కుమురం భీం ఆసిఫాబాద్ : అక్షర తెలంగాణ
విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
జైనూర్: ఆదివాసీల ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ – బెట్టి ఎలిజబెత్ దంపతుల 39వ వర్ధంతి సభను జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క హాజరై డార్ఫ్ దంపతుల విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రే, ఎస్పీ నికిత పంత్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, నియోజకవర్గ ఇంచార్జ్ శ్యామ్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్లు కుడిమెత విశ్వనాథ్, ఇరుకుల్ల మంగ, స్థానిక సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుగుణక్కమాట్లాడుతూ…చారిత్రాత్మకమైన మార్లవాయి గ్రామ అభివృద్ధికి, డార్ఫ్ స్మృతి వనం, కాంస్య విగ్రహాల ఏర్పాటు కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇటీవల రూ.91 లక్షల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఇది ఆదివాసీలకు, డార్ఫ్ దంపతుల సేవలకు ఇచ్చిన గౌరవమని అన్నారు.హైమన్ డార్ఫ్ సేవా స్ఫూర్తితో నేటి అధికారులు పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆదివాసీ గూడాల్లో రహదారుల ఏర్పాటు, తాగునీటి సమస్యలు పూర్తిగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.డార్ఫ్ దంపతుల సేవలను స్మరిస్తూ ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సుగుణక్క స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Comments