ఐటీ టవర్‌ను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Madupa Santhosh CEO
ADB : ఆదిలాబాద్ అభివృద్ధికి మరో మైలురాయి.!
 నూతన ఐటీ టవర్‌ను  ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 
ఆదిలాబాద్: అక్షర తెలంగాణ 

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు కి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ l, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి బండారి అనూష సతీష్ , కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్ , ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి , మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ , టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి , టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ డి .శేఖర్ ఘన స్వాగతం పలికారు. ఆయనతో కలిసి ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, జిల్లాలో ఐటీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా జిల్లా కేంద్రాలకు విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఐటీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, జిల్లాలో పారిశ్రామిక, సాంకేతిక అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఐటీ రంగాన్ని జిల్లాలకు విస్తరించేందుకు కృషి చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ఈ ఐటీ టవర్ స్థానిక యువతకు కొత్త అవకాశాలకు వేదికగా నిలుస్తుందని, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments