నిర్మల్ ఉత్సవాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
మంగళవారం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రెండవ రోజు నిర్మల్ ఉత్సవాల కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది.
ఉదయం నుంచి భారీ సంఖ్యలో నిర్మల్ పట్టణంతోపాటు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన సందర్శకులు పాల్గొన్నారు. స్టాల్స్ సందర్శించి, ఉత్సవాల వినోదాన్ని అనుభూతి చెందారు. చిన్నారులు కేరింతలు కొడుతూ ఉత్సాహంతో ఆటలు ఆడుకున్నారు.
సాయంత్రం నుంచి రాత్రి వరకు, సందర్శకులతో ఎన్టీఆర్ మినీ స్టేడియం కిక్కిరిసిపోయింది. మంగళవారం రాత్రి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. నిర్మల్ ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ సంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. సెల్ఫీ పాయింట్ వద్ద చిన్నారులతో ఫోటోలు దిగారు. మిగిలిన మూడు రోజుల పాటు మరింత ఉత్సాహభరితంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురికి కలెక్టర్ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.
నిర్మల్ ఉత్సవాలలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్న కళ్యాణి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments