టి.ఆర్.ఎస్ పార్టీ లోకి భారీగా చేరికలు.. కండువాలు కప్పి ఆహ్వానించిన రాథోడ్ బాపురావు

Madupa Santhosh CEO
ADB: టి.ఆర్.ఎస్ పార్టీ లోకి భారీగా చేరికలు.. కండువాలు కప్పి ఆహ్వానించిన  రాథోడ్ బాపురావు 
ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ 
 బోథ్ నియోజకవర్గం గుడిహత్నూర్ మండల కేంద్రం లోని  జవహర్ నగర్ కాలని వాసులు తెలంగాణ రక్షణ సేన టి.ఆర్.ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్, బి.ఆర్.ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన టి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు  మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా టి ఆర్ ఎస్ పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితక్క ప్రజలకు ఉచిత విద్య, నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయాలనే లక్ష్యంతో పంచజన్యం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారని తెలిపారు . ప్రజలకు మేలు చేసే విధానాలు, సంక్షేమ పథకాలపై విశ్వాసంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టి ఆర్ ఎస్ చేరుతున్నారని అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పార్టీ పనిచేస్తుందని, కార్యకర్తలకు సముచిత గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి పెరుగుతున్న ఆదరణకు ఈ చేరికలు నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది ప్రజలు టి ఆర్ ఎస్ పార్టీ వైపు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రాథోడ్ బాపురావు స్వగృహంలో సందడి చేసిన పూనగూడ దండారి బృందం
ఆదిలాబాద్: అక్షర తెలంగాణ 
బోథ్ నియోజకవర్గం తలమడుగు: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారి ఉత్సవాలు గ్రామగ్రామాన ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో *తలమడుగు మండలంలోని పూనగూడ గ్రామానికి* చెందిన దండారి బృందం సోమవారం ప్రత్యేకంగా పర్యటించి తన కళా ప్రదర్శనతో సందడి చేసింది. *తెలంగాణ రక్షణ సేన టి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, బోథ్ మాజీ ఎమ్మెల్యే  రాథోడ్ బాపురావు  స్వగృహానికి చేరుకున్న దండారి బృందం అక్కడ సంప్రదాయబద్ధంగా దండారి నృత్యాన్ని ప్రదర్శించింది. డోలు చప్పుళ్లు, సంప్రదాయ వాయిద్యాల నడుమ కళాకారులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పారు. సాంప్రదాయ దుస్తులు ధరించి, ప్రత్యేకమైన నృత్యరీతులతో ప్రదర్శన ఇచ్చిన కళాకారులు అక్కడి వారిని ఆకట్టుకున్నారు. దండారి పాటలు, నృత్యాల మధ్య స్వగృహం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా దండారి బృందం ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఆదివాసీ సమాజంలో దండారి ఉత్సవాలకు విశిష్టమైన స్థానం ఉంది. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం ద్వారా గిరిజనుల జీవన విధానం, ఐక్యత, కళా వైభవం ప్రతిబింబిస్తాయి. పండుగ సమయంలో గ్రామాల మధ్య పరస్పర సందర్శనలు, దండారి బృందాల ప్రదర్శనలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ వేడుకలు యువతకు తమ పూర్వీకుల సంస్కృతిని పరిచయం చేయడంతో పాటు సంప్రదాయ కళలను భవిష్యత్ తరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పూనగూడ గ్రామ దండారి బృందం రాథోడ్ బాపురావు  స్వగృహానికి చేరుకుని ప్రదర్శన ఇవ్వడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా టి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని దండారి కళాకారులను ఉత్సాహపరిచారు. ఆదివాసీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎంతో ఆదరణ పొందుతున్న దండారి ఉత్సవాలు ఆదివాసీల ప్రత్యేక గుర్తింపును చాటుతున్నాయి. ఇలాంటి వేడుకల ద్వారా సంప్రదాయ కళలకు మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు గిరిజన గ్రామాల మధ్య సోదరభావం, ఐక్యత బలపడుతున్నాయి.ఈ కార్యక్రమం లో మహాజన్ దేవరీ మరియు నారాయణ టీచర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Comments