అదిలాబాద్ : అక్షరతెలంగాణ
నిందితుడు ధన్గట్ సుధీర్, అరెస్టు రిమాండ్. ఇదివరకే ఇతని పై 9 కేసులు నమోదు
- మావలలో పశువుల వాహనాన్ని బెదిరించిన కేసు అయినప్పటినుండి పరారీ.
- ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి మహారాష్ట్ర గడ్చిరోలి నందు నిందితున్ని పట్టుకున్న జిల్లా పోలీసులు.
- నిందితుడి వద్ద నుండి ఒక తల్వార్ స్వాధీనం.
- ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా, పబ్లిక్ స్థలాలలో కత్తులతో, డాగర్లతో ప్రదర్శనలు చేసి సోషల్ మీడియాలో పోస్టులు.
నిందితుడి పై త్వరలో రౌడీ షీట్ ఓపెన్.
ఆదిలాబాద్ పట్టణం కొత్త కుమ్మరివాడకు చెందిన నిందితుడు ధన్గట్ సుధీర్ తండ్రి శంకర్, మూడు నెలల క్రితం ఆదిలాబాద్ జిల్లాలోని మావల నందు పశువుల వాహనాన్ని ఆపి వాహన యజమానిని చంపుతానని బెదిరించి, డబ్బులు వసూలు చేసి దౌర్జన్యం చేసిన కేసులో పరారీలో ఉండడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో కత్తులతో, డాగర్లతో ప్రజలను భయభ్రాంతులను గురి చేసేలా శాంతి భద్రత ల సమస్యలను తలెత్తెల ప్రయత్నించినందుకు ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి పాత్రిక సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు, పబ్లిక్ స్థలాలలో కత్తులతో ప్రదర్శనలు చేసి, పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకొని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఉండే వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితుడు గతంలో పశువుల వాహనం వద్ద డబ్బులు దౌర్జన్యం చేసిన కేసు, సోషల్ మీడియాలో కత్తులతో ప్రజలను భయభ్రాంతులను గురి చేసేలా ఉన్న కేసు, స్థానిక ఎగ్జిబిషన్ యజమాని వద్ద డబ్బులను దౌర్జన్యంతో అడిగిన కేసు, పట్టణంలో మొత్తం తొమ్మిది కేసులో నమోదు అయినదని తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేసి తగు చర్యలు తీసుకోవడం పడుతుందని తెలిపారు. ఇతనిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఐరితాండకు సంబంధించిన ఆళ్లపల్లి అనే గ్రామంలో పట్టుకోవడం జరిగిందని అతనిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. ఇతని వద్ద నుండి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కత్తిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ పాత్రిక సమావేశంలో ఆదిలాబాద్ ఒకటో పట్టణ సిఐ బి సునీల్ కుమార్, మావల సీఐ కె స్వామి పాల్గొన్నారు.
- 24 గంటల్లో రెండు దొంగతనాలు చేసిన నిందితుడు అరెస్ట్.
- శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో చౌడేశ్వరి మాత ఆలయంలో ముఠాతో దోపిడి, ఈరోజు రాత్రి వడ్డెర కాలనీలో ఒంటరిగా దొంగతనం యత్నం.
- ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు.
- గంజాయి మత్తుకు బానిసై నేరాలకు పాల్పడుతున్న వ్యక్తి.
- దోపిడి కి పాల్పడిన ఒక కత్తి, ఒక సెల్ ఫోన్, గంజాయి పరికరం, వెయ్యి రూపాయల నగదు స్వాధీనం.
- జైలు శిక్ష నుండి విడుదలైన నాలుగు రోజుల వ్యవధిలోనే మళ్లీ నేరాలకు పాల్పడిన నిందితుడు.
ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరి లక్ష్మీ నగర్ కు చెందిన నిందితుడు షేక్ సమీర్ తండ్రి షేక్ హసన్ ఈ వారమే ఒక సంవత్సరం జైలు శిక్ష తర్వాత నిజామాబాద్ జైలు నుండి విడుదలై, గంజాయి కి బానిసై శనివారం ఉదయం రెండు గంటల సమయంలో స్థానిక చౌడేశ్వరి మాత ఆలయంలో ముఠా సభ్యులైన క్రాంతి నగర్ కు చెందిన షేక్ అయాన్ మరియు మహారాష్ట్ర కు చెందిన రాహుల్ అనే ముగ్గురు కలిసి ఆలయంలో వాచ్మెన్ వద్ద కత్తి చూపించి అతని వద్ద ₹3,000 నగదు మరియు చౌడేశ్వరి ఆలయం లోపల బీరువాలో గల మూడు గ్రాముల ముక్కుపుడకను దొంగలించుకుని పోయాడని ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ సిహెచ్ కరుణాకర్ రావు తెలియజేశారు. ఈ ముఠా సభ్యులలో కీలకంగా వ్యవహరిస్తున్న షేక్ సమీర్ చౌడేశ్వరి మాత ఆలయంలో దొంగతనం దోపిడీకి పాల్పడిన తర్వాత ఈరోజు ఒంటరిగా వడ్డెర కాలనీలో దొంగతనానికి ప్రయత్నించాడు, యజమానులు చప్పుడు కావడంతో ఇంటి లోపలి లైట్లు వేయగా వారిని నెట్టివేసి పారిపోయినాడు అని తెలిపారు. ఇతను గంజాయి సేవిస్తూ దోపిడీలకు దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఇతనిపై గంజాయి టెస్ట్ నిర్వహించగా, గంజాయి తాగినట్టు ధ్రువీకరణ కావడంతో అతనిపై గంజాయి కేసు కూడా నమోదు చేసినట్టు తెలిపారు. ముఠా సభ్యులలో మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యుడు హోమయ ఫిర్యాదుతో ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ఈరోజు ఉదయం రైల్వే స్టేషన్ నందు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అతను షేక్ సమీర్ గా తేలడంతో, అతను అన్ని నేరాలు చేసినట్టు ఒప్పుకున్నారు అని తెలిపారు. ఇతని వద్దనుండి ఒక చిన్న కత్తి, గంజాయి తాగే పరికరం, వెయ్యి రూపాయల నగదు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. జైలను శిక్ష అనుభవించి విడుదలైన మూడు రోజుల వివదిలోని తిరిగి నేరాలకు పాల్పడుతూ ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ముఖ్యంగా ఆలయాలలో దొంగతనాలను నిర్వహిస్తూ నేరాలకు పాల్పడుతున్న నిందితుడు అని తెలిపారు. మిగిలిన ముఠా సభ్యులను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐ విష్ణు ప్రకాష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments