బలవంతంపు వసూలు చేస్తున్న ట్రాన్స్‌జెండర్ల అరెస్ట్- ఇన్స్పెక్టర్ కె. నాగరాజు

Madupa Santhosh CEO
ADB : బలవంతంపు వసూలు చేస్తున్న  ట్రాన్స్‌జెండర్ల అరెస్ట్- ఇన్స్పెక్టర్ కె. నాగరాజు
ఆదిలాబాద్: అక్షర తెలంగాణ 
ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులను బెదిరిస్తూ, ఇబ్బందులకు గురిచేసి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ఐదుగురు ట్రాన్స్‌జెండర్లను ఆదిలాబాద్ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.
బుధవారం ఉదయం 10:30 గంటల సమయంలో బస్టాండ్‌లో ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉన్న సమయంలో కొందరు ట్రాన్స్‌జెండర్లు వారి వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, డబ్బులు ఇవ్వకపోతే న్యూసెన్స్ చేస్తూ అవమానాలకు గురిచేస్తున్నట్లు బస్టాండ్ మేనేజర్ మిట్టపల్లి నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను షేక్ మహమ్మద్ @ తానియా @ తనూజ తాటిగూడ, ఆదిలాబాద్.సిద్దం రోహిత్ @ తాన్యా  పాండర్‌కవాడ, మహారాష్ట్ర,నాగారం మోహన్ @ నిషా  తాటిగూడ, ఆదిలాబాద్,గెడాం ఆశిష్ @ ఆశు పాండర్‌కవాడ, మహారాష్ట్ర,. షేక్ సద్దాం @ సిమ్రాన్ , కేశవపట్నం, ఇచ్చోడ.వీరిపై ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 668/2026, సెక్షన్ 308(2) BNS కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ కె. నాగరాజు తెలిపారు.
ప్రజలను బెదిరించి, భయపెట్టి లేదా ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.
Comments