... మన ఆరోగ్యం: అక్షరతెలంగాణ
అల్ల నేరేడు పండ్ల (Jamun Fruits) సీజన్ ఇది. ఈ పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు తినకుండా ఉండలేరు. అల్లనేరేడు పండ్ల సీజన్ వచ్చేసింది. చాలా ఔషధ గుణాలు ఉన్న ఈ పండ్ల ధర మార్కెట్లో కాస్త ఎక్కువగానే ఉన్నా.. వీటిలో పోషకాలు కూడా అంతే విలువైనవని గుర్తు పెట్టుకోవాలి. ప్రొటీన్, కాల్షియం, కార్బొహైడ్రేట్లు, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, విటమిన్ సీ, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బీ6, విటమిన్ ఏ, ఆరోగ్యకరమైన కొవ్వుల సమ్మేళనం అయిన అల్లనేరేడు పండ్లు అనేక వ్యాధులను నియంత్రించే శక్తికలిగినవని గుర్తించాలి. అల్లనేరేడు పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని వైద్యులు తరచూ చెబుతుంటారు.
అల్లనేరేడు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రీయంగా రుజువైంది. వీటిలో పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తరచుగా అల్ల నేరేడు పండ్లు తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. మీ గుండె సక్రమంగా పనిచేసేందుకు పొటాషియం సహకరిస్తుంది. అంతేకాకుండా స్ట్రోక్ రాకుండా, హై బ్లడ్ ప్రెషర్ రాకుండా నిరోధిస్తుంది. వరంగల్ కేంద్రానికి చెందిన నరసింగం గత 20 సంవత్సరాలుగా పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఒక్కో సీజన్లో రకమైన పండ్లు అమ్ముతారు.
మార్కెట్లో ఎక్కడ చూసినా అల్ల నేరేడు పండ్లు కనిపిస్తున్నాయి. నల్లగా నిగ నిగ లాడుతూ నోరు ఊరిస్తున్నాయి. ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తినడం అలవాటు చేసు కోవాలని పెద్దలు చెబుతారు. అసలు అల్ల నేరేడు పళ్లు తింటే ప్రయోజనాల గురించి తెలుసా? తినకుండా ఉండలేరు. లభించే ఔషధ తెలిస్తే మీరు
ఇండియన్ బ్లాక్బెర్రీ, జామూన్, లేదా జావా ప్లం ఈ పేరుతో పిలిచినా.. రుచి మాత్రం వగరు, తీపి కలయికతో గమ్మత్తుగా ఉంటుంది. మార్కెట్నుంచి తీసుకొచ్చిన కాయలను ఉప్పు నీళ్లలో వేసి శుభ్రంగా కడిగిన తరువాత తినాలి.
అల్ల నేరేడు పోషకాల గని. ఆరోగ్యకరమైన కొవ్వుల సమ్మేళనం. ఆంథోసైనిన్లు, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్తో సహా యాంటీఆక్సిడెంట్లు మెండు. ఇంకా ప్రొటీన్, కాల్షియం, కార్బొహైడ్రేట్లు, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, విటమిన్ సీ, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ విటమిన్ ఏ, పుష్కలంగా లభిస్తాయి. నేరేడు పండు మాత్రమే కాదు, ఆకులు, గింజల్ని ఔషధాలుగా వాడతారు.
అల్ల నేరేడు బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకు చక్కటి ఔషధంలా పని చేస్తుంది. ఈ పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. రకాల ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా అడ్డుకుంటాయి. అలాగే దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
అల్ల నేరేడు- లాభాలు
అల్లనేరేడులో పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రమాదాన్ని నివారిస్తుంది. అధిక రక్తపోటు
కాలుష్యంగా కారణంగా దెబ్బతిన్న శ్వాస నాళాలు, ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. వీటిలో ఉండే జింక్, విటమిన్ సీ ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి.
అల్ల నేరేడులో ఉండే సైనైడిన్ వంటి సమ్మేళనాలు కొలన్ కేన్సర్ను నిరోధించే శక్తిని కలిగి ఉంటాయి.
డయాబెటిక్ రోగులకు నేరేడు పళ్లు చాలా మేలు చేస్తా అధిక మూత్ర విసర్జన, దాహం వంటి డయాబెటిస్ లక్షణాలను తగ్గిస్తాయి. వీటిల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడానికి దోహదం చేస్తుంది. ఈ పండులో జాంబోలిన
అనే సమ్మేళనం పిండి పదార్ధాన్ని చక్కెరగా మార్చడాన్ని నిరోధించడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
వీటిల్లోని యాంటాక్సిడెంట్ల సమ్మేళనాలు, విటమిన్ సీ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. ఫలితంగా చర్మం మెరుస్తుంది. అంతేకాదు చాలాకాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు విస్తర్జిస్తుంది. పేగుల్లో చుట్టుకు పోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉందని పెద్దలు చెబుతారు.
పిండిపదార్థం, కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కనుక అధిక బరువు ఉన్నవారు కూడా తినవచ్చు. ఇందులోని అంతేకాదు ఫైబర్ కంటెంట్ సరైన జీర్ణక్రియకు దోహదపడి, అనవసరమైన కొవ్వు పెరగకుండా అడ్డుపడుతుంది.
అల్లనేరేడు పండ్ల సీజన్ వచ్చేసింది. చాలా ఔషధ గుణాలు ఉన్న ఈ పండ్ల ధర మార్కెట్లో కాస్త ఎక్కువగానే ఉన్నా.. వీటిలో పోషకాలు కూడా అంతే విలువైనవని గుర్తు పెట్టుకోవాలి. ప్రొటీన్, కాల్షియం, కార్బొహైడ్రేట్లు, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, విటమిన్ సీ, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బీ6, విటమిన్ ఏ, ఆరోగ్యకరమైన కొవ్వుల సమ్మేళనం అయిన అల్లనేరేడు పండ్లు అనేక వ్యాధులను నియంత్రించే శక్తికలిగినవని గుర్తించాలి. అల్లనేరేడు పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని వైద్యులు తరచూ చెబుతుంతారు.
అల్లనేరేడు పండ్లు తినడం వల్ల లాభాలు
అల్లనేరేడు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రీయంగా రుజువైంది. వీటిలో పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తరచుగా అల్ల నేరేడు పండ్లు తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. మీ గుండె సక్రమంగా పనిచేసేందుకు పొటాషియం సహకరిస్తుంది. అంతేకాకుండా స్ట్రోక్ రాకుండా, హై బ్లడ్ ప్రెషర్ రాకుండా నిరోధిస్తుంది.
శ్వాస నాళాలు, ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది.
విష వాయువులు, వాయు కాలుష్యం కారణంగా దెబ్బతిన్న ఊపిరితిత్తులు, శ్వాసనాళాలను శుభ్రం చేసే శక్తి అల్ల నేరేడు పండ్లకు ఉంది. వాయు కాలుష్యం కారణంగా ఎదురయ్యే ఫ్రీరాడికల్సు ఇవి నియంత్రిస్తాయి. వీటిలో ఉండే జింక్, విటమిన్ సీ ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి.
కొలన్ క్యాన్సర్ను నిరోధిస్తుంది.
అల్ల నేరేడులో ఉండే సైనైడిన్ వంటి సమ్మేళనాలు కొలన్ క్యాన్సర్ను నిరోధించే శక్తిని కలిగి ఉంటాయి. అల్లనేరేడు పండ్లలో ఉండే యాంటాక్సైడ్లు ఫ్రీరాడికల్స్పై పోరాడుతాయి. క్యాన్సర్ కణాలు వృద్ధిని అడ్డుకుంటాయి.
డయాబెటిస్కు చికిత్సగా:
అల్ల నేరేడు పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడానికి దోహదం చేస్తాయి. అధిక మూత్ర విసర్జన, దప్పిక వంటి డయాబెటిస్ లక్షణాలను అల్ల నేరేడు
కొలాజెన్ పెంచుతాయి
అల్లనేరేడు పండ్లు తింటే చర్మం మిలమిల మెరుస్తుంది. వీటిలోని యాంటాక్సిడెంట్ల సమ్మేళనాలు, విటమిన్ సీ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. అందుకే చర్మం యవ్వనాన్ని సంతరించుకుంటుంది.
ఇతర ప్రయోజనాలు
అల్ల నేరేడు పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను ఇవి అడ్డుకుంటాయి. అలాగే దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
మధుమేహ నివారణలో..
రక్తంలో చక్కెర నిల్వల స్థాయిలను క్రమబద్దీకరించడంలో జామూన్లు చాలా గొప్పగా పనిచేస్తాయి. వీటి గింజల్లో జంబోలిన్, జాంబోసిస్ అనే సమ్మెళనాలు ఉండి వీటిని తినగానే రక్తంలోకి చక్కెర విడుదల రేటును నియంత్రిస్తాయి. జామూన్ విత్తనాలు కూడా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి.
ఫైబర్ కలిగి ఉండి..
అల్లనేరేడు కడుపు ఆరోగ్యాన్ని పెంచుతాయి. వీటి గింజలను తినడం వల్ల కడుపు సంబంధ సమస్యలను నివారించవచ్చు. వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇవి పేగుల్లో పుండ్లు, మంట, పూతలను ఎదుర్కోవడానికి ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు.
రక్తపోటు నివారణలో..
నేరేడు పండ్లు రక్తపోటు నివారణలో గ్రేట్గా పనిచేస్తుంది. వీటి విత్తనంలో ఎల్లాజిక్ యాసిడ్ అనే యాంటీఆక్సిడెంట్ రక్తపోటు హెచ్చుతగ్గులను తనికీ చేయడంలో సహాయపడుతుంది. రక్తపోటుతో బాధపడేవారు వీటిని ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటప
రోగనిరోధక శక్తిలో..
అల్ల నేరేడు గింజల్లో ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తాయి. అలాగే వీటిలోని ఫ్రీ రాడికల్స్ను దూరంగా ఉంచడంలో సహాయపడే ఫినాలిక్ సమ్మేళనాలు ఉంటాయి.
బరువు తగ్గడంలో..
శరీరం బరువు తగ్గడంలో నేరేడు పండ్లు సహకరిస్తాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండి ఆకలి భావన రాకుండా చూస్తాయి. ఫలితంగా శరీరం బరువు తగ్గించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుంది.
అదేవిధంగా రక్తాన్ని శుద్ధి చేయడంలో, క్యాన్సర్ల కణాలు వృద్ధి చెందకుండా చేయడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, నోటిలో దంతాలు, గమ్ ఆరోగ్యంగా ఉంచడంలో, కిడ్నీ సమస్యలు రాకుండా ఉండేందుకు, ఆస్తమా నుంచి ఉపశమనానికి, అల్సర్లు రాకుండా చూడటానికి, ఓర్పును పెంచడానికి సహాయపడుతుంది. వికారం, వాంతులను దూరం చేస్తుంది. వయసు పెరగడం వల్ల వచ్చే అనర్థాలకు అడ్డుకట్ట వేసి, దీర్ఘకాలం యవ్వనంగా ఉంచుతుంది. చర్మంపై వచ్చే తెల్లమచ్చలను తగ్గిస్తుంది. ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. రుమాటిక్ నొప్పులు, గౌట్ సమస్య వల్ల కలిగే బాధలు దూరమవుతాయి.
Comments