అదిలాబాద్ : అక్షరతెలంగాణ
పరీక్షా కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు ఐడి కార్డు, అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్), 2 ఫొటో లు తమ వెంట తీసుకురావాలి:మే 4వ తేదీన మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరగనున్ననీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని
జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత ఆయా కేంద్రాల చీఫ్ సుపరెండెంట్ లను ఆదేశించారు .
శుక్రవారం జిల్లాలో 7 కేంద్రాలలో నిర్వహిస్తున్న. నీట్ పరీక్ష సందర్భంగా పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎస్పీ తో కలసి పరిశీలించారు
ఈ సందర్భంగా ఏడు కేంద్రాలు
1.తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలురు
2.సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల,కళాశాల బాలికలు
3.ప్రభుత్వ బాలికల పాఠశాల భూక్తాపూర్
4.ప్రభుత్వ డిగ్రీకళాశాల ఆర్ట్స్, కామర్స్
5.బంగారి గూడ తెలంగాణ మోడల్ స్కూల్
6.,7 తెలంగాణ రెసిడెన్షియల్ మైనార్టీ స్కూల్. లో 2 కేంద్రాలలో ఏర్పాటు చేయడం జరిగిందనీ ఆన్నారు.
జిల్లాలో 1659 మంది పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. అభ్యర్థుల
కనుగుణంగా మొత్తం 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు.
అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 వరకు అనుమతించడం జరుగుతుందని, స్ట్రాంగ్ రూమ్ ల నుండి ప్రశ్న పత్రాలు, పరీక్ష సామాగ్రిని పకడ్బందీ పోలీస్ బందోబస్తు మధ్య తరలింపు, పరీక్షా కేంద్రాలలో తాగునీరు, ఏ.ఎన్.ఎం బృందాలను అందుబాటులో ఉండాలని తెలిపారు.
అన్ని పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు
నిషేధించబడిన అంశాలు:
అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రం లోపల కింది వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతించరు. బ్యాగ్‌లు/బ్యాగేజీ/డబ్బు మొదలైన అభ్యర్థులు తీసుకొచ్చిన ఏదైనా వస్తువును భద్రపరిచే బాధ్యత పరీక్షా కేంద్రం వహించదు:
1. టెక్స్ట్‌వల్ మెటీరియల్ (ముద్రించబడిన లేదా వ్రాసినవి), కాగితాల బిట్స్, జ్యామితి/పెన్/పెన్సిల్ బాక్స్, ప్లాస్టిక్ పర్సు, కాలిక్యులేటర్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్‌లు, ఎరేజర్, కాలిక్యులేటర్, లాగ్ టేబుల్, ఎలక్ట్రానిక్ పెన్/స్కానర్ మొదలైన ఏదైనా స్టేషనరీ వస్తువు.
2. మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్‌ఫోన్‌లు, మైక్రోఫోన్, పేజర్, హెల్త్ బ్యాండ్ మొదలైన ఏదైనా కమ్యూనికేషన్ పరికరం.
3. వాలెట్, గాగుల్స్, హ్యాండ్‌బ్యాగ్‌లు, బెల్ట్, క్యాప్ మొదలైన ఇతర వస్తువులు
4. ఏదైనా వాచ్/రిస్ట్ వాచ్, బ్రాస్‌లెట్, కెమెరా మొదలైనవి.
5. ఏదైనా ఆభరణం/లోహ వస్తువులు.
6. ఏదైనా ఆహార పదార్థాలు తెరవబడిన లేదా ప్యాక్ చేయబడినవి, వాటర్ బాటిల్ మొదలైనవి.
7. మైక్రోచిప్, కెమెరా, బ్లూటూత్ పరికరం మొదలైన కమ్యూనికేషన్ పరికరాలను దాచడం ద్వారా అన్యాయమైన మార్గాల కోసం ఉపయోగించబడే ఏదైనా ఇతర వస్తువు.
8. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి కేంద్రం లోపల నిషేధించబడిన ఏదైనా వస్తువును కలిగి ఉన్నట్లయితే, అది అన్యాయమైన మార్గాలను ఉపయోగించినట్లు పరిగణించబడుతుంది మరియు సంబంధిత నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థిపై చర్య తీసుకోబడుతుంది.
పరీక్షా వేదిక / తరగతి గదిలో ఖచ్చితంగా నిషేధించబడింది
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి సురేందర్ రావు, డీఎస్పీ జీవన్ రెడ్డి, ఆయా కేంద్రాల సెంటర్ సుపెరెండెంట్ లు, కేంద్రీయ విద్యాలయ కో ఆర్డినేటర్ అశోక్, డిప్యూటి కో ఆర్డినేషన్ విశాఖ వాగ్మారే, ఎం ఈ ఓ, తదితరులు ఉన్నారు.
Comments