ADB : హెల్మెట్ ప్రాణాలను రక్షిస్తుంది: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్: అక్షరతెలంగాణ:
ప్రతి ఒక్క పోలీసు హెల్మెట్ ధరించి ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సూచన.
రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్భంగా పట్టణంలో భారీ ద్విచక్ర వాహనాల భారీ ర్యాలీ
పట్టణంలోని పురవీధుల గుండా కొనసాగి వాహన నియమాలపై, రోడ్డు నియమాలపై అవగాహన.
రోడ్డు ప్రమాదాలు ప్రాణాంతకం కాకుండా, ప్రజలు రోడ్డు భద్రత నియమాలను పాటించాలి
ఈ సంవత్సరం 20% రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో సీటు బెల్టు, ట్రాఫిక్ నియమాలు పాటిస్తే, ప్రమాదాల నివారణ సాధ్యం.
రానున్న రోజుల్లో రోడ్డు భద్రతపై పలు అవగాహన కార్యక్రమాల నిర్వహణ.
రాష్ట్ర వ్యాప్తంగా "అరైవ్ అలైవ్" నూతన రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం.
పాల్గొన్న 200 మంది ద్విచక్ర వాహనదారులు
జిల్లాలో ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్ల మండలాల వారిగా బైక్ ర్యాలీ ల నిర్వహణ.
హెల్మెట్ యొక్క ప్రాధాన్యతన తెలియజేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలియజేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్ల వారీగా బైక్ ర్యాలీలను నిర్వహించి, రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను ధరించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు. అనుకోని సందర్భంలో ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణాపాయం లేకుండా హెల్మెట్ కాపాడుతుందని తెలిపారు. ప్రమాదంలో కుటుంబ పెద్ద కు ఆపద ఏర్పడినప్పుడు, కుటుంబ భవిష్యత్తు అయోమయంలో పడుతుందని తెలిపారు. పోలీసులు హెల్మెట్ ధరించాలని ప్రోత్సహించేది ప్రజల రక్షణ భద్రత లో భాగంగానే అని తెలిపారు . రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు అదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద నుండి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి సారథ్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వయంగా జిల్లా ఎస్పీ పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై, ట్రాఫిక్ నియమాలపై, హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ప్రారంభమైన ర్యాలీ వినాయక్ చౌక్, దేవి చందు చౌక్, గాంధీ చౌక్,అంబేద్కర్ చౌక్, గర్ల్స్ హై స్కూల్, బస్ స్టాండ్, కలెక్టర్ చౌరస్తాకు చేరుకొని పూర్తయింది. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం రోడ్ సేఫ్టీ క్లబ్ ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయడం జరుగుతుందని. జిల్లా వ్యాప్తంగా 20 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా పోలీసు వ్యవస్థ నూతన ప్రణాళికను అవలంబిస్తూ ప్రమాదాల నివారణకై కృషి చేస్తుందని తెలిపారు. వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని రాంగ్ సైడ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ లాంటివి చేయకుండా, మైనర్లు వాహనం నడపకుండా తల్లిదండ్రులు పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. ముఖ్యంగా యువత ట్రిపుల్ రైడింగ్ లు, రాష్ డ్రైవింగ్, రేసింగ్ లు లాంటివి చేయకుండా ఉండాలని తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడపాలని సూచించారు. ఈ మాసోత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరచడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర డిజిపి గారి ద్వారా "అరైవ్ అలైవ్" అనే పేరుతో రోడ్డు భద్రతా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు బి సునీల్ కుమార్, కర్ర స్వామి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, ఎన్ చంద్రశేఖర్ ట్రాఫిక్ ఎస్ఐలు దేవేందర్, మహేందర్, టీజీఎస్పీ సిబ్బంది, స్పెషల్ పార్టీ, ఏఆర్, ప్రజలు యువత పాల్గొని విజయవంతం చేశారు.
Comments