రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Madupa Santhosh CEO
ADB :  రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి :సర్టిఫికెట్లు పంపిణీ  చేసిన 
జిల్లా కలెక్టర్ రాజర్షి షా.
అదిలాబాద్ : అక్షరతెలంగాణ
ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఒకరికి రక్తదానం చేస్తే ప్రాణం కాపాడిన వారం అవుతామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. 
ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం అనేది అన్ని దానాల కంటే గొప్ప దానం అని అన్నారు. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినప్పుడే  ఆపద సమయంలో ఉపయోగ పడుతుందని,  రక్తం ఏ సమయంలో ఎప్పుడు అవసరం అవుతుందో ఎవరికి తెలియదన్నారు 
.ప్రమాదాల బారిన పడిన సమయంలో గర్భిణీలకు తలసేమియా కొన్ని రకాల ఆపరేషన్ల కు రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఇలా రకరకాల సమయాల్లో రక్తం అవసరమవుతుందని,  జిల్లా లో గొప్పగా చెప్పుకోవాలంటే స్వచ్ఛంద సంస్థలు రక్తదానాల శిబిరాలు నిర్వహించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఆపదలో ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయని, జిల్లాలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు రక్తదానం శిబిరాలు నిర్వహించటం అత్యవసర పరిస్థితిలో రక్తం అవసరం ఉంటే స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తారని ఆన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల లోని బ్లడ్ బ్యాంక్ రాష్ట్రంలో మొదటి స్థానం లో ఉందని, అందుకు స్వచ్ఛంద సంస్థల కీలక పాత్ర ఎంతో ఉందని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహించడం వల్ల రిమ్స్ డైరెక్టర్ డాక్టర్  జై సింగ్ రాథోడ్ కు గొప్ప పేరు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా వచ్చిందని ఈ సందర్భంగా కలెక్టర్ కొనియాడారు. రక్తదానం పై మరింత అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రక్తదాన దినోత్సవ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందించారు 
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్,  ఆర్ ఎం ఓ సాయి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కృష్ణ, అబ్దుల్ అజీజ్, పసుపుల రాజు, రామచంద్ర మహాత్మా, హేమావతి, సత్యం, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


 2- పిడుగుపాటుకు గురై రిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా .
ఇటీవలే పిడుగుపాటుకు గురై రిమ్స్ లో  చికిత్స పొందుతున్న బాధితులను శనివారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరామర్శించి, వారి ఆరోగ్య స్థితిగతులను వైద్యులను అడిగి తెలుసుకొని, మంచి ట్రీట్మెంట్ అందించి త్వరగా కోలుకొనేల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆన్నారు.
అనంతరం ఎమర్జెన్సీ వార్డు లోని మరుగుదొడ్లను పరిశీలించి శుభ్రత పాటించక పోవడం తో  అసహనం వ్యక్తం చేశారు. రోగుల ను పరిశీలించే టైంలో వైద్యులు ఎవరెవరు ఉన్నారని ఆరా తీశారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వైద్యులు సమయానికి వస్తున్నారా లేదా అని  అక్కడ ఉన్న సిబ్బంది ని అడగగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో కేసిట్ లను తెప్పించి ఏ వైద్యులు ఎప్పుడు వస్తున్నారో ఆరా తీసి విధులలో నిర్లక్ష్యం వహించిన వారి పై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ను ఆదేశించారు.
కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.


3- రైతు నేస్తం కార్యక్రమానికి ఆన్ని ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా.

జూన్ 16 సోమవారం రోజున కొత్తగా 32 రైతువేధికలను పర్చువల్ గా లాంఛనంగా మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి :
ఈ నెల    16 వ తేదీన జరగనున్న రైతు నేస్తం కార్యక్రమానికి ఆన్ని ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
రైతు నేస్తం, పీఎం జన్ మన్ జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ సదస్సులు పై జిల్లా పాలనాధికారి రాజర్షి షా సంబంధిత అధికారులతో శనివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రైతునేస్తం కార్యక్రమం లో గౌరవ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడతారని, ఆ ప్రసారాన్ని అన్ని రైతునేస్తం కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుందని, ప్రతినిధులను ఆహ్వానించి, ప్రతి ప్రాంతం నుంచి కనీసం 250 మంది రైతులు హాజరయ్యేలా చూసి, కార్యక్రమాన్ని సముచితంగా నిర్వహించాలని అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు 

ఈ కార్యక్రమం ద్వారా రైతులు వ్యవసాయ నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 17 కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని విస్తరించి, ఈ నెల 16 నుండి అదనంగా మరో 32 కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ సదుపాయం ద్వారా నిపుణులు ఏ పంటలు వేసుకోవాలి, ఆధునిక సాగు విధానాల గురించి రైతులకు తరచూ సూచనలు ఇస్తారని కలెక్టర్ పేర్కొన్నారు 

ఈ కార్యక్రమం కోసం ప్రతి రైతునేస్తం కేంద్రంలో సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారితో పాటు మండల స్థాయి అధికరులైన ఎంపీడీఓ,ఎంపీవో వ్యవసాయ అధికారులను నియమించడం జరిగిందనీ, నూతనంగా ఏర్పాటు చేసిన 32 రైతు వేదికలను ముస్తాబు చేసి పండుగ వాతావరణంలో నిర్వహించాలని, ఇంటర్నెట్ కనెక్షన్ తో పాటు ఆన్ని మౌళిక వసతులు కల్పించాలని ఆయన సూచించారు.
జిల్లాలో మొత్తం 49 రైతు వేధికలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

అనంతరం జిల్లాలో పీఎం జన్మన్, జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ సదస్సులు ప్రారంభానికి సిద్ధం చేయాలనీ ఆన్నారు.
పీఎం జన్ మన్ , జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ సదస్సులు (Saturation Campaign)ఈ నెల 15వ తేదీ నుండి 30వ తేదీవరకు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం కింద జిల్లాలో 150 గ్రామాలు ఎంపిక చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ సదస్సుల ద్వారా గిరిజనులకు అవసరమైన అన్ని రకాల ప్రభుత్వ సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, నివాసం, విద్యుత్, మంచినీరు, రోడ్లు తదితర రంగాల్లో అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ టెలి కాన్ఫరెన్స్ లో ఐటిడిఎ పిఓ ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సుబ్ కలెక్టర్ యువరాజ్, ఆర్డీఓ వినోద్ కుమార్, సంబంధిత జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు 
Comments