ADB: మే 4న జరుగనున్న నీట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా.అదిలాబాద్ : అక్షరతెలంగాణ
UGC (యు జి సి), NEET ( నీట్) పరీక్ష పై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తో కలసి విద్యా, వైద్యశాఖ, సంబంధిత అధికారులు, ప్రిన్సిపల్స్ తో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల మే 4 ప తేదిన మధ్యహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరగనున్న నీట్ పరీక్ష కు ఆన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా
కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
పరీక్ష కేంద్రాలలో త్రాగునీరు, నిరంతర విద్యుత్, శానిటేషన్, బెంచీలు, బస్ సౌకర్యం తదితర ఏర్పాట్లను పూర్తి చేయాలనీ, ఆన్నారు.
తరగతి గదులు, బెంచీలు, శుభ్రం చేయాలనీ, తదితర ఏర్పాట్లు ఈ నెల 30 లోగా ఆన్ని పరీక్ష కేంద్రాలలో మౌళిక సదుపాయాలు కల్పించాలని ఆన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ అశోక్, డీఈఓ, ప్రిన్సిపల్స్, తదితరులు పాల్గొన్నారు.
Comments