మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని.

Madupa Santhosh CEO
 NRML : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని.
నిర్మల్: డిజిటల్ న్యూస్ : అక్షరతెలంగాణ : 
    మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. 
   ఎన్నికల సంఘం కమిషనరు, మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాలలో తగు ఏర్పాట్లను చేయాలన్నారు. ఆర్వో, నోడల్ అధికారులు, మాస్టర్ ట్రైనర్ల శిక్షణ గురించి చర్చించారు. ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి తదితర బృందాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.
      ఈ విసి అనంతరం కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల వారిగా పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో అవసరమగు మౌళిక సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు ఎంత మంది సిబ్బంది అవసరం అవుతారో అంచనా వేసుకొని, తదనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలన్నారు. బ్యాలెట్ పేపర్ల అవసరాలను బట్టి వాటిని ముద్రించేందుకు ఏజెన్సీలు గుర్తించాలని తెలిపారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఈవో భోజన్న, సిపిఓ జీవరత్నం, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్, సుందర్ సింగ్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్:
             రంజాన్ మాసంలో ముస్లింల ప్రార్థనల కొరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి:
    జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

      మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులు, ముస్లిం మత పెద్దలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రంజాన్ నెలలో మసీదుల దగ్గర నిరంతరం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. మసీదుల దగ్గర ప్రార్థనా సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. మసీదుల పరిసర ప్రాంతాల్లో అవసరమైన చోట రోడ్లకు మరమ్మత్తులు చేయాలని,  పార్కింగ్ సమస్యలు ఏర్పడకుండా చూడాలన్నారు. మసీదులలో ఎప్పుడూ త్రాగునీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రార్థనా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలకు ఏవైనా సమస్యలు ఎదురైతే అధికారులు త్వరితగతిన స్పందించి, వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. మసీదుల పరిసర ప్రాంతాల్లో ఏవైనా సమస్యలు ఉంటే వాటి వివరాలు తెలిపేందుకు క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. రంజాన్ పండుగనాడు అన్ని ఈద్గాలలో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఈద్గాలలో త్రాగునీరు, షామియానాలు, ఇతర ఏర్పాట్లను చేయాలన్నారు. పిచ్చి మొక్కలు, పొదలు తొలగించి, ఈద్గా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అన్ని మతాల పండుగలను సహోదర భావంతో జరుపుకోవాలని కోరారు.
    ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ 
, మైనారిటీ అధికారి మోహన్ సింగ్, ఆర్డీవో రత్నకళ్యాణి, ముస్లిం మత పెద్దలు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 నిర్మల్:
            గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించాలి:
     జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
      
    గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. 
    మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శాఖల వారిగా చేపట్టవలసిన పనులను అధికారులకు వివరించారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. దేశభక్తిని ప్రతిబింబించేలా విద్యార్థులచే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రముఖులను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించాలన్నారు. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపు విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సభా వేదిక సమీపంలో అంబులెన్స్, అత్యవసర మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులకు, అధికారులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని తెలిపారు.
        ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments