ADB: ప్రజావాణి దరఖాస్తుల ను తక్షణమే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Madupa Santhosh CEO
ప్రజావాణి దరఖాస్తుల ను తక్షణమే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
అదిలాబాద్ :  (కలెక్టరేట్) : అక్షర తెలంగాణ
ప్రజావాణి లో  131 దరఖాస్తులు ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ సలోని లతో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 
ఆర్జీదారుల నుండి వివిధ సమస్యల పై సమర్పించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు ఇస్తూ తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయా శాఖల కు సంబంధించిన 131 దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని తెలిపారు.
అనంతరం సీఎం ప్రజావాణి పెండింగ్ దరఖాస్తుల పై ఆరా తీసి త్వరగా పరిష్కరించాలని ఆన్నారు.
అలాగే ప్రత్యేక అధికారులు రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్స్, రోజూ వారి మెనూ, ఉదయం, మధ్యహ్నం, రాత్రి భోజనం, స్నాక్స్ తదితర పర్యవేక్షించాలని, శానిటేషన్, రిజిస్ట్స్ట్లు, ఆన్ లైన్ చేకింగ్, టీచర్స్ రొజు స్కూల్స్ కి వస్తున్నారా లేదా ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ఎలా జరుగుతుంది, తదితర ఆకస్మిక తనిఖీలు చేయాలనీ, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు తమ తమ శాఖల పనితీరును ఆరా తీయాలని ఆన్నారు.
పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆద్వర్యం లో డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సెంజ్ తెలంగాణ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ గ్రీవెన్స్ లో ఆయా శాఖల జిల్లా అధికారులు, రెవెన్యు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా
అదిలాబాద్ : కలెక్టరేట్ : అక్షర తెలంగాణ 

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం  సాయంత్రం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో పొలం బాట రోడ్లు, గర్ల్స్ టాయిలెట్లు, గ్రామపంచాయతీ  భవనం, అంగన్వాడి కేంద్రాల నిర్మాణాలపై సమీక్ష సమావేశం   నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నూతనంగా మంజూరైన పనులను ప్రారంభించి, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 512 పొలం బాట రోడ్లు (650 కిలోమీటర్లు) 34 కోట్లు, 118 బాలికల మరుగుదొడ్లకు 2.36 కోట్లు, 99 గ్రామపంచాయతీ భవనాలకు 2.36 కోట్లు, 40 అంగన్వాడి కేంద్రాల నిర్మాణాలకు 4.80 కోట్లు మంజూరై, పనులు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. 

ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ శివరాం, సంబంధిత శాఖల అధికారులు అధికారులు పాల్గొన్నారు.
Comments