ఆదిలాబాద్: అక్షర తెలంగాణ
కేసీఆర్ రాజీనామా చేసి ప్రజా తీర్పును ఎదుర్కోవాలి: కాంగ్రెస్ నేతల డిమాండ్
గత పదేళ్ల పాలనపై ప్రజలకు సమాధానం చెప్పాలి: డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్ జాదవ్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ సాగిస్తున్న పాలనకు 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షులు డా నరేష్ జాదవ్ గారి ఆధ్వర్యంలో శనివారం భారీ ఎత్తున 1,000 రోజుల ప్రజా పాలన బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ కోమరం భీమ్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, వినాయక్ చౌక్, దేవి చంద్ చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించి తదనంతరం నెహ్రూ రోడ్డు, నేతాజీ చౌక్, గర్ల్స్ హైస్కూల్ మీదుగా తిరిగి డీసీసీ కార్యాలయానికి చేరుకుంది. మార్గమధ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు
అంబేద్కర్ చౌక్‌లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేశ్ జాదవ్ గారి తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారు.
పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ తన పాలనకు సంబంధించిన ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాలని, రాజకీయ బాధ్యత స్వీకరించి రాజీనామా చేసి ప్రజా తీర్పును ఎదుర్కోవాలని అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రేషన్ కార్డులు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు తదితర అంశాల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకు గత ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
డీసీసీ అధ్యక్షులు *డాక్టర్ నరేశ్ జాదవ్* మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతోందన్నారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రజలకు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతి యొక్క పేదలకు రేషన్ కార్డు అందించామని, అరువైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తున్నామని అలాగే మహిళలకు ఫ్రీ బస్సు , 200 యూనిట్ల ఉచిత కరెంటు,500 లకే గ్యాస్ సిలిండర్ ఇలా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.తెలంగాణ ముఖ్యమంత్రి గౌ *రేవంత్ రెడ్డి* గారు కాంగ్రెస్ అగ్రనేత *రాహుల్ గాంధీ*పై బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలకు డిసిసి అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ గారూ స్పందిస్తూ వ్యక్తిగత విమర్శలకు పరిమితం కాకుండా ప్రజా సమస్యలు, నిరుద్యోగం, రైతుల సమస్యలు, సంక్షేమం, అభివృద్ధి వంటి అంశాలపై రాజకీయ చర్చ జరగాలని వారు పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై కూడా కాంగ్రెస్ నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల సమస్యలు, సామాన్య ప్రజల సంక్షేమం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
రాబోయే రోజుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపురావు గారు , బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్ గారూ , గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య గారు , మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి,గారూ మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ గారు , టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత గారు , మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి గారూ , బూత్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ గారు, జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి గారు, ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ గారు, ఐఎన్‌టీయూసీ నాయకుడు మునిగేలా నర్సింగ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు చరణ్ గౌడ్ గారు , జిల్లా మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్ గారు,ఎస్సీ విభాగం చైర్మన్ పరమేశ్వర్ గారు, ఎన్ ఎస్ యు ఐ కపిల్ గారు, లీగల్ సెల్ అధ్యక్షులు మంగేష్ గారు, మహిళా కాంగ్రెస్ అన్నపూర్ణ గారు, సేవాదళ్ మోతి రాం గారు,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్ గారు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇజ్జగిరి సంజయ్ గారు, మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments