పది ఫలితాలలో అత్యాధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా:

Madupa Santhosh CEO

 ADB: పది ఫలితాలలో అత్యాధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా: 
అదిలాబాద్ : అక్షరతెలంగాణ
ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఎన్నో మార్పులు: తొలిసారిగా పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల తో గూగుల్ మీట్ ద్వారా సమావేశం.రాష్ట్రం లోనే పదవ తరగతి  ఫలితాలలో  జిల్లా  15 వ స్థానం నుండి  9 వ  స్థానం లో అగ్రగామిగా నిలిచింది.జిల్లా పాలనాధికారి సహయ సహకారాలతో విద్యార్ధుల పై చూపించిన ప్రత్యేక శ్రద్ధ ప్రోత్సాహం తో,  గూగుల్ మీట్ ద్వారా దిశా నిర్దేశం తోనే జిల్లా టాప్ గా నిలిచింది.అందరి సహకారంతో జిల్లా పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో  97. 18 శాతం ఉత్తీర్ణత తో రాష్ట్ర స్థాయిలో  9 వ స్థానం నిలిచిందనికలెక్టర్ ను అభినందిస్తూ,హర్షం వ్యక్తం చేశారు.
పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్‌ అభినందన
అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను సన్మానించి, అభినందించిన కలెక్టర్ 
టాపర్ గా నిలిచిన విద్యార్ధులు మాట్లాడుతూ కలెక్టర్ కి ధన్యవాదాలు తెలుపుతూ వారి వారి గోల్స్ ను వివరించారు.ఈ కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్, డి ఐ ఈ ఓ గణేష్, వెల్ఫేర్ హాస్టల్ ప్రిన్సిపల్స్, విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
Comments