సాయుధ పోలీసులకు క్రమశిక్షణ కీలకం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Madupa Santhosh CEO
ADB : సాయుధ పోలీసు కు క్రమశిక్షణ కీలకం- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 
అదిలాబాద్ : డిజిటల్ న్యూస్ : అక్షర తెలంగాణ: 
 ప్రతి  పోలీసు కు సమానమైన విధులను కేటాయించాలి.
ప్రతి పోలీస్ నిజాయితీతో వ్యవహరించాలి .
 ఆయుధాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి.
 సాయుధ పోలీసు కు క్రమశిక్షణ కీలకం
 ప్రతి ఒక్క రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు సక్రమంగా జరగాలి
 పోలీసు సాయుధ ముఖ్య  కార్యాలయాన్ని ఆకస్మిక పరిశీలించిన: జిల్లా ఎస్పీ.

సాయుధ పోలీసు సిబ్బందికి క్రమశిక్షణతో పాటు, నిజాయితీ తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు. శుక్రవారం స్థానిక పోలీసు సాయుధ ముఖ్య కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ విధులలో నిర్లక్ష్యాన్ని వహించకూడదని తెలిపారు. సిబ్బంది కేటాయించిన విధులను  సక్రమంగా నిర్వహించాలి అని, విధులలో సమయపాలన పాటిస్తూ ఉండాలని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, విధులకు అనవసరంగా గైర్హాజరైన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు సాయుధ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆయుధాన్ని పూర్తిగా శుభ్రపరుస్తూ ఉండాలని తెలిపారు. యువ పోలీసులకు సాంకేతికపరమైన విధులను కేటాయించడం జరుగుతుందని, ఉత్సాహం ఉన్నవారికి సంబంధిత విభాగాలలో విధులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు సాయుధ పోలీసులు సంసిద్ధంగా ఉంటూ ఎల్లవేళలా అప్రమత్తమై ఉండాలని సూచించారు. సిబ్బంది వారికి ఉన్నటువంటి సెలవు దినాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సిబ్బంది విధులను రొటేషన్ పద్ధతిలో నిర్వహించాలని అధికారులకు సూచించారు. పోలీసు సిబ్బందికి ప్రతి ఒక్కరికి విడతలవారీగా సమానమైన విధులు కేటాయించి, ఎలాంటి భేద భావాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టీ మురళి, ఎన్ చంద్రశేఖర్, రిజర్వ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


ఆదిలాబాద్ : డిజిటల్ న్యూస్: అక్షర తెలంగాణ: 

 గంజాయి మొక్కలు 9 స్వాధీనం
 ముగ్గురి పై కేసు నమోదు -జైనథ్ సిఐ జి శ్రావణ్
 ఇద్దరు నిందితులు అరెస్ట్, ఒకరు పరారి
 13 గ్రాముల ఎండు గంజాయి, 9 గంజాయి మొక్కలు స్వాధీనం.
 గంజాయి సేవిస్తూన్న వ్యక్తి, మరియు ఇద్దరు గంజాయి పండిస్తున్న వ్యక్తుల పై కేసు.
 విక్రేతల నుంచి, కొనుగోలుదారుల వరకు  అందరిపై చర్యలు 

ఆదిలాబాద్ జిల్లా: 
జైనథ్ సర్కిల్ పరిధిలో మాదక ద్రవ్యాలపై, గంజాయి వినియోగం, విక్రయాలు మరియు సాగుపై పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు సి.ఐ జి. శ్రావణ్ తెలిపారు.
గంజాయి పై విశ్వసనీయ సమాచారం మేరకు భీంపూర్ పోలీస్ సిబ్బంది బేలసరి రాంపూర్ గ్రామంలో తనిఖీలు నిర్వహించగా, ఈ సందర్భంగా కమ్యూనిటీ భవనం వద్ద నిందితుడు గంజాయి సేవిస్తున్న *దైవాజ్ఞ రాజ్‌కుమార్‌* ను అదుపులోకి తీసుకోగా, అతని వద్ద 13 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. విచారణలో దైవాజ్ఞ రాజ్‌కుమార్ తెలిపినదేమనగా — తనకు గంజాయి తాగే అలవాటు కలిగి ఉండి, బేలసరి రాంపూర్ గ్రామానికి వచ్చి మరో నిందితుడు *పుర్క నాగోరావ్* వద్ద నుంచి రూ.200కు గంజాయి కొనుగోలు చేసినట్లు  తెలియజేశారు. దీంతో వెంటనే పోలీసులు పుర్క నాగోరావ్ ఇంటిపై దాడి చేయగా, అతను తన పెరట్లో గంజాయి మొక్కలు పెంచుతూ, అవసరమున్న వారికి విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అలాగే దైవాజ్ఞ రాజ్‌కుమార్‌కు కూడా గంజాయి అమ్మినట్లు  తెలిపారు. అతని ఇంటి పెరట్లో ఉన్న 5 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా విచారణలో పుర్క నాగోరావ్ మరియు దైవాజ్ఞ రాజ్‌కుమార్ ఇద్దరూ కలిసి, అదే గ్రామానికి చెందిన సిడం శ్రీనివాస్ కూడా గంజాయి మొక్కలు పెంచుతూ, అప్పుడప్పుడు గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపారు. దీంతో బీంపూర్ పోలీసులు మరో నిందితుడు  *సిడం శ్రీనివాస్* ఇంటికి వెళ్లగా, అతను ఇంటి వద్ద లేకపోవడంతో, అతని తల్లి సిడం లక్ష్మీ సమాచారం ఇవ్వగా, వారి పెరట్లో 4 గంజాయి మొక్కలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ నాలుగు మొక్కలు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తంగా 9 గంజాయి మొక్కలు మరియు 13 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని భీంపూర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జైనథ్ సర్కిల్ సి.ఐ జి. శ్రావణ్ మాట్లాడుతూ — గంజాయి సాగు, విక్రయం, వినియోగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, గ్రామాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు. యువత, ప్రజలు మాదకద్రవ్యాలకు, గంజాయి కి దూరంగా ఉండాలని తెలిపారు.

ఈ కేసు నందు కొనుగోలు చేసినవారు, విక్రయించినవారు  ఇరు వర్గాల వారిపై కూడా కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గంజాయి పండించిన వారికి ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు చేయడం జరుగుతుందని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో బీంపూర్ ఎస్సై విక్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments