ADB: క్రమశిక్షణతో జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగగలరు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అదిలాబాద్ : అక్షరతెలంగాణ
చిన్ననాటి నుండి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలి.
- 350 మంది పిల్లలకు సర్టిఫికెట్ల అందజేత.
- నెలరోజుల పాటు కొనసాగిన సమ్మర్ క్యాం.
- సమ్మర్ క్యాంప్ నందు విద్యార్థిని విద్యార్థులకు చక్కటి అంశాలు బోధన.
- విద్యార్థులచే కళా ప్రదర్శనలు, పోలీసు జాగిలాలచే ప్రత్యేక ప్రదర్శన.
- సమ్మర్ క్యాంపు విజయవంతానికి కృషి చేసిన సిబ్బందికి, ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన జిల్లా ఎస్పీ.
ఆదిలాబాద్ జిల్లాలోని చిన్నారులు, పిల్లలకు ఆటవిడుపుగా వేసవి కాలం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లాలో నాలుగు చోట్ల నెలరోజులపాటుగా పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు, నార్నూర్ ఇంద్రవెల్లి ఇచ్చోడ లలో వేసవి శిబిరాలను సమ్మర్ క్యాంపలను నిర్వహించి ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు చోట్ల జిల్లా వ్యాప్తంగా దాదాపు 600 మంది విద్యార్థులు సమ్మర్ క్యాంపుల నందు పాల్గొనడం జరిగింది. ఈరోజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు తమ అమూల్యమైన సందేశాన్ని అందజేశారు. మొదటగా జిల్లా ఎస్పీకి చిన్నారుల కరతాల ధ్వనుల నడుమ ఘన స్వాగతాన్ని పలికారు. తదుపరి చిన్నారులచే నృత్య ప్రదర్శనలు నిర్వహించారు, యోగ కరాటే నందు చిన్నారులు నెలరోజుల పాటు తీసుకున్న శిక్షణను ప్రదర్శించారు. తదుపరి జిల్లా పోలీసు జాగిలాల బృందం పోలీసు జాగిలాలు చేసే వివిధ రకాలైనటువంటి విధులను చిన్నారులకు సవివరంగా వివరించి, ప్రదర్శన చేశారు. తదుపరి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు చిన్ననాటి నుండి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని తెలిపారు. పిల్లలు ముఖ్యంగా క్రమశిక్షణ ను తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు. పిల్లలకు క్రమశిక్షణతో పాటుగా వ్యాయామ శారీరక అలవాట్లను తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఆరోగ్యం మహాభాగ్యంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడు దానికి మించిన ఆస్తులు లేకుండా ఉంటాయని తెలిపారు. ప్రతిరోజు ఏదైనా ఒక మంచి అలవాటును అలవర్చుకోవాలని తెలిపారు. ఏదైనా ఒక హాబీ ఏర్పాటు చేసుకొని దానిని కచ్చితంగా పాటించే దిశగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ఏర్పాటు చేసుకోవాల్సిన హాబీలలో పుస్తకాలు చదవడం, డాన్సింగ్, శారీరకంగా కష్టపడే ఆటలు, వంటలు, గార్డెనింగ్ ఇలాంటివి నేర్చుకోవాలని తెలిపారు. వీటివల్ల ఓర్పు వినయం మంచి అలవాట్లు వస్తాయని తెలిపారు. ఈ సమ్మర్ క్యాంప్ విజయవంతానికి కృషి చేసిన రిజర్వ్ సిబ్బంది మరియు యోగా టీచర్,కరాటే టీచర్, గేమ్స్ టీచర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి బి సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐ సిహెచ్ కరుణాకర్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, రిజర్వ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments