రైతుల ఖాతాలలో పంట పెట్టుబడి నిధులు జమ అన్నదాతల్లో ఆనందం - జిల్లా కలెక్టర్ రాజర్షి షా:

Madupa Santhosh CEO
ADB :  రైతుల ఖాతాలలో  పంట పెట్టుబడి నిధులు జమ అన్నదాతల్లో ఆనందం - జిల్లా కలెక్టర్ రాజర్షి షా: అదిలాబాద్ : అక్షరతెలంగాణ
వ్యవసాయాన్ని పండుగలా  మారుస్తూ, రైతులకు బాసటగా నిలవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా* పథకం వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన అదిలాబాద్ జిల్లాలోని  రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్  తెలిపారు.
వానాకాలం - 2025 సీజన్ కు సంబందించి పంట పెట్టుబడి సాయం క్రింద రైతుల బ్యాంకు ఖాతా వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు ఇప్పటికే రైతు భరోసా పోర్టల్ లో నమోదు చేశారని అన్నారు. ఈ వివరాలకు అనుగుణంగా పెట్టుబడి సాయం కింద  మంగళవారం మూడెకరాల వరకు సాగు భూమి ఉన్న  84,991 మంది రైతులకు 93.51 కోట్లు వారి ఖాతాలో జమచేయడం జరిగిందన్నారు.
 
మొత్తంగా జిల్లాలో  1,68,238  మంది రైతులు 342.30 కోట్లు 

కొత్తగా పట్టాలు పొందినవారు వారి బ్యాంక్ ఖాతా వివరాలు సంభందిత వ్యవసాయ విస్తరణాధికారికి ఈ నెల 20 వ తేదీ లోగా సమర్పించాలని ఆన్నారు. 

మిగతా రైతులకు కూడా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం రైతు భరోసా నిధులను వారి వారి ఖాతాలలో జమ చేయనుందని తెలిపారు. పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు రైతు భరోసా ఉపయుక్తంగా నిలుస్తుందని కలెక్టర్ అన్నారు. 

 వానాకాలం సాగు ప్రారంభానికి ముందే ప్రభుత్వం రైతు భరోసా నిధులు అందించడం తో  రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అజోల్లా సాగు, ఇందిరమ్మ ఇళ్లు అంశాల పై సమీక్షా సమావేశం నిర్వహించిన - జిల్లా కలెక్టర్ 
అదిలాబాద్ : అక్షరతెలంగాణ
 కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
 పంచాయతీ అడ్వాన్స్  ఇండెక్స్ ఎస్.ఎస్.జి-2025
PM జన్ మన్ , DA JGUA EGS కింద అజోల్లా సాగుఇందిరమ్మ ఇళ్లు అంశాల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.

1.పీఎం జన్మన్  జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ సదస్సులు (Saturation Campaign)ఈ నెల 15 వ తేదీ నుండి 30 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతున్నదని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం కింద ఆదిలాబాద్ జిల్లాలో 150 గ్రామాలు ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.ఈ సదస్సుల ద్వారా గిరిజనులకు అవసరమైన అన్ని రకాల ప్రభుత్వ సదుపాయాలు — ఆరోగ్యం, విద్య, నివాసం, విద్యుత్, మంచినీరు, రోడ్లు తదితర రంగాల్లో — అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందుకు సంభందిత అధికారులు తగు చర్యలు చేపట్టాలని ఆన్నారు 

ధర్తి ఆభ జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్" కార్యక్రమం యొక్క భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని 15 గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించబడు తున్నాయని, ఈ సమావేశాలలో వివిధ రకాల దరఖాస్తులను పరిశీలించి, వాటిని నిర్ణీత కాలంలో పరిష్కరించి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఈ పథకం ప్రధాన లక్ష్యం ఎంపిక చేయబడిన గ్రామాల్లో అన్ని రకాల వసతులను సమగ్రంగా మెరుగుపరచడం ఆన్నారు.

2 అజోల్లా సాగు అనేది నీటిలో పెరిగే చిన్న ఫెర్న్ అయిన అజోల్లాను పెంచే ప్రక్రియ. ఇది పశువులు, కోళ్ళకు మంచి దాణా  వరి పొలాలకు జీవ ఎరువుగా ఉపయోగపడుతుందని దీనికి సంబంధించి అన్ని చర్యలు చేపట్టాలని ఆన్నారు. 
అజోల్లా సాగులో ముఖ్యమైన అంశాలు:
సరైన ప్రదేశం:
అజోల్లా పెరగడానికి నీడ  సూర్యరశ్మి అవసరం, కాబట్టి 30-50% సూర్యరశ్మి వచ్చే ప్రదేశం అనుకూలం. 
నీటి మట్టం:
నీటి మట్టం కనీసం 5 అంగుళాలు ఉండేలా చూసుకోవాలి. 
ఉష్ణోగ్రత:
20-35°C ఉష్ణోగ్రత పరిధిలో అజోల్లా బాగా పెరుగుతుంది. 
pH స్థాయి:
నీటి pH స్థాయి 5 నుండి 7 మధ్య ఉండాలి. 
ఆరోగ్యకరమైన అజోల్లా:
తెగుళ్ల బారిన పడకుండా ఉండటానికి 2 గ్రాముల కార్బోఫ్యూరాన్ కలిపి తాజా 
అజోల్లాను నీటిపై వేయడం:
సిద్ధం చేసిన అజోల్లా విత్తనాలను నీటి ఉపరితలంపై చల్లాలి. 
నీటి మట్టం నిర్వహణ:
ప్రతిరోజూ నీటిని పోస్తూ నీటి మట్టాన్ని నిర్వహించాలి. 
పంట కోత:
దాదాపు 2 వారాలలో అజోల్లా నీటి ఉపరితలంపై ఒక చాపలాగా ఏర్పడుతుంది. 
అజోల్లా ఉపయోగాలు:
పశువుల దాణా:
అజోల్లాలో అధిక ప్రోటీన్ శాతం ఉండటం వలన పశువులు మరియు కోళ్ళకు మంచి దాణాగా ఉపయోగపడుతుంది. 
జీవ ఎరువు:
వరి పొలాలలో కలుపు మొక్కలను అరికట్టడానికి మరియు పంట దిగుబడిని పెంచడానికి జీవ ఎరువుగా ఉపయోగపడుతుంది. 
మట్టిని మెరుగుపరచడం:
అజోల్లా మట్టి యొక్క భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలను మెరుగుపరుస్తుంది, సేంద్రియ పదార్థాన్ని పెంచుతుంది. 
నీటిని శుద్ధి చేయడం:
అజోల్లా నీటిలో ఉన్న నత్రజనిని గ్రహించి నీటిని శుద్ధి చేస్తుంది. 
ఆహారంగా:
అజోల్లాను సూప్‌లు, బర్గర్‌లు, పాన్‌కేక్‌లు వంటి ఆహార పదార్థాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. 
అజోల్లా సాగుకు సంబంధించిన సూచనలు:
అజోల్లా సాగుకు తక్కువ స్థలం మరియు తక్కువ నిర్వహణ అవసరం.
భారతదేశంలో, అజోల్లా సాగును ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అజోల్లాను పెంచడం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో అధిక పోషకాలున్న దాణాను పొందవచ్చు.
అజోల్లాను పెంచడం వలన పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది, ఎందుకంటే ఇది రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందని అవగాహన కల్పించారు.
3.జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో భాగంగా కొనసాగుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు, వెరిఫికేషన్, గ్రౌండింగ్ ప్రొసీడింగ్స్ కాపీలు మంజూరు  ఇవ్వడం జరిగిందని,  బేస్మెంట్ లెవెల్  అయిన వాటికి దశలవారీగా బిల్లులు చెల్లించడం జరుగుతుందని, జూన్ 30 వరకు జిల్లాలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు,
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఇందిరమ్మ ఇండ్ల పథకం లో ఎలాంటి జాప్యం లేకుండా సమయానుకూలంగా విధులు నిర్వహించి, లక్ష్యాలను సాధించాలని సూచించారు.
అమరవీరులకు , ఇతర లబ్ధిదారులకు  కేటాయించిన 
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని , మేస్త్రీలు సరిగా పనిచేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

మొదటి విడతలో 
మంజూరు అయినవి -2132
మార్కువుట్ చేసినవి -1368
బేసెమెట్ లెవెల్ -631
రూఫ్ లెవెల్ -69
RC -2
మొత్తం -702

2వ విడతలో 
మంజూరు అయినవి -6955
మార్కువుట్ చేసినవి -2298
బేసెమెట్ లెవెల్ -21
రూఫ్ లెవెల్ -0
RC -0
మొత్తం -21

1 & 2 విడతల్లో  
మంజూరు అయినవి -9087
మార్కువుట్ చేసినవి -3666
బేసెమెట్ లెవెల్ -652
రూఫ్ లెవెల్ -69
RC -2
మొత్తం -723

SSG 2025 : "స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2025" (Swachh Survekshan Grameen 2025) యొక్క గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి పరిశుభ్రతను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఒక సర్వే లో భాగంగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ద్వారా తాగునీరు  పారిశుద్ధ్య విభాగం (DDWS) ద్వారా సర్వే నిర్వహించాలని ఈ సర్వే యొక్క ప్రస్తుత సంవత్సరం.  2025 సంవత్సరంలో ఈ సర్వే నిర్వహించబడుతుందన్నారు.
లక్ష్యం:
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య స్థితిని అంచనా వేయడం  పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత మెరుగుపరచడం ఈ సర్వే యొక్క ప్రధాన లక్ష్యం. 
ఈ సర్వే ద్వారా ప్రజలలో పరిశుభ్రత  పారిశుద్ధ్యంపై అవగాహన పెంచడం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయడం వంటివి జరుగుతాయన్నారు.
పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ (PAI)  గ్రామ పంచాయతీల పనితీరును అంచనా వేయడానికి గ్రామీణాభివృద్ధి, సుపరిపాలన, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో పంచాయతీల పురోగతిపై రివ్యూ చేశారు.
ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్ డి ఓ వినోద్ కుమార్, సంబంధిత జిల్లా అధికారులు , మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments