' లోక్ అదాలత్ ' కు భారీ స్పందన: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Madupa Santhosh CEO
ADB : లోక్ అదాలత్ కు భారీ స్పందన - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ : 
ఆదిలాబాద్: డిజిటల్ న్యూస్: (అక్షర తెలంగాణ): 

 5399 కేసుల పరిష్కారం.423 ఎఫ్ఐఆర్,1017 ఈ పెట్టి, 3812 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పరిష్కారం.

 49 సైబర్ క్రైమ్ కేసులలో బాధితులకు రూ 9,95,846/- తిరిగి వచ్చేలా కోర్టు ద్వారా ఉత్తర్వులు జారీ

 147 ఎక్సైజ్ కేసులకు గాను 7,35,000/- జరిమానా 

 లోక్ అదాలత్ విజయానికి కృషిచేసిన సిబ్బంది ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసిన జిల్లా ఎస్పీ.

 లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించిన న్యాయ సేవా అధికార సంస్థకు ప్రత్యేక అభినందనలు.

మార్చ్ 28న జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి జిల్లా ప్రజల నుండి భారీ స్పందన వచ్చిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలియజేశారు. ఆదివారం పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ లోక్ అదాలత్ కార్యక్రమంలో పరిష్కరించిన కేసుల వివరాలను వెల్లడించారు. రాజీమార్గమే రాజమార్గం అంటూ జిల్లా ప్రజలు విశేష స్పందనను చూయించి రాజి కుదుర్చుకొని ఇరు వర్గాల కాక్షి దారులు విజయవంతంగా కేసులను పూర్తి చేసుకున్నారని తెలిపారు. జిల్లాలోని పరిష్కరించబడిన కేసులు మొత్తం 5399 కేసులుగా గుర్తించబడినదని తెలిపారు. ఇందులో ఐపిసి కేసులు 423 పరిష్కరించగా, 1017 ఈ పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 3812 ఉండగా వాటికి రూ 38,13,000/- ఫైన్ విధించినట్లు తెలియజేశారు. వీటన్నింటికీ అదనంగా జిల్లా వ్యాప్తంగా నమోదైన 49 సైబర్ క్రైమ్ కేసులలో బాధితులు పోగొట్టుకున్న 9,95,846/- ఉత్తర్వులు వచ్చినట్టు తెలిపారు. ప్రత్యేకంగా 147 ఎక్సైజ్ కేసులను పరిష్కరించినట్లు దానికి గాను 7,35,000/- జరిమానా విధించినట్లు తెలిపారు. ఎఫ్ఐఆర్ కేసులలో ఈ పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, మరియు ఎక్సైజ్ కేసులు, నేర నిరూపణ ఉన్న నిందితులు స్వయంగా న్యాయస్థానాలకు హాజరై తప్పులను ఒప్పుకోవడంతో ఈ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కొట్లాట, భార్యాభర్తల మధ్య గల వివాహ సంబంధమైన వివాదములు, అత్తింటి వారి వేధింపులు, అన్ని రకాల క్రిమినల్ కేసులు, నిందితులు బాధితులు కలిసి హాజరై రాజీమార్గంలో రాజీ పడటంతో కేసులను కొట్టివేసినట్లు తెలిపారు. కేసులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తూ విధులను నిర్వర్తించిన కోర్టు డ్యూటీ అధికారులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీసు వ్యవస్థతో వివిధ సమావేశాలు ఏర్పాటు చేస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే ప్రభాకర్ రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిరోజు శాంతి భద్రతల సమస్యలను పరిరక్షిస్తూ అదేవిధంగా కోర్టు డ్యూటీ విధులను పర్యవేక్షిస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషిచేసిన పోలీసు సిబ్బంది ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, డి సి ఆర్ బి సిబ్బంది సీఐ అంజమ్మ, ఎస్ఐలు దివ్యభారతి, హకీం, సిబ్బంది  సుభాష్ యాదవ్, శ్రీనివాస్, అత్తవుల్లా, లఖన్, వినోద్, సతీష్వర్, పెంచాల వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Comments