ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా అమ్మా ఆదర్శ కమిటీలు చొరవ చూపాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా.

Madupa Santhosh CEO
 ADB : ప్రభుత్వ పాఠశాలల్లో  విద్యార్థుల సంఖ్య  పెరిగేలా అమ్మ ఆదర్శ కమిటీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా.
అదిలాబాద్ : అక్షరతెలంగాణ 
చుట్టుపక్కల గ్రామాల  పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేలా విస్తృత  ప్రచారం చేయాలి

 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
 విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత కల్పించాలి
పాత భవనాలు ఏమైన ఉంటే వాటి వివరాలు 
పాఠశాల ఆవరణలు పరిశుభ్రంగా ఉంచాలి
జూన్ 12 నుండి పాఠశాలలు ప్రారంభంకానున్న  సందర్భంగా పాఠశాల గదులు, టాయిలెట్స్, కిచెన్ షెడ్స్, శుభ్రపరచాలి
బియ్యం, తదితర సరుకులు పై ప్రత్యేక దృష్టి సారించి చెడిపోయిన సరుకులు ఏమైన ఉంటే తీసివేయాలి;

బడి బాట, పాఠశాల ప్రారంభ సన్నద్ధత, జీరో ఎన్‌రోల్‌మెంట్ పాఠశాలల నమోదును పెంచడానికి MEOలు/సెక్టార్ ఆఫీసర్ O/O DEO తీసుకున్న చర్యలు (MEOలు, సెక్టార్ ఆఫీసర్  రాబోయే కార్యాచరణ ప్రణాళిక 
నమోదు కోసం ఓపెన్ స్కూల్ సర్వే పురోగతి ఫాలో అప్ (ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్, DRDO కార్యాచరణ ప్రణాళిక
ఉల్లాస్ సర్వే పురోగతి & నమోదు కోసం దశలు (DDAE, DRDO కార్యాచరణ ప్రణాళిక
నోట్ బుక్, టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ పంపిణీ (మండలం & స్కూల్ వారీగా నివేదిక) నోట్ బుక్ మేనేజర్ కార్యాచరణ ప్రణాళిక

యూనిఫాం కుట్టు పురోగతి నివేదిక (DRDO మండలాల వారీగా పురోగతి & మొత్తాన్ని సంబంధిత , పట్టణ ప్రాంతాలకు కూడా మున్సిపల్ కమిషనర్.

పని ప్రదేశం పిల్లల సర్వే, ఆపరేషన్ స్మైల్ / ముస్కాన్ రక్షించబడిన పిల్లల నమోదు / విద్య స్థితి.  పలు అంశాల పై 
సీఈఓ, డి ఆర్డి ఏ, , GM DIC
ED SC కార్పొరేషన్, ,DSCDO
DWO, DMWO, AD మైన్స్
మున్సిపల్ కమీషనర్
DTDO గిరిజన సంక్షేమం, విద్యా శాఖ, DCPO (పిల్లల రక్షణ), AC/DC లేబర్
సెక్టార్ అధికారులు
MINE టెక్స్ట్ బుక్ కోఆర్డినేటర్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ లతో మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమీక్షా నిర్వహించారు 
 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అత్యంత ప్రాధాన్యత 
ఇస్తున్నందున ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా కృషి చేయాలని అన్నారు.

 పాఠశాలలో  మెరుగైన సదుపాయాలు కల్పించడం జరిగిందని, పాఠశాల విద్యార్థులతో కళకళలాడేలా చుట్టుపక్కల గ్రామాల పిల్లలు ఎక్కువగా పాఠశాలకు వచ్చే విధంగా  అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు  పాఠశాలల్లోని సౌకర్యాల గురించి
విస్తృత ప్రచారం,  పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.   అదేవిధంగా త్వరలో చేపట్టబోయే బడిబాట కార్యక్రమంలో కూడా విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
బడిబాట ;-
బడిబాట షెడ్యూల్‌ 2025 రోజువారీ కార్యక్రమాలు ఇవే..
జూన్‌ 6న స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ పెద్ద ఎత్తున గ్రామసభ నిర్వహించాలి.
జూన్‌ 7న ఉపాధ్యాయులు ప్రతి ఇంటిని సందర్శించి బడీడు పిల్లలను గుర్తించాలి.
జూన్‌ 8, 9, 10 తేదీల్లో కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేయాలి. అలాగే గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన చేపట్టాలి. గ్రామాల్లోని డ్రాపౌట్‌ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేలా ఏర్పాట్లు చేయాలి. ప్రత్యేకావసరాలున్న పిల్లలను గుర్తించి అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించాలి.
జూన్‌ 11వ తేదీన జూన్‌ 6 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడం జరుగుతుంది.
జూన్‌ 12న అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించాలి. అదేరోజు బడిలో చేరిన విద్యార్థులకు పాఠ్య, నోట్‌ పుస్తకాలతోపాటు యూనీఫాం కూడా అందించాలి.
జూన్‌ 13న ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్థులతో మీటింగ్‌ ఏర్పాటు చేసి సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ నిర్వహించాలి.
జూన్‌ 16న ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌), లెర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (లిప్‌) దినోత్సవం జరపాలి.
జూన్‌ 17న అన్ని పాఠశాలలలో సమీకృత విద్య, బాలిక విద్యా దినోత్సవం నిర్వహించాలి. బాలికా వివాహాలు, చిన్నారులపై వేధింపులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలి.
జూన్‌ 18న తల్లిదండ్రులను, గ్రామస్థులను పాఠశాలలకు ఆహ్వానించి తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన డిజిటలీకరణ, ఇతర ఆధునిక సౌకర్యాలను చూపించి, వాటి గురించి వివరించాలి.
జూన్‌ 19న బడిబాట ముగింపు రోజు. ఈ రోజున విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేయాలి.

పాఠశాలలో  చెత్తాచెదారం  తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని అలాగే విద్యార్థుల క్రీడలకు అనువుగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. పాఠశాలలో  మరమ్మత్తులు చేపట్టి పాఠశాలలను  జూన్ 12 నాటికి అందుబాటులో ఉంచాలని అలాగే పాఠశాల ప్రహరీ గోడ తో పాటు ఎంట్రన్స్ గేటుకు మరమ్మత్తులు చేపట్టాలని  ఆదేశించారు.

 పిల్లల విద్యా ప్రమాణాలు పెరగాలంటే గుణాత్మకమైన విద్యతోపాటు  పాఠశాలలో  మౌలిక వసతులు కల్పించాలని  ఆదేశించారు. 

యూనిఫాం :
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు shg గ్రూప్ ల ద్వారా  స్థిచ్చింగ్  ఇవ్వడం జరిగిందని జూన్ మొదటి వారం లోగా పూర్తి చేయాలని, తెలిపారు.
మొత్తం  58557  కుట్టవలసినవి
బాలికలు 26666, బాలురు 28,891
అందులో 32,O23 కుట్టినవి, 
కుట్టవలసినవి 26530

ఆపరేషన్ ముష్కాన్, ఆపరేషన్ స్మైల్ లో బడి మానివేసిన వారిని ఎంతమందిని గుర్తించారు, ఎంతమంది స్కూల్, కాలేజ్, తదితర ఈ 5 సంవత్సరాల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని ఆపరేషన్ మష్కాన్ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు 

నోట్ బుక్స్, తదితర మండలాలకు చేరుకున్న వివరాలను అడిగి తెలుసుకొని స్కూల్ వారీగా ఎన్ని బుక్స్ వచ్చాయో వివరాలు నమోదు చేసుకోవాలని ఆన్నారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, జిల్లా విద్యాదికారి.,  కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు,  తదితరులు పాల్గొన్నారు 
Comments