ఆదిలాబాద్ : డిజిటల్ న్యూస్ అక్షర తెలంగాణ
మాజీ మంత్రి బి ఆర్ ఎస్ నాయకులు జోగు రామన్న ను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.
శుక్రవారం రోజున ఉమ్మడి జిల్లాలలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ఈ సందరభంగా ఆదిలాబాద్ లో ముందుగా చనకా కొరడా బ్యారేజీ పంప్ హౌస్ ట్రయల్ రన్ ను ప్రారంభించనున్నారు. అనంతరం నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ గ్రామ సమీపంలోని గోదావరి నదిపై నిర్మించిన సదర్ మాట్ బ్యారేజ్ ను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మద్యాన్నం ప్రారంభించానున్నారు. ఆపై నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి జోగు రామన్న ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసులు రాత్రి నుంచి గస్తీ కాస్తున్నారు. బయటకు వెళ్లకుండా ముందస్తుగా జాగ్రత్తపడ్డారు. పలువురిని రాత్రిపూట అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చనాక కొరట ప్రాజెక్టు ట్రయల్ రన్ కు రావడం సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి 50వేల ఎకరాలకు నీరు అందించాలనే సంకల్పంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి రైతులకు నీరందించాలన్న సంకల్పంతో కృషి చేస్తుంటే.. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఒక ఎకరాకు కూడా నీరు అందించలేని ట్రయల్ రన్ చేయడం దానిని సీఎం ప్రారంభించడం సిగ్గుచేటు మాలిన చర్య అని మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజమెత్తారు.
ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి అండగా ఉంటూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం పర్యటన ముట్టడి పిలుపునివ్వగా శనివారం అర్ధరాత్రి నుండే పోలీసులు ముందస్తులు అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అని జోగు రామన్న మండిపడ్డారు. బెల,జైనథ్, ఆదిలాబాద్ మండల నాయకులను ఎక్కడకక్కడ అరెస్టులు చేయడం సమంజసం కాదన్నారు. రైతుల ఒక్క ఎకరానికి కూడా నీరు అందించలేని సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను రైతులువ్యతిరేకిస్తున్నారన్నారు.రైతు సమస్యలు పరిష్కరించడంపై ధ్యాసలేని ఈ ముఖ్యమంత్రి కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ట్రయల్ రన్ అంటూ మోసం చేయడం సమంజసం కాదన్నారు.. స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్, ఎంపీ గోడం నగేష్ రైతుల పట్ల కనీస అవగాహన లేకుండా ట్రయల్ రన్ ను అడ్డుకోకపోవడం శోచనీయమనీ అన్నారు.
Comments