అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తున్నాం: టీయూడబ్ల్యూజే

Madupa Santhosh CEO
HYD : అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తున్నాం: టీయూడబ్ల్యూజే
హైదరాబాద్: డెస్క్: అక్షరతెలంగాణ 
NTV జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్ లను అర్థ రాత్రి పోలీసులు అరెస్టు చేయడాన్ని టీయూడబ్ల్యూ జే పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. జర్నలిస్టులు గానీ, ఆ వార్త సంస్థ గాని  నిరాధారమైన, అసత్య వార్త కథనాలు రాస్తే ఆ విషయంలో ఖండన కోరుకోవచ్చు అప్పటికీ వారు స్పందించకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు కానీ, ఇలా అర్థరాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారిని అరెస్టు చేయడం సరైంది కాదు. ఈ ముగ్గురూ జర్నలిజంలో కొనసాగుతున్న సీనియర్ జర్నలిస్టులు. వీరి అరెస్టును తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఇదే సమయంలో జర్నలిస్టులకు సంఘం తరఫున ఒక సూచన కూడా చేస్తున్నాము. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారుల విషయంలో నిరాధారమైన వార్తలను ప్రసారం గాని, ప్రచురించవద్దని, ఆధారాలు ఉంటేనే వార్తలు వేయాలని, ముఖ్యoగా ఎవరి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్త కథనాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా మీడియా సంస్థలదే. ఏది ఏమైనా జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం అర్ధరాత్రి పూట తీవ్రవాదుల అరెస్టు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. వెంటనే ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని అరెస్టు చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
అల్లం నారాయణ, అధ్యక్షులు TUWJ.
ఆస్కాని మారుతీ సాగర్, ప్రధాన కార్యదర్శి TUWJ.
విష్ణు వర్ధన్ రెడ్డి, అధ్యక్షుడు, TEMJU
ఎ.రమణ కుమార్, ప్రధాన కార్యదర్శి, TEMJU.
Comments