జిల్లా పోలీసులకు, ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన శుభాకాంక్షలు -. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Madupa Santhosh CEO
ADB :జిల్లా పోలీసులకు, ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన శుభాకాంక్షలు -.  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 
ఆదిలాబాద్: అక్షర తెలంగాణ 
ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం.

 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుండి విడుదలైన ఒక్కప్పటి హైదరాబాద్ రాష్ట్రం.

 ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు మరియు పోలీసు ముఖ్య కార్యాలయం నందు జాతీయ పతాకాన్నీ ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ.

 సమిష్టి కృషితో ప్రతిరోజు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పోలీసు కార్యాలయాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు మరియు జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం నందు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు, సిబ్బందికి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మొదటగా ప్రముఖుల చిత్రపటాలకు నివాళులర్పించి పోలీసు గౌరవ వందనాల నడుమ జాతీయ పతాకాన్ని సిబ్బంది సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. సిబ్బందికి మిఠాయిలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని దానికి, ప్రతి ఒక్కరూ మరింత కృత నిశ్చయంతో విధులను నిర్వర్తించి దేశంలోని తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉండే విధంగా గెలిచేందుకు కృషి చేయాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17వ తారీఖున భారత యూనియన్ నందు విలీనమైన సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ సాధించడానికి కృషి చేసిన మహనీయులపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పిలు పి మౌనిక ఐపీఎస్, బి సురేందర్ రావు, ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది డిపిఓ కార్యాలయం ఏవో శివ కుమార్, సూపర్డెంట్లు సులోచన, సంజీవ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments