కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో 107 ద్విచక్ర వాహనాలు స్వాధీనం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Madupa Santhosh CEO
ADB : కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో 107 ద్విచక్ర వాహనాలు స్వాధీనం: అఖిల్ మహాజన్
అదిలాబాద్ : అక్షరతెలంగాణ 
ప్రజల రక్షణ భద్రతకై కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల కేఆర్ కే కాలనీలోఏర్పాటు. 
- సరైన ధ్రువపత్రాలు లభించని 107 ద్విచక్ర వాహనాలు, ఆరు ఆటోలు, ఒక మిని ట్రాలీ తాత్కాలికంగా స్వాధీనం.
- 31 మంది అనుమానాస్పద వ్యక్తుల గుర్తింపు.
- మాదకద్రవ్యాల కై 5 గృహాలలో పోలీసు డాగ్ స్క్వాడ్ తనిఖీలు.
- 4 బెల్టు షాపులలో,146 మద్యం క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం.
- ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకూడదు చట్ట విరుద్ధమైన పనులు నిర్వహించకూడదని హెచ్చరిక.
-ఫింగర్ ప్రింట్ పరికరం ద్వారా 20 మంది గుర్తింపు.
-కార్యక్రమంలో పాల్గొన్న 250 మంది పోలీసు సిబ్బంది అధికారులు.
 ప్రజల రక్షణ సురక్షిత లో భాగంగా శనివారం సాయంత్రం ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక కేఆర్ కే కాలనీ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు ఎలాంటి సందర్భంలోనూ ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ రాదని, రాత్రి సమయాలలో అనవసరంగా తిరగరాదని, ఈవ్ టీజింగ్ మహిళలను వేధించడం లాంటివి చేయకూడదని, గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. బయటి రాష్ట్రాల నుండి బయట దేశాల నుండి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఇళ్లను అద్దెకు ఇవ్వాలని, వారు ఎలాంటి నేరాలకు పాల్పడిన యజమానులపై కూడా కేసులు నమోదు అయితాయని గుర్తుంచుకోవాలని సూచించారు. దాదాపు 250 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొని కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు సరైన ధ్రువపత్రాలు లభించని 107 ద్విచక్ర వాహనాలు ఆరు ఆటోలు ఒక మినీ ట్రాలీని తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. 31 అనుమానస్పద వ్యక్తులను గుర్తించడం జరిగిందని తెలిపారు. మాదకద్రవ్యాల కై డాగ్ స్క్వాడ్ తో ప్రత్యేకంగా ఐదు గృహాలను తనిఖీ చేయడం జరిగింది. ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా ఉండాలని సూచించారు. తనిఖీలలో భాగంగా నాలుగు మద్యం బెల్టు షాపులను గుర్తించి కేసులు నమోదు చేయడం జరిగింది. వీరి వద్దనుండి దాదాపు 146 మద్యం క్వార్టర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫింగర్ ప్రింట్ పరికరం ద్వారా 20 మందిని గుర్తించారు. చట్ట విరుద్ధంగా ఎలాంటి పనులు నిర్వహించకూడదని సూచించారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ మరియు మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించిన వాహనాలు, నెంబర్ ప్లేట్ లేని వాహనాలు 20 పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగిందని తెలిపారు. గంజాయి అమ్ముతున్నారని అనుమానంతో ఐదు గృహాలలో ప్రత్యేక తనిఖీలు చేపట్టడం జరిగిందని వారికి గంజాయి కిట్ల ద్వారా గంజాయి సేవించారని పరిశీలన జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పిఎల్ జీవన్ రెడ్డి, సిఐలు కే ఫణిదర్, బి సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్, డి సాయినాథ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఎం చంద్రశేఖర్, డి వెంకటి, ఎస్సైలు, ఏఎస్ఐలు, స్పెషల్ పార్టీ, రిజర్వ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments