ప్రముఖ క్రైస్తవ మతబోధకుడు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

Madupa Santhosh CEO
 క్రైస్తవ మత బొధకుడు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత:
న్యూస్ డెస్క్: అక్షరతెలంగాణ 
ప్రముఖ క్రైస్తవ మత బోధకులు పోప్ ఫ్రాన్సిస్ సోమవారం ఉదయం మరణించారు. వాటికన్ కామెర్లెంగో కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ ఈ విషాద వార్తను ప్రకటించారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్.. వాటికన్ సిటీలో కన్నుమూశారు. ఉదయం 7:35 గంటలకు రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రిలో ఫ్రాన్సిస్ కన్నుమూశారు.
12 ఏళ్ల వయస్సు నుంచే..నిన్న ఈస్టర్ వేడుకల్లో ఆయన పాల్గొనడం విశేషం. ఆయన 88 సంవత్సరాల వయస్సులో మరణించారు. పోప్ ఫ్రాన్సిస్ తన 12 ఏళ్ల వయస్సు నుంచే చర్చి, సమాజం, అట్టడుగు వర్గాల కోసం అంకితమై పనిచేశారు. ఆయన జీవితం విలువలతో నిండి ఉందని, విశ్వాసం, ధైర్యం, సార్వత్రిక ప్రేమకు పోప్ ప్రతీక అని ఫెర్రెల్ తెలిపారు. 1936 డిసెంబర్‌ 17న అర్జెంటీనాలో జన్మించిన పోప్‌ ఫ్రాన్సిస్‌.. 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు.
మార్చి 23న, పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి పోప్ డిశ్చార్జ్ అయ్యారు. న్యూమోనియాతో ఐదు వారాల చికిత్స తరువాత ఆయన తిరిగి వాటికన్‌కు చేరుకున్నారు. వయస్సు, ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆయన సేవ విషయంలో మాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు కొనసాగారని చెప్పవచ్చు. 2013లో పోప్‌గా ఎన్నికైనప్పటి నుంచి ఫ్రాన్సిస్ చాలా విషయాల్లో తన ప్రత్యేకతను చూపించారు.
వాటికన్ ఆర్థిక వ్యవస్థ, పాలనను సంస్కరించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. మతపరమైన సంప్రదాయాలు, సమాజానికి ఉపయోగపడే అనేక విషయాలను అనుసరించారు. వలసదారులు, పేదలు, ఖైదీలు, అణగారినవారు అందరికీ చోటు ఇవ్వాలనే తపనతో ఆయన ముందుకు సాగారు. పర్యావరణ పరిరక్షణ, అణు ఆయుధాలపై వ్యతిరేకత, శాంతియుత జీవన విధానంపై ఆయన చేసిన ప్రచారం అనేక మందికి మార్గదర్శనం అయ్యింది. దీంతోపాటు చర్చిలలో మహిళలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు పోప్.
Comments