గుండె- పోటు. ఈ ట్రిక్ ఫాలో అయ్యారా దానినుండి బయట పడుతారు

Madupa Santhosh CEO
HEALTH :  గుండె - పోటు. ఈ ట్రిక్  ఫాలో అయ్యారా దానినుండి బయట పడుతారు.
మన ఆరోగ్యం: అక్షర తెలంగాణ: 
బ్రతికి బయట పడ్డాను.
దయచేసి మీరు మీ రెండు నిమిషాల సమయం వెచ్చించి దీన్ని చదవండి.
1)అది రాత్రి7.25 గం.లనుకొందాం. ఆ రోజున ఎన్నడు లేనంతగా విపరీతంగా పనిలో శ్రమించి ఇంటికి మరలా లనుకొందాం(కాకపోతే ఒంటరిగా).
2) మీరు నిజంగానే బాగా అలసి, విసిగి వేసారి ఉన్నారు.
3) ఉన్నట్టుండి మీకు ఛాతీ లో తీవ్రమైన నెప్పనిపిస్తూవుంది
ఆ నెప్పి మీ దవడ లోపలి నుండి మీ చేయి వరకూ గుంజేస్తూ వుంటుంది.
మీ ఇంటి నుండి ఏదేనీ దగ్గరగా వుండే ఆసుపత్రికి మధ్య దూరం 5 కి.మీ. అనుకొందాం.
4) దురదృష్టవశాత్తు, అంతవరకూ మీరు చేరుకోగలరో లేదో మీకు తెలియదనుకొందాం.
5) మీరు CPR లో శిక్షణ పొందిన వారైయుండొచ్చును గానీ ఆ శిక్షణనిచ్చినతను అది మీకు మీరే ఎలా చేసుకోవాలో నేర్పలేదనుకొందాం.
6) మీరు ఎవరూ పక్కన లేని ఒంటరి సమయంలో వచ్చే గుండె పోటుని తట్టుకొని తేరుకుని బతికేదెలా?
చాలా మంది గుండె పోటు ఎదురైనప్పుడు సాయం చేయటానికి పక్కన ఎవరు లేక ఒంటరిగా వుంటారు.
వారి గుండె అస్తవ్యస్తంగా కొట్టుకొంటూవుంటుంది.బాగా నీరసం అనిపిస్తుంది. ఇక స్పృహ కోల్పోవటానికి కేవలం పదే పది క్షణాలు మిగిలి వుండొచ్చు.
7) అయినా సరే ఈ భాధితులు పదేపదే బాగా గట్టిగా దగ్గేయడం ద్వారా తమకు తామే సాయంచేసుకొని రక్షించుకోవచ్చు.
దగ్గే ప్రతీసారి బాగా వూపిరి తీసుకోవాలి.ఆ దగ్గు కూడా బాగా గొంతు లోపలనుండి వచ్చేలా కాస్తంత ఎక్కువ సేపు దగ్గాలి.అదీనూ ఛాతీ లోలోపల నుంచి కళ్ళె బయటకు కక్కేలా/ఊసేలా.
ఏదేనీ సాయం అందేవరకీ,లేదా గుండె మరల మామూలు గానే పనిచేస్తుంది అని మీకు అనిపించేంత వరకూ ఎడతెరిపి లేకుండా ప్రతీ రెండు సెకన్లకొకసారి మార్చి ,మార్చి ఊపిరి తీసుకొంటూ గట్టిగా దగ్గుతూ వుండాలి.
 గట్టిగా తీసుకొనే ఊపిరి ఆక్సిజన్ ని ఊపిరి తిత్తులకు చేరవేస్తుంది.గట్టిగా దగ్గే దగ్గు కదలికల వల్ల గుండెని నొక్కినట్టై రక్తప్రసరణ కొనసాగుతుంది.
బాగా నొక్కపెట్టినట్టు అనిపించే ఒత్తిడి కూడా గుండె తిరిగి యథాస్థితిలో పని చేయటానికి దోహదం చేస్తుంది.
ఇలాగా గుండె పోటు భాధితులు ఏదేనీ ఓ ఆసుపత్రికి చేరేలోపున ప్రమాదాన్ని దూరంగా పెట్టొచ్చు.
9) ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువగా ఇతరులకు చెప్పండి. అది వారి ప్రాణాలు కాపాడవచ్చు.
10) ఓ హృద్రోగ నిపుణులు ఏమంటారంటే ఈ సందేశం అందుకొన్న ఎవరైనా దయతో మరో పది మందికి పంపుదురు అని .ఇలా చేసి కనీసం ఒక్క ప్రాణాన్ని అయినా కాపాడలేమా అని మీరు సవాలుగా తీసుకోవాలని.
11) జోకులు గట్రా పంపటం లాంటివి కన్నా దయచేసి ఓ వ్యక్తి ప్రాణం నిలిపే ఈ సందేశాన్ని పదిమందికి
తెలియజేయండి.
12 ) ఇదే సందేశం పంపిన మీకే మరలా పదే పదే వస్తుంటే దయచేసి చికాకు పడకండి.
మీరంటే శ్రద్దతో ,ప్రేమతో ఈ గుండె పోటుని ఎలా ఎదుర్కోవాలో తెలియచేసే మిత్రులు ఇందరున్నారా అని మీరు సంతోషపడే విషయం సుమా ఇది.

 పోషకాహారం

గుండె ఎల్లపుడూ బలంగా ఉండాలంటే తినే ఆహారంలో సరిపడా పోషకాలు ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్, బెర్రీస్, ఆకుకూరలు, ఆలివ్ ఆయిల్, అవకాడో, సాల్మోన్, మాకరెల్, ట్యూనా, బాదం, వాల్నట్స్, చియా సీడ్స్ వంటివి తప్పక తీసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువగా తాగండి.

: వ్యాయామం

వారానికి 150 నిమిషాల వ్యాయామం చేస్తే గుండె బలంగా ఉంటుంది. జాగింగ్, వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటి వ్యాయామాలు చేయడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె హెల్తీగా ఉంటుంది.
.

ఒత్తిడి వద్దు

అధిక ఒత్తిడి కారణంగా గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఒత్తిడి తగ్గించుకోండి. దీనికోసం ధ్యానం, యోగా చేయడం అలవాటు చేసుకోండి. మీకు నచ్చిన వారితో గడపండి. మ్యూజిక్ వినండి.

ఉప్పు

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ద్వారా రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెపై ఒత్తిడి పెంచి దీర్ఘకాలంలో గుండెపోటుకు దారితీస్తుంది. అందుకే ఉప్పు తగ్గించడం చాలా అవసరం.

నిద్ర

సరిపడా నిద్ర ఉండటం వల్ల గుండె హెల్తీగా ఉంటుంది. లేదంటే ఒత్తిడి పెరిగి గుండెపోటు అవకాశాలు పెరుగుతాయి. అందుకే రోజుకు 8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం.

 బరువు అదుపులో

మీ ఎత్తు, వయసుకు తగినంత బరువుకు మించి ఉంటే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే బరువు అదుపులో ఉంచుకోండి. దీనికోసం జంక్ ఫుడ్ మానేయండి. షుగర్ ఫుడ్స్ తినడం తగ్గించండి.

స్మోకింగ్
స్మోకింగ్ చేయడం వల్ల బాడీలో ఇంఫ్లమేషన్ పెరగడమే కాకుండా గుండెపోటు రిస్క్ రెట్టింపు అవుతుంది. ఎందుకంటే స్మోకింగ్ వల్ల కార్బన్ మోనాక్సైడ్ రక్తంలో కలిసి సరిగా రక్త ప్రసరణ జరగదు. అందుకే స్మోకింగ్ మానేయండి

ఆల్కహాల్

ఆల్కహాల్ అతిగా తాగడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండెపోటుకు దారితీస్తుంది. అందుకే ఆల్కహాల్ మానేయడం మంచిది

 హెల్త్ అప్డేట్

తరచూ మీ బీపీ, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్, బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేస్తూ ఉండండి. ఇందులో ఏ సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.

: గుండెపోటు (Heart Attack) అంటే గుండె కండరానికి రక్తం సరఫరా ఆగిపోవడం లేదా బాగా తగ్గిపోవడం వల్ల గుండె కండరాలు దెబ్బతినడం, ఇది ప్రాణాంతకమైన పరిస్థితి, దీనికి తక్షణ వైద్య సహాయం అవసరం. దీని ప్రధాన లక్షణాలు ఛాతీలో తీవ్రమైన నొప్పి (చేతులు, గొంతు, దవడ, వీపుకు వ్యాపించడం), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, చెమటలు పట్టడం, దడ వంటివి. మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, ధూమపానం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం గుండెపోటుకు కారణాలు కావచ్చు, కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ముఖ్యం. 
లక్షణాలు: 
(Symptoms)

ఛాతీలో నొప్పి: గుండె మధ్యలో లేదా ఎడమ వైపున 20-30 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండే తీవ్రమైన నొప్పి.

నొప్పి వ్యాప్తి: ఈ నొప్పి ఎడమ చేయి, భుజం, మెడ, దవడ, వీపు లేదా పొట్ట వరకు వ్యాపించవచ్చు.

శ్వాస ఇబ్బంది: ఊపిరి తీసుకోవడంలో కష్టం, దడ.

ఇతర సంకేతాలు: వికారం, వాంతులు, విపరీతమైన చెమటలు, అలసట, మూర్ఛ. తి మ్మీ ర్లు.
కారణాలు (Causes)

ధమనులలో అడ్డంకి: గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోవడం (ప్లేక్) వల్ల రక్త ప్రవాహం ఆగిపోవడం.

ప్రమాద కారకాలు: మధుమేహం, అధిక రక్తపోటు (BP), అధిక బరువు, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం. ఆ
నివారణ:
(Prevention)

ఆరోగ్యకరమైన ఆహారం: పండ్లు, కూరగాయలు, చేపలు, తృణధాన్యాలు ఎక్కువగా తినాలి; ప్రాసెస్ చేసిన ఆహారాలు, ట్రాన్స్ ఫ్యాట్స్ తగ్గించాలి.

క్రమం తప్పని వ్యాయామం: శారీరక శ్రమ తప్పనిసరి.

ఒత్తిడి నిర్వహణ: ధ్యానం, యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి.

పొగతాగడం మానేయడం: ధూమపానం, మద్యపానం పూర్తిగా మానేయాలి.
Comments