్లాడనని, నేను జైలుకు వెళ్లినా  వర్షిణి తనతో పాటే ఉంటుందన్న అఘోరీ.
అఘోరికి లింగ నిర్దారణ పరీక్షలు : 
లింగ నిర్ధారణ జరిగితే గాని మేం ఈ జైల్లో ఉంచుకోలేం సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలు అధికారులు.
రాష్ట్రంలో సంచలనం రేపిన అఘోరీ ఆలియాస్ శ్రీనివాస్ అరెస్ట్ కేసు విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. బుధవారం చీటింగ్ కేసులో అరెస్టు చేసిన రంగారెడ్డి పోలీసులు చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన విషయం తెలిసిందే అక్కడ న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్ విధించగా అఘోరీ శ్రీనివాస్ ను నేరుగా సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలుకు మధ్యాహ్నం తరలించారు. అయితే ఆక్కడ జైలు అధికారులకు అఘోరీని ఏ బారక్ లో ఉంచాలో అనే టెన్షన్ మొదలైంది. అయితే లింగ నిర్ధారణ జరిగితే గాని ఇక్కడ ఉంచుకోలేమంటూ చెప్పడంతో తిరిగి అఘోరీని కోర్టుకు పంపించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్లు వైద్య పరీక్షల అనంతరం లింగ నిర్ధారణ జరగనుంది.ఆ రిపోర్ట్ ఆధారంగా నిందితురాలుగా ఉన్న అఘోరి చంచల్గూడా జైలుకు తరలిస్తారా లేకపోతే ఇంకా ఎక్కడికైనా మహిళా ఖైదీలు ఉన్న జైలుకు పంపిస్తారా అనేది సాయంత్రం వరకు క్లారిటీగా తెలిసే అవకాశం ఉన్నది.
Comments