రౌడీయిజాన్ని కనుమరుగు చేస్తాం.పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Madupa Santhosh CEO

 ADB: జిల్లాలో రౌడీయిజాన్ని కనుమరుగు చేస్తాం.
పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
అదిలాబాద్ : అక్షరతెలంగాణ
ప్రతినెల రౌడీల పై తనిఖీలు.జిల్లా ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించడమే, నేర రహిత సమాజాన్ని నిర్మించడం లక్ష్యం.ఎలాంటి నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు, బెదిరింపులకు, దందాలకు పాల్పడరాదు.ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలో రౌడీ షీట్లు ఉన్న వారితో  రౌడీ మేల నిర్వహణ.
పద్ధతి మార్చుకొని వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం.రౌడీలు ప్రవర్తన మార్చుకోకపోతే అన్ని రకాలుగా అణచివేస్తామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ హెచ్చరించారు. ఈరోజు ఉదయం స్థానిక ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలో రౌడీషీట్లు నమోదైన వారితో రౌడీ మేళ సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ మాట్లాడుతూ, రౌడీయిజం నిర్వహిస్తే చట్టపరమైన కేసులు నమోదు చేస్తూ అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. సత్ప్రవర్తన కలిగిన వారికి రౌడీషీట్లు తొలగించి సరైన న్యాయం చేస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, రౌడీయిజం చేయడం లాంటివి మానుకోవాలని సూచించారు. రౌడీలపై ఉన్న కేసుల వివరాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ, నమోదైన కేసులను న్యాయస్థానాల నందు శిక్షణ పడేవిధంగా కృషి చేస్తూ బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ప్రశాంత వాతావరణ కల్పించడానికి తన వంతు పూర్తిస్థాయిలో కృషి చేస్తూ విధులు నిర్వర్తించడం జరుగుతుందని తెలిపారు
. రౌడీషీట్లో ఉన్న వారందరూ మళ్ళీ తిరిగి గంజాయి దందా మట్కా దందా, రౌడీ ఇజం, హత్యలు, హత్యాయత్నాలు, నేరాలు, ప్రజలను బెదిరించడం, కోట్లాటలు, గొడవలు, లాంటివి మొదలుపెట్టిన వారిపై పిడి యాక్టర్ నమోదుకు సైతం వెనకాడ బోనని హెచ్చరించారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కత్తులతో పోస్టులు పెట్టడం, రెచ్చగొట్టడం, రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ ప్రజలను భయభ్రాంతులను గురి చేయడం, లాంటివి చేస్తే సహించేది లేదని తెలిపారు. నేరాలు లేని సమాజాన్ని తయారు చేయడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సిఐలు బి సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్ రావు, డి సాయినాథ్, కే ఫణి ధర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments