ఇంటర్ ఫలితాలలో ఎస్ ఆర్ కళాశాల విద్యార్ధుల విజయభేరి.

Madupa Santhosh CEO
ADB : ఇంటర్ ఫలితాలలో ఎస్ ఆర్ కళాశాల విద్యార్ధుల విజయభేరి :అదిలాబాద్ : అక్షరతెలంగాణ 
ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో పట్టణంలోని పలు కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. అధ్యాపకులు, తల్లితండ్రుల ప్రోత్సాహంతో ఉత్తమ ఫలితాలను సాధించగా... వారికి పలువురు అభినందనలు తెలియచేశారు. ఇందులో భాగంగానే పట్టణంలోని ఎస్.ఆర్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో మంచి ప్రతిభను కనబరిచారు. సెకండ్ ఇయర్ బైపీసీ విభాగంలో కాలమడుగుల ఏంజెల్ 993, దివ్య వైలె 991, హరిణి లోక 990, యోగేష్ కావిడే 990, పగిడి బుద్ధ తేజ 987 మార్కులు సాధించారు. ఎంపీసీ సెకండ్ ఇయర్ mpc లో లాక్షణ్య 991,  హిమబిందు 991,  ప్రణయ్ 991, పద్మావతి 990, చారిత్రిక 989 మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం mpc లో అభిషేక్ 466, శివకుమార్ 466, అంజన్ రెడ్డి, తేజ శ్రీ, సాహితి 465 మార్కులు సాధించారు. అదేవిధంగా బైపీసీ లో బోయర్ అక్షయ్ 436, సరబ్జీత్ కౌర్ 434,  సుమిత్ 434, నికిత 433 మార్కులు పొందారు. వీరిని కళాశాల అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు. SR కళాశాల చైర్మన్ వరద రెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డిలు విద్యార్థులకు అభినందనలు తెలియచేశారు. వారితో పాటు తల్లితండ్రులకు సైతం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ ఇంచార్జ్ శ్రినివస్ రెడ్డి, ప్రిన్సిపల్స్ అరవింద్ కుమార్, జైపాల్ రెడ్డి, లలిత తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా కళాశాల విద్యార్థులు 95 శాతం ఉత్తీర్ణత సాధించారని, హైదరాబాద్ కంటే మెరుగైన ఫలితాలను సాధించడం అభినందనీయమని జోనల్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
Comments