రంగారెడ్డి: అక్షరతెలంగాణ
రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఓ గర్భిణి పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చింది. ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేరు. నొప్పులు మరింత తీవ్రతరం కావడంతో నర్సులు వాట్సాప్‌లో డాక్టర్‌కు వీడియో కాల్ చేశారు. డాక్టర్ సూచనల మేరకు నర్సులు గర్భిణికి ఆపరేషన్ చేశారు.
వైద్యం వికటించి తీవ్ర రక్తస్రావం అయింది. ఆ కొద్ది సేపటికే కవలలు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం విజయలక్ష్మి ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బంధువుల ఆందోళనతో విషయం తెలుసుకున్న పోలీసులు నర్సులు, డాక్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆస్పత్రిని సీజ్‌చేసిన జిల్లా వైద్యాధికారి..
ఐదునెలల గర్భంలోనే ఇద్దరు పిల్లలు మృతిచెందిన సంఘటనపై ఆస్పత్రిలో విచారణ జరిపిన జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు ఆస్పత్రిని సీజ్‌చేశారు. ఈ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న పలువురు రోగులను ఇతర ఆస్పత్రులకు రెఫర్‌చేసి తరలించారు. అనంతరం ఆస్పత్రిని సీజ్‌చేశారు.
అర్హత లేకుండా వైద్యచికిత్సలు నిర్వహించటం, తీవ్ర ఇబ్బందితో ఆస్పత్రికి వచ్చిన గర్బిణీపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
Comments