భూ మోసం 30లక్షల కేసులో నిందితుడు అరెస్ట్: ఎస్ హెచ్ ఓ బి. డి ప్రేమ్ కుమార్

Madupa Santhosh CEO
ADB: భూ మోసం 30 లక్షల కేసులో నిందితుడి అరెస్ట్ -ఎస్ హెచ్ ఓ .డి. ప్రేమ్ కుమార్

ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ 
ప్రభుత్వం నుంచి ప్రత్యామ్నాయ భూమి పొందిన అనంతరం ప్లాట్లుగా మార్చి విక్రయం

మావల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు.. ప్రధాన నిందితుడు అరెస్ట్
మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని దస్నాపూర్ గ్రామానికి చెందిన భూమి విషయంలో మోసం, నమ్మకద్రోహానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మావల ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు.
ఫిర్యాదుదారు జక్కుల నారాయణకు దస్నాపూర్ గ్రామంలోని సర్వే నం.21/1, నూతన సర్వే నం.21/18లోని భూమిలో ప్లాట్ నం.37ను 1987లో రిజిస్ట్రేషన్ ద్వారా విక్రయించినట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వం సదరు భూమిని స్వాధీనం చేసుకోవడంతో, భూ యజమాని ఆరే లసుంబాయి తన భూమికి బదులుగా ప్రభుత్వం నుంచి ప్రత్యామ్నాయంగా సర్వే నం.72/33, 72/27లో మొత్తం 10 ఎకరాల భూమిని పొందినట్లు పేర్కొన్నారు.

అయితే ఇప్పటికే విక్రయించిన భూమిని ప్రభుత్వానికి చూపించి ప్రత్యామ్నాయ భూమి పొందిన అనంతరం, ఆ భూమిని కూడా ప్లాట్లుగా మార్చి ఇతరులకు విక్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు రావాల్సిన ప్రత్యామ్నాయ ప్లాట్ ఇవ్వాలని కోరినప్పటికీ నిందితులు నిరాకరించి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదుదారు తెలిపారు. దీంతో తనకు సుమారు రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.
కేసులో ప్రధాన నిందితుడైన దరట్ల జీవన్‌ను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో నిందితురాలు ఆరే లసుంబాయి పరారీలో ఉన్నట్లు, ఆమె కోసం గాలింపు కొనసాగుతున్నట్లు ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు.
 దారట్ల జీవన్ తండ్రి దరట్ల అబ్బన్న,  సంవత్సరాలు, వృత్తి: రిటైర్డ్ టీచర్, నివాసం: ఓల్డ్ హౌసింగ్ బోర్డు, ఆదిలాబాద్. అరెస్ట్
ఆరే లసుంబాయి  భర్త నర్సింలు. పరారీలో ఉంది.
కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మావల ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు.


ఆదిలాబాద్: అక్షర తెలంగాణ 

 దేశీదారు మద్యం 1300  బాటిళ్లు స్వాధీనం
ప్రధాన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు -టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు
మహారాష్ట్ర నుంచి భీంసరి గ్రామానికి అక్రమంగా తరలిస్తుండగా పట్టివేత

కారు, మొబైల్ ఫోన్ స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు
ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా దేశీదారు మద్యాన్ని తరలిస్తున్న ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు తెలిపారు.
శుక్రవారం విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న కారును తనిఖీ చేయగా, అందులో 13 బాక్సుల్లో 90 ఎంఎల్ పరిమాణం గల మొత్తం 1300 దేశీదారు మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో కారులో మద్యం తరలిస్తున్న ప్రధాన నిందితుడు సిర్పురే జనార్ధన్‌ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసరి గ్రామానికి చెందిన సిర్పురే జనార్ధన్ మహారాష్ట్రలోని చాంకా గ్రామానికి వెళ్లి గజానన్ రాములు బట్టిన్వార్ @ గజ్జు వద్ద రూ 1,28,700/- విలువ గల 1300 (90ml) దేశీదారు మద్యం బాటిళ్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. అనంతరం వాటిని అక్రమంగా ఆదిలాబాద్ జిల్లాకు తరలించి విక్రయించి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు.

పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మార్కెట్ యార్డు వద్ద వాహన తనిఖీలు చేపట్టి నిందితుడిని పట్టుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 1300 దేశీదారు మద్యం బాటిళ్లు, ఒక కారు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో మద్యం విక్రయించిన మహారాష్ట్రకు చెందిన గజానన్ రాములు బట్టిన్వార్ @ గజ్జుపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయించడం, తరలించడం, నిల్వ చేయడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సిర్పురే జనార్ధన్  తండ్రి అడెల్లు, నివాసం భీంసరి గ్రామం, ఆదిలాబాద్ రూరల్ మండలం, ఆదిలాబాద్ జిల్లా. ప్రధాన నిందితుడు.. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు.
గజానన్ రాములు బట్టిన్వార్ @ గజ్జు (40) తండ్రి రాములు, నివాసం చాంకా గ్రామం, యవత్మాల్ జిల్లా, మహారాష్ట్ర. నిందితుడు.

పోలీస్ సిబ్బందికి ఎస్పీ అభినందనలు
ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనబరిచి అక్రమ మద్యం తరలింపును అడ్డుకోవడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు విట్టల్, క్రాంతిలను జిల్లా ఎస్పీ శుక్రవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలతో పాటు నగదు రివార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు, ఎస్‌ఐలు అఖిల్, ప్రణయ్, కానిస్టేబుళ్లు క్రాంతి, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.
Comments