వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఎండపల్లిలో నూతన గ్రంథాలయం ప్రారంభం.

Madupa Santhosh CEO
JGL:  వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఎండపల్లిలో నూతన గ్రంథాలయం ప్రారంభం
జగిత్యాల: అక్షరతెలంగాణ 
ఎండపల్లి:వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఎండపల్లి మండల కేంద్రంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సర్పంచ్ మారం సునీత జెలందర్ రెడ్డి,మాజీ సింగల్ విండో చైర్మెన్ మద్దుల గోపాల్ రెడ్డి,సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సంఘ రమేష్, నూతన గ్రంథాలయాన్ని  ఘనంగాప్రారంభించారు.యువతలోవిజ్ఞానాన్ని,అధ్యయన ఆసక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతోఈగ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.
ప్రారంభోత్సవకార్యక్రమానికి స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, యూవత,గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని హాజరైన నాయకులు, ఉపాధ్యాయులు (టీచర్లు) స్వచ్ఛందంగా విరాళాలను (డొనేషన్స్) అందజేశారు.
గ్రంథాలయ ప్రారంభం అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ, స్వామి వివేకానంద ఆశయాల స్ఫూర్తితో ఈ గ్రంథాలయం యువతకు సరైన మార్గదర్శకం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.గ్రంథాలయ అభివృద్ధికి విరాళాలు అందించిన దాతలకు, యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ గ్రంథాలయం మండల కేంద్రంలోని విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు,మరియు పుస్తక ప్రియులకు గొప్ప వరం కానుంది. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలోనే మొట్ట మొదటి గ్రంధాలయం అని యువకులు విద్యార్థులు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమం లో
ఎండపల్లి సర్పంచ్ మారం సునీత,ఉప సర్పంచ్ దాసరి కళ్యాణి,మాజీ సర్పంచ్ జెలందర్ రెడ్డి,మాజీ ఉప మైలారం సతీష్,మాజీ సింగిల్ విండో చైర్మెన్ మద్దుల గోపాల్ రెడ్డి,సర్పంచ్ ల ఫోరం ఆద్యక్షుడు సంగ రమేష్,ఆయా గ్రామాల సర్పంచ్ లు
సర్పంచ్ జీ రెడ్డి మహేందర్ రెడ్డి,సర్పంచ్ కందికట్ల అమృత రాజేష్,ఎంపీడీఓ కృపాకర్,రెవిన్యూ ఇన్స్పెక్టర్ అన్వేష్,పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్,స్థానిక రిపోర్ట్ లు గౌరి ప్రభాకర్, బొడ్డు,రాజేశం,తోడేటి మల్లేష్,ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టార్ -రవీందర్ రెడ్డిఉపాధ్యాయులు 'కుమారస్వామి,
 బంగారయ్య,కుంట మల్లారెడ్డి,గడ్డం నందిరెడ్డి,మారంజగన్మోహన్ రెడ్డి,గూడారాంరెడ్డి,వివేకానంద యూత్ సభ్యులు గ్రామ ప్రజలు యూవకులు పాల్గొన్నారు.
Comments