ఆదిలాబాద్: అక్షర తెలంగాణ
నియోజకవర్గ నలుమూలనుండి తరలివచ్చిన ప్రజలు
తమ సమస్యలపై కంది శ్రీనివాస రెడ్డికి వినతులు
ఓపికగా ప్రజల దరఖాస్తులు స్వీకరించిన కంది శ్రీనివాస రెడ్డి పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి
ఆదిలాబాద్. పట్టణం లోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా దర్భార్ కు విశేష స్పందన కనిపించింది. అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ దర్బార్ లో నియోజకవర్గంలోని నలు మూలల నుండి ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజలు పార్టీ శ్రేణులు తమ సమస్యల పై కంది శ్రీనివాస రెడ్డి కి వినతి పత్రాలు అందించారు.ఇందిరమ్మ ఇండ్లు, సీయంఆర్ఎఫ్, పెన్షన్లు ,భూములకు సంబంధించిన విషయాలపై ఆయనను తమ సమస్యలు చెప్పుకొని దరఖాస్తులు అందించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన ఓపికగా అందరి సమస్యలు విని వినతులు స్వీకరించారు. వాటిపై సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.వెంట వెంటనే దరఖాస్తులను క్యాంపు కార్యాలయ సిబ్బంది కంప్యూటర్ లో అప్లోడ్ చేసారు. ప్రజల సమస్యలపై అందిన దరఖాస్తులను కంప్యూటరీకరించేందుకు తన కార్యాలయంలోనే ఒక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ఆయ తెలిపారు. దీని ద్వారా పరిష్కార అప్డేట్స్ వెనువెంటనే తెలుసుకునే అవకాశముంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ నాయకులతో పాటు బేల, భోరజ్, జైనథ్, మావల ఆదిలాబాద్ రూరల్ సాత్నాల మండల నాయకులు కార్యకర్తలు ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Comments