ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ
హైదరాబాద్ సంస్థానంలో 1946 నుండి 1951 వరకు ఫ్యూడల్ జమీందారుల మీద, రజాకార్ల రాక్షసత్వం మీద, ఆ తరువాత నిజాం సైన్యం మీద తెలంగాణలోని అసంఖ్యాకులైన స్త్రీ, పురుషులు చేసిన తిరుగుబాటు చారిత్రాత్మకం. నాటి తెలంగాణ సాయుధ పోరాటం ఆనాటి రైతన్నది చావు బతుకుల పోరాటం హైదరాబాద్ పట్టణంలోని స్త్రీ, పురుషులకు కొత్త ఆశలు కల్పించి వాళ్లను కూడా తనలోకి లాక్కున్న పోరాటము అది. సంస్కృతికమైన అనిచివేత నుండి మూఢత్వము నుండి అజ్ఞానము నుండి విముక్తి అనేది వారికి పోరాటంలో కనిపించిన కొత్త ఆశ.
నిజాం రాజ్యంలో భూస్వామికి భూమి మీదే కాక ఆభూమినాశ్రయించుకుని బ్రతికే ప్రతి మనిషి మీదా హక్కు ఉండేది. పెద్ద భూస్వాములుగా తెలంగాణ జమీందారులు రైతులను, స్త్రీలు, పురుషులు, పిల్లలనే తేడా లేకుండా తమ సొంత ఆస్తిగా పరిగణించేవాళ్ళు. ఆ వ్యవస్థలో స్త్రీలు, పురుషుల కంటే రెట్టింపు బాధలు పడ్డారు. భూస్వామి ఏ స్త్రీ మీదన్నా మోజు పడ్డాడు అంటే ఆమె అతనికి లొంగి పోవాల్సిందే. ఒక స్త్రీ వివాహం చేసుకుంటే మొదటి రాత్రి భూస్వామితో గడపవలస పరిస్థితులు ఉండేవి. ఆడభాపలుగా, బానిస స్త్రీలుగా భూస్వామి అవసరాన్ని అతని కుటుంబ అవసరలన్ని తమ చాకిరీతో తీర్చావలసినది.
నిజాంకు నజ్ రానాలు సమర్పించుకున్నందుకు ప్రతిఫలంగా వారిని గుర్తించి సేవకు బహుమతిగా ఇనాంగా కొంత భూమిని ఇచ్చేవారు. తన సొంత ఖర్చులకోసం సర్ఫేఖాస్ అనే భూములను తన సొంత పాలన కింద ఉంచడం హైదరాబాదు రాష్ట్రమంతా 7,340 గ్రామాలు అంటే మొత్తం రాజ్యంలో 40% ప్రాంతం జాగీరులు, సంస్థానాలు సర్ఫే-ఏ-ఖాస్ క్రింద ఉన్నవి మిగిలిన 60% భూమిని "ఖాల్సా" లేక "దివాని" అనేవారు. ఖాల్సా భూములలో పన్ను వసూలు చేయటంలో దళారీలు ప్రముఖ పాత్ర వహించేవారు. ఈ దళారీలకే తరువాత కాలంలో దేశముఖ్, సర్ దేశ్ ముఖ్, సర్దేశాయి అనే బిరుదులిచ్చారు. వీళ్ళు ఖాల్సా ప్రాంతాంల్లో అంతులేని భూమిని సంపాదించుకుని భూస్వాములుగా తయారయ్యారు. వీరే దొరలుగా అవతారం ఎత్తారు. వీరు లక్షల ఎకరాలు భూములు తన సొంత ఆధీనంలో ఉంచుకున్నారు.
పెట్టి చాకిరి జాగీరు ప్రాంతంలోనూ, ఖాల్సా ప్రాంతంలోనూ ఉండేవి. చాకలి, మంగలి, కమ్మరి లాంటి కులాల వాళ్ళు భూస్వాములకు జీతం లేకుండానే పనిచేసి పెట్టేవారు. రెవెన్యూ అధికారులు, ఫారెస్టు
ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, ఎక్సైజ్ అధికారులు గ్రామాలకు వచ్చినప్పుడు గ్రామ ప్రజలు వాళ్లకు కావాల్సిన సేవలను ఉచితంగా చేయవలసిందే. రైతుల పంటలకు రక్షణ లేదు. ఏ సమయములోనైనా భూస్వాముల గుండాలు వచ్చి పంటను తీసుకుపోయేవారు. నాటి స్త్రీలు దొర గారి, దొరసాని గాని పిలిస్తే కంచం ముందు కూర్చున్నా సరే భోజనం వదిలేసి వెంటనే లేచి వెళ్ళాలి.
ఉర్దూ ప్రభుత్వ భాష అయినప్పటికీ హైదరాబాదు బహుభాషా ప్రాంతం. రాజ్యంలోని 16 జిల్లాల్లో ఒక కోటి 60 లక్షల మంది జనాభాలో హిందువులు 85% భాషా పరమైన, సంస్కృతికపరమైన హక్కులు లేకుండా చేయటం ప్రభుత్వ విధానముగా ఉండేది. దినపత్రికలు లేవు, పౌర హక్కుల ప్రసక్తే లేదు. ప్రభుత్వ అనుమతించనిదే బహిరంగ సభలు పెట్టడానికి వీల్లేదు.
1918లో వరకు హైదరాబాదులో మొదటి కాంగ్రెస్ కమిటీ ఏర్పడలేదు. 1892 ఆర్య సమాజ్ అవతరణ, 1895లో గణేష్ ఉత్సవాలు సామూహికంగా జరుపుకోవడం, 1901 హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం స్థాపన, 1921లో ఆంధ్ర జన సంఘం స్థాపన. తెలుగు పత్రికలు అయినా నీలగిరి పత్రిక, గోల్కొండ పత్రికలో వెలువడటం, 1928లో ఆంధ్ర బాలికోన్నత పాఠశాల స్థాపన, ఆంధ్ర జన సంఘం- ఆంధ్ర మహాసభ గారు రూపొంది సాంఘిక, సంస్కృతిక కార్యక్రమాలే కాకుండా రాజకీయ కార్యక్రమాలకు కూడా కేంద్ర స్థానంగా రూపొందింది. సాయుధ పోరాటంలో రైతులు, కమ్యూనిస్టులు ప్రజలు దొరలపైన, భూస్వాములపై, నిజాం సైన్యం మరియు రజాకార్లపై తిరుగుబాటుతో రైతులు, స్త్రీలు, గ్రామ సంఘాలు పాల్గొనడం భారత ప్రభుత్వం యూనియన్ సైన్యంతో సెప్టెంబరు 27న హైదరాబాద్ రాజ్యం విముక్తి, విమోచన పొంది భారత దేశంలో విలీనం అయినది.
డా. విజయ్ కుమార్
Comments