ADB : చెనాక-కొరాట , సదర్ మాట్
ఆదిలాబాద్: డిజిటల్ న్యూస్: అక్షర తెలంగాణ
ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు సాగు నీరు విడుదల..!ఎట్టకేలకు
పదేళ్ల తర్వాత ప్రాజెక్టుల సాకారం.. ఆయకట్టు రైతుల్లో ఆనందం..!
పెన్ గంగా పరివాహక ప్రాంతాల్లో పదేళ్ల కిందట చేపట్టిన రెండు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని లోయర్ పెనుగంగా పై నిర్మించిన చెనాక కోర్ట బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పంప్ హౌస్ వద్ద పూజలు చేసి నీటిని విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ బేలా బోరజ్, బీంపూర్ మండలాలకు 51 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ద్వారా బీడు భూములు సస్య శ్యామలం కానున్నాయి.
భూ పరిహారం కింద రూ.71 కోట్లు రైతులకు అందజేత..
సీఎం రేవంత్ రెడ్డి చెనక కోరట బ్యారేజీ నుంచి 0.81 టీఎంసీల నీటిని ఎత్తిపోసే ప్ర ధాన కాలువకు పూజలు చేశారు. జైనథ్, బేల, బోరజ్ మూడు మండలాల పరిధిలో 42 కిలోమీటర్లు కాల్వల నిర్మాణం చేపట్టగా పూజలు చేసి పెన్గంగా జలాలను దిగు వకు వదిలి పెట్టారు. రూ.1,891 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ1,105 కోట్లు వెచ్చించారు. చెనాక కోరటప్రాజెక్టు ప్రారంభోత్స వంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. రెడ్డి. జూప ల్లి కృష్ణా రావు, ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, క లెక్టర్ రాజార్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సదర్ మాట్ బ్యారేజీ నీటిని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి.
సదర్మాట్ బ్యారేజీ ద్వారా వేల ఎకరాలకు సాగునీరు
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామ సమీపంలో నిర్మించిన సదర్మాట్ బ్యారేజీని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సదర్మాట్ బ్యారేజీ ద్వారా వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. 2016 అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును 676.592 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించగా, ఇందుకోసం 1,176 ఎకరాల భూమిని సేకరించారని పేర్కొన్నారు. ఈ బ్యారేజీ ద్వారా నిర్మల్ జిల్లా కడెం, ఖానాపూర్ మండలాల్లో 12 వేల ఎకరాలు, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ ప్రాంతాల్లో 5 వేల ఎకరాలు కలిపి మొత్తం 18,016 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో కడెం, ఖానాపూర్, కోరుట్ల మండలాల్లోని 34 గ్రామాల వ్యవసాయ భూములకు సాగునీరు అందనుందని వివరించారు. పాత సదర్మాట్ అనికట్, గంగానాలా ఆయకట్టు స్థిరీకరణకు 1.58 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నీటిని సాగు అవసరాలకు అనుగుణంగా విడుదల చేస్తామని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతుబంధు, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలతో పాటు, పంట ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్‌పీ జానకి షర్మిల, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments