ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

Madupa Santhosh CEO
NRML : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
నిర్మల్ : అక్షరతెలంగాణ
సొన్ మండలం సిద్ధులకుంట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని 23 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు  సత్యనారాయణ గౌడ్, సరికెల గంగన్న మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, మహిపాల్ రెడ్డి, నోముల గంగారెడ్డి,  నర్సారెడ్డి,  భూమేష్, సంతోష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నవీన్ రెడ్డి, సాయన్న, గంగన్న, సురేష్ , తో పాటు తదితరులు పాల్గొన్నారు.

 లక్ష్మణ్ చాంద మండలంలో : 
పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న  బీజేపి సిఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

లక్ష్మణ్ చందా మండలం బాబాపూర్, రాచాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు. అనంతరం గ్రామాల్లోని లబ్ధిదారులకు బాబాపూర్(30), రాచాపూర్(33) ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ గౌడ్, మండల అధ్యక్షులు చిన్నయ్య, నాయకులు తాజా మాజీ ఎంపీపీ అడ్వాల పద్మా రమేష్, మాజీ ఎంపీటీసీ పోషెట్టి, మోహన్ రెడ్డి,జీవన్ రెడ్డి, గంగారెడ్డి, శ్రీధర్ రెడ్డి, రాజేశ్వర్, మల్లేష్, లక్ష్మణ్, లింగ గౌడ్, లక్ష్మణ్, పోషెట్టి, B పోషెట్టి, పెంటాజి, రాజన్న, బోర్రన్న, పోషెట్టి, మధు, సురేష్,సురేష్, నరేష్, పురుషోత్తం, తో పాటు తదితరులు పాల్గొన్నారు.


ఇల్లు లేని అర్హులకు తప్పకుండా ఇళ్లు.
ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ స్పష్టత
నిర్మల్: అక్షరతెలంగాణ
         ఇల్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. ఖానాపూర్ మండలం లింగాపూర్ గ్రామంలో కొందరు గ్రామస్తులు ఇందిరమ్మ ఇండ్ల కోసం ధర్నా చేసిన విషయంపై స్పందిస్తూ, మంగళవారం సాయంత్రం ఆమె ప్రకటన విడుదల చేశారు.
   ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన నిరుపేదలను గుర్తించి దశలవారీగా ఇండ్లను కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం జాబితాలో లేనివారిలో అర్హులు ఉంటే, వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను పునఃసమీక్షించి అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ తెలిపారు.


పుకార్లను నమ్మవద్దు – విద్యార్థుల తరగతులు యథావిధిగా కొనసాగుతున్నాయి - జిల్లా కలెక్టర్

     నిర్మల్:  ఖానాపూర్ మండలంలోని రాజుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల గేటుకు సోమవారం కాంట్రాక్టర్ తాళం వేసిన ఘటనపై జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి పాఠశాల తెరిపించింది. ప్రస్తుతం విద్యార్థులు యథావిధిగా తరగతులకు హాజరవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అనవసర పుకార్లు, అపోహలు వ్యాపిస్తున్నాయి. పుకార్లను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం ద్వారా గందరగోళం సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ప్రజలు, తల్లిదండ్రులు ఏవిధమైన భయాందోళన లేకుండా విద్యార్థులను పాఠశాలకు పంపాలని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.
Comments