ఆదిలాబాదు: డిజిటల్ న్యూస్: అక్షరతెలంగాణ:
స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపు శాంతినగర్ PHC లో అందించే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని శాంతినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపును సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించి, చికిత్స వివరాలపై ఆరా తీసి వైద్యులకు పలు సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇటువంటి స్పెషలిస్ట్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, దీని ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు నిపుణులైన వైద్యులతో సేవలు అందుతున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా క్యాంపులలో గుర్తించిన రిఫరల్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యులకు సూచించారు. దంతన్‌పల్లి పిహెచ్సిలో గుర్తించిన 10 మంది కంటి వ్యాధిగ్రస్తులలో 5 మందికి రిమ్స్ ఆసుపత్రిలో విజయవంతంగా ఆపరేషన్లు చేయించినట్లు గుర్తు చేశారు. నేటి క్యాంపులో కూడా పీడియాట్రిక్, కార్డియాలజీ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి, మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు రిఫర్ చేయాలని ఆదేశించారు. అదే విధంగా పట్టణంలోని వివిధ వార్డుల్లో పారిశుధ్య నిర్వహణలో భాగంగా చెత్త సేకరణ కోసం ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని, మరో 5-6 రోజుల్లో అదనపు కార్మికులు అందుబాటులోకి వస్తారని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచడానికి సిఎస్ఆర్ నిధులతో మరిన్ని స్వచ్ఛ ఆటోలను సమకూర్చుతామని వెల్లడించారు. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా నిరోధించేందుకు ‘గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల’ వద్ద సీసీటివి కెమెరాలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు, జిల్లా ప్రజలకు రంజన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ప్రజా పాలన_ ప్రగతి ప్రణాళిక లో భాగంగా 33 వార్డు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు రోడ్డా వాసవి - రవి దంపతుల గృహ ప్రవేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం 35, 33 వ వార్డులో శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, వివిధ వార్డుల కౌన్సిలర్లు మౌనిక, సయ్యద్ మెహబూబ్, సుచిత, జ్యోతి, నర్మదా, వైద్యులు, వైద్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, లబ్ధిదారులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాదు: డిజిటల్ న్యూస్: అక్షర తెలంగాణ:
టిటిడిసిలో శుక్రవారం జరిగిన సమావేశం లో సెన్సస్-2027 (జనగణన) పై టెక్నికల్ అసిస్టెంట్లు, ఛార్జ్ క్లర్కులకు మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న జనగణన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ సెన్సస్ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని, ఇందుకోసం సెన్సస్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేక యాప్‌లు, పోర్టల్స్ అందుబాటులోకి తెచ్చామని వివరించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కింద ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందనీ, హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ కింద మే 11 నుండి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ఇళ్ల జాబితా నమోదు ప్రక్రియను చేపడతారనీ తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్లు ఆన్‌లైన్ ద్వారా ఎన్యూమరేటర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించి, ప్రతిరోజూ తహసీల్దార్లకు నివేదికలు అందించాల్సి ఉంటుందనీ, ప్రతి ఇంటితో పాటు ప్రతి వ్యక్తిని ఎటువంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని, ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో పక్కాగా సర్వే జరగాలని ఆదేశించారు. ఎన్యూమరేటర్ల మధ్య పని విభజన సమానంగా ఉండాలని, ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, పర్యవేక్షకురాలు నలందప్రియ, మాస్టర్ ట్రైనర్లు వినయ్, జగన్, శ్రీహరి, ఇతర అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
ఆదిలాబాదు: డిజిటల్ న్యూస్ : అక్షరతెలంగాణ:
మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీ భవనంలో 'తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్' ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పంతో 'టాస్క్' ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన టెక్నికల్, నాన్-టెక్నికల్ కోర్సులలో ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుందని, అలాగే, కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ , ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై నిష్ణాతులైన వారిచే శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని యువత ఈ ఉచిత, నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధికల్పన అధికారి మిల్కా, ఈడియం బండి రవి, టాస్క్ మేనేజర్ సాయి, బోధన సిబ్బంది, యువతీ యువకులు, తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాదు: డిజిటల్ న్యూస్: అక్షర తెలంగాణ:
ADB: ఉపాధి హామీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్ఆర్ఈజీఎస్ మెటీరియల్ వ్యయం, వివిధ పెండింగ్ పనుల పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి మండలం, విభాగం వారీగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులను వినియోగించుకుంటూ పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, నిధుల వ్యయంలో పారదర్శకత ప్రదర్శించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివరామ్, ఏఈఈలు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments