ప్రతి ఒక్కరు బాధ్యతగా రోడ్డు ప్రమాదాలను నివారించాలి - జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం ప్రభాకర్ రావు.

Madupa Santhosh CEO
ADB :  ప్రతి ఒక్కరు బాధ్యతగా  రోడ్డు ప్రమాదాలను నివారించాలి - జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం ప్రభాకర్ రావు.
ఆదిలాబాద్: డిజిటల్ న్యూస్ : అక్షర తెలంగాణ 

 ఈ సంవత్సరం 20% రోడ్డు ప్రమాదాలను తగ్గించడం లక్ష్యం - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

 ప్రాణం తిరిగి రానిది, రోడ్డు భద్రతా నియమాలు పాటిద్దాం - బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.*

 డిఫెన్సివ్ డ్రైవింగ్ తో ప్రమాదాలను నివారించవచ్చు.

 ప్రజలు త్రిబుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మైన డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్ చేయవద్దు. 

 రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు నుండి 10 రోజులు పలు కార్యక్రమాలు.

 "అరైవ్ అలైవ్" పోస్టర్  ఆవిష్కరణ 
 ఏ ఆర్ హెడ్ క్వార్టర్స్ లో "అరైవ్ అలైవ్" కార్యక్రమం ప్రారంభం

 పాల్గొన్న జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, వాహనదారులు, డ్రైవర్లు, డ్రైవర్ యూనియన్లు, ప్రజలు, వ్యాపారస్తులు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు.

రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లాలో "అరైవ్ అలైవ్" అనే కార్యక్రమాన్ని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, వాహనదారులు, డ్రైవర్లు, డ్రైవర్ యూనియన్లు, ప్రజలు, వ్యాపారస్తులు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించబడినది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నుండి 10 రోజులపాటు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వాటిక అనుకూలంగా పలు ప్రజాహిత కార్యక్రమాలను జిల్లా పోలీసు శాఖ నిర్వహించనున్నట్లు అందులో ప్రజలు, వాహనదారులు, డ్రైవర్లు, పెద్ద ఎత్తున పాల్గొని రోడ్డు ప్రమాదాలలో ప్రాణ నష్టాన్ని తగ్గిద్దామని సమిష్టి కృషితో సాధ్యమవుతుందని పోలీసు శాఖ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 

అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, ప్రమాదాలను నివారిస్తూ, ప్రాణ నష్టాన్ని తగ్గించాలని తెలియజేశారు. విద్యార్థులకు తెలిపిన సూచనలను, నియమాలను తల్లిదండ్రులకు తెలియజేసి వాటిని పాటించేలా ప్రోత్సహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేకమైన చర్యలను చేపడుతూ ప్రజలకు చేరువ కావాలని సూచించారు. ప్రజలు ప్రతి ఒక్కరూ వాహన నియమ నిబంధనలు పాటిస్తూ ఇతరులు పాటించే విధంగా ప్రోత్సహించాలని ఇతరులకు ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
అదేవిధంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మాట్లాడుతూ డిఫెన్సివ్ డ్రైవింగ్ తో ప్రమాదాలను తగ్గించవచ్చని ఒకవేళ ప్రమాదం సంభవించిన ప్రాణనష్టాన్ని తక్కువ చేసేలా డిఫెన్సివ్ డ్రైవింగ్ ను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని వాటిని పాటించేలా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు ప్రోత్సహించాలని తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాలో 20% శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా పోలీసు శాఖ కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వవద్దని, 18 సంవత్సరాలు నిండని వారికి వాహనాలు నడిపే శక్తి ఆత్మస్థైర్యం మెలుకువలు ఉండవని తెలిపారు. సరైన సమయంలో లైసెన్స్ ని పొంది వాహనాలను నడపాలని సూచించారు. త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, రేష్ డ్రైవింగ్, లాంటివి జరగకుండా చేయకుండా ఉండాలని తెలిపారు.
ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ప్రాణం పోతే తిరిగి రాదని వాహన నియమ నిబంధనలు పాటిస్తూ ప్రజలు వాహనాలు నడపాలని తెలిపారు. ముఖ్యంగా రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు శాఖ చేపడుతున్న నిర్ణయాలను అభినందించారు. ట్రాఫిక్ పోలీస్ కటౌట్, హాట్స్పాట్ ల వద్ద తనిఖీలు చేస్తూ రాంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయడం, జిగ్జాగ్ పద్ధతి ద్వారా డ్రమ్స్ ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను అరికడుతున్న తీరును ప్రశంసించారు. మండలాలు వారిగా ప్రత్యేక లైసెన్స్ మేళాను ఏర్పాటు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్, జిల్లా అదనపు సెషన్స్ న్యాయమూర్తి సీఎం రాజ్యలక్ష్మి, అదనపు కలెక్టర్ శ్యామల దేవి, పరిపాలన ఏఎస్పి పి మౌనిక ఐపిఎస్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేష్, పీపీ సంజయ్ వైరాగరి, డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్, మాజీ డిసిసి చైర్మన్ అడ్డి భోజరెడ్డి, ఐఎంఏ ఆదిలాబాద్ అధ్యక్షుడు కళ్ళెం వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సుజాత, కళాశాల విద్యార్థులు, ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు, డ్రైవర్లు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పోలీసు సిబ్బంది పోలీసు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments