నిర్మల్ : డిజిటల్ న్యూస్: అక్షర తెలంగాణ:
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు శనివారం మండలాల్లో అధికారులు గ్యాస్ ఏజెన్సీలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. తహసిల్దార్లు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఏజెన్సీలలో తనిఖీలు చేశారు.
ఆయా మండలాల్లో గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల్లో గల స్టాక్, అమ్మకానికి సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. అన్ని రకాల రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు. గోదాములలో గల సిలిండర్లను పరిశీలించారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితులలో సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించవద్దని ఆదేశించారు. ప్రజల అవసరాల మేరకు సిలిండర్లను అందించాలని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ లో అమ్మిన, పక్కదారి పట్టించిన, కృత్రిమ కొరత సృష్టించిన, కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల కొనుగోలు కొరకు వచ్చిన ప్రజలతో పలువురు అధికారులు మాట్లాడుతూ, జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, తగినంత స్టాక్ అందుబాటులో ఉందని, ప్రజల అవసరాల మేరకు సిలిండర్లను అందిస్తామని వారికి తెలిపారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్ల విషయంలో భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని వివరించారు.
నిర్మల్: అక్షర తెలంగాణ:
బాసర ఐఐఐటి ని, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా, ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ, వర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్ల ప్రక్రియ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందో లేదో అధికారులను అడిగారు. విద్యార్థుల రక్షణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. మహిళా విద్యార్థుల కొరకు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. సిబ్బందిని నియమించుకునే ప్రక్రియలో తప్పనిసరిగా రిజర్వేషన్ పద్ధతిని పాటించాలని ఆదేశించారు. వివిధ అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
విద్యార్థులతో నేరుగా మాట్లాడుతూ, వారికి అందిస్తున్న వసతులు, వారికి ఉన్న సమస్యలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పలువురు అధికారులు, చైర్మెన్, సభ్యులను సన్మానించారు. జ్ఞాపికలను అందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కుస్త్రం నీలాదేవి, వైస్ చాన్స్ లర్ గోవర్ధన్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఎం. సంతోష్ ( ఫ్రీలాన్స్ జర్నలిస్ట్).
Comments