ఆదిలాబాదు: డిజిటల్ న్యూస్: అక్షర తెలంగాణ
మాజీ ఉప ప్రధాని, బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్ లో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి కార్యక్రమానికి ఆదిలాబాదు పార్లమెంటు సభ్యులు గోడం నగేష్, స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషలతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సామాన్య కుటుంబంలో జన్మించిన జగజ్జీవన్ రామ్, దేశంలోనే అత్యధిక కాలం పార్లమెంటేరియన్‌గా ఉండి రక్షణ, కార్మిక, వ్యవసాయ శాఖల మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విద్యార్థులు, యువత మొబైల్ ఫోన్లు, ఇతర వ్యసనాలకు బానిస కాకుండా, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయుల జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకోవాలని, సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి మార్గదర్శకత్వం పొందాలని కోరారు.
యువత కోసం ప్రభుత్వం పాలిసెట్, ఐటీఐ వంటి వివిధ వృత్తి విద్యా కోర్సులతో పాటు, విదేశీ విద్య కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓవర్సీస్ నిధి వంటి పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పీఎంఈజీపీ, ముద్రా లోన్ల వంటి పథకాల ద్వారా రాయితీతో కూడిన రుణాలు అందిస్తోందని వివరించారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు, పాడి పశువుల పంపిణీ, సోలార్ ఫామ్స్ వంటి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన న్యాయవాదులకు శిక్షణ, స్టైపెండ్ అందిస్తున్నామని, అలాగే ఎల్పీఎస్ భూములకు బోర్లు, విద్యుదీకరణ పనులు చేపడుతున్నామని వివరించారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు అవకాశాలని సద్వినియోగం చేసుకొని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనీ కోరారు.
స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఆదిలాబాద్‌లో సుమారు 2000 ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రాథమిక సర్వే పూర్తయిందని, త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. అలాగే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విమానాశ్రయ నిర్మాణ పనులు మరో రెండు మూడు నెలల్లో ప్రారంభమవుతాయని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. దళిత యువతకు బ్యాంకుల ద్వారా త్వరితగతిన రుణాలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆయన కోరారు.
మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని, బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు స్పూర్తి గా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు స్థానిక ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి సందర్భంగా చిత్రపటానికి, జగ్జీవన్ రామ్, అంబేద్కర్, పూలే దంపతుల విగ్రహాలకు, జగ్జీవన్ రామ్ కూడలి లోని విగ్రహం వద్ద కలెక్టర్, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్, జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అధికారి సునీత కుమారి, ఈడి మనోహర్, డిహెమ్హెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డివైఎస్ఓ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Comments