బోడ కాకర కాయ క్యాన్సర్, గుండె సమస్యలను నివారించే రారాజు.

Madupa Santhosh CEO
బోడ కాకర కాయ క్యాన్సర్ , గుండె. సమస్యలను నివారించే రారాజు.
మన ఆరోగ్యం: అక్షరతెలంగాణ
 వర్షకాలంలో   బోడ కాకర కాయలు మార్కెట్లో ఎక్కువగాకనిపిస్తాయి. వీటిలో అనేక రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా అదుపులో ఉంటాయి. ఇవి తెలంగాణాలో ఎక్కువగా ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, ఇతర గిరిజన సాగు మరియు అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తాయి. వీటిని తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వర్షాకాలంలో వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Boda kakarakaya Health Benefits:
బోడ కాకర కాయల్లో లభించే పోషకాలు:
బోడ కాకర కాయల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్లు, అమైనో ఆమ్లాలులతో పాటు జింక్, పొటాషియం, ఫాస్పరస్ ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
బోడ కాకర అటవి ప్రాంతాలలో సహజంగా దొరికేవి. బీడు బూముల్లో, పర్వత ప్రాంతాల్లో, తొలకరి వర్షాలు కురిసినప్పుడు జూన్-జులై మాసాల్లో మొలకెత్తి ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మనకు లభిస్తుంటాయి. మార్కట్లో ఈ బోడ కాకరకాయకు మంచి గిరాకి ఉంటుంది. కిలో రూ.200 నుంచి 250 వరకు ధర పలుకుతుంది. వీటిని పండించడం ద్వారా బోలెడు లాభాలను అందుకోవచ్చు.
ఎకరం బూమిలో బోడ కాకరకాయ పంట సాగు చేసేందుకు మంచి దుంపలను గుర్తించి తొలకరి వర్షాలు పడినప్పుడు సేకరించుకోవాలి. ప్రత్యేకంగా విత్తనం కోసం సాగుచేసి అక్టోబర్ నెలలో పండ్ల నుంచి గింజలను తీసిపెట్టుకోవాలి. ఈ గింజల్లో తేమ శాతం పూర్తిగా తగ్గే వరకు అరబెట్టాలి. ఇనుప డబ్బాల్లో కాకుండా గుడ్డ సంచిలో మూట కట్టి నిల్వ చేసుకోవడం చాలా మంచిది. ఎకరం భూమిలో బోడ కాకరకాయ సాగు చేయడానికి 8-10 కిలోల విత్తనం సరిపోతుంది.వర్షాకాలం స్పెషల్..! బోడ కాకరకాయకు భలే డిమాండ్..
ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తుంది..
బోడ కాకరకాయకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఏడాదిలో కేవలం నెల నెలన్నర రోజులు మాత్రమే ఇది మార్కెట్కు వస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ సీజనల్ కూరగాయ బోడకాకరకాయను కనీసం ఒక్కసారైనా తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అన్ని మార్కెట్లలో బోడ కాకర విక్రయానికి వస్తుంది. కిలో రూ.380 నుంచి రూ.400 వరకు ధర పలుకుతోంది. రసాయనాలు లేకుండా పండే ఈ బోడ కాకర ధర చికెన్ కంటే కూడా ఎక్కువే అయినప్పటికీ, ప్రజలు దీన్ని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే..
బోడ కాకర కాయతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
కేవలం వర్షా కాలంలో మాత్రమే విరివిగా లభించే ఈ బోడ కాకర కాయ కూర వండుకుని తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. బోడకాకరకాయలో విటమిన్లు ఏ, సీ, కే సమృద్ధిగా ఉంటాయి.
మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. బ్లడైషర్ కంట్రోల్లో ఉంచుతుంది. ముఖంపై మొటిమలు, తామర వంటి చర్మ సమస్యలకు ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు బోడకాకరకాయలను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బోడకాకరకాయ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు నుంచి రక్షణ కల్పిస్తుంది. తలనొప్పి, చెవి నొప్పి వంటి 3 సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు బోడ కాకరకాయ మంచి ఎంపిక. దీనిలోని ఫైబర్తో పాటు అధిక నీటి శాతం షుగర్ పేషెంట్లకు మేలు చేస్తుంది. బోడ కాకరకాయలో మంచి మొత్తంలో మొక్కల ఇన్సులిన్ ఉంటుంది. అందుకని డయాబెటిక్ రోగులకు ఇది సరైన ఎంపికగా పరిగణిస్తారు.
శరీరంలో క్యాన్సర్ కలిగించే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి బోడ కాకరకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది విటమిన్ సి, సహజ యాంట ఆక్సిడెంట్స్ కు గొప్ప మూలం. శరీరంలో పేరుకుపో టాక్సిన్స్ ను తొలగించి క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. బీటా కెరోటిన్, లుటీన్, జాంక్సెథిన్ వంటి ఫ్లేవోనైట్ వంటి పోషకాలు బోడ కాకరకాయలో పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలన్నీ చర్మానికి చాలా పయోగకారిణిగా ఉంటుంది.
బోడ కాకర కాయ ప్రయోజనాలు 
బోడ కాకర బాధపడుతున్నవారికి కాయ ఎంతో మధుమేహంతో ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు గ్లైసెమిక్ ఇండెక్పై ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. దీంతో మధుమేహం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

 బరువుతగ్గాలనుకునేవారికి కూడా బోడ కాకర కాయ ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో అధిక పరిమాణంలో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడమేకాకుండా శరీరం యాక్టివ్గా తయారవుతుంది.
బోడ కాకర కాయలో పొటాషియం కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి తరచుగా రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది.
బోడ కాకర కాయలో క్యాన్సర్ తో  పాటు ఆనేక రకాలైన సీజనల్ వ్యాధుల ను, గుండె.    సమస్యలను నివారించే అనేక రకాల మూలకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. వృద్ధాప్యాన్ని నివారిస్తాయి.
బోడ కాకరకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
అలాగే దీనిలో ఫైటోన్యూట్రియెంట్లు అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. 100 గ్రాముల బోడ కాకరకాయలో 17 గ్రాముల కేలరీలు మాత్రమే ఉంటాయి. అందువల్ల ఇది బరువు తగ్గడంతో కూడా తోడ్పడుతుంది.
బోడ కాకరకాయలో ఫ్లేవొనైట్ పోషకాలు  పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలన్నీ చర్మానికి చాలా మేలు చేస్తాయి. వృద్ధాప్యాన్ని నివారిస్తాయి.
బోడ కాకరకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
అలాగే దీనిలో ఫైటోన్యూట్రియెంట్లు అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. 100 గ్రాముల బోడ కాకరకాయలో 17 గ్రాముల కేలరీలు మాత్రమే ఉంటాయి.
అందువల్ల ఇది బరువు తగ్గడంతో కూడా తోడ్పడుతుంది.
వర్షాకాల సీజన్ లో పండే పంటలు తాజాగా ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి కొన్ని సీజన్లలో కొన్ని రకాలు పండ్లు, కూరగాయలు కాస్తుంటాయి. సీజనల్ పండ్లు అయినా..కూరగాయలు అయినా ఖచ్చితంగా తినాలని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం వర్షాకాలంలో అనేక రకాలు పండ్లు, కూరగాయలు కాస్తుంటాయి. వాటిల్లో ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనం చేకూర్చేది బోడకాకరకాయ.

వర్షాకాలంలో బోడ కాకరకు మంచి డిమాండ్ ఉంటుంది. దీన్ని కొన్ని ప్రాంతాల్లో 'ఆకాకరకాయ, బొంత కాకరకాయ అని కూడా పిలుస్తారు. ఈ కాకరకాయ రుచితో పాటు పోషకాలు కూడా అందిస్తుంది. అటవీ ప్రాంతాలతో పాటు దిగువ ప్రాంత రైతులు బోడ కాకరకాయలు అధికంగా పండిస్తున్నారు. బోడకాకరతో
పలు రకాల వంటకాలను, వివిధరకాల ప్రయోజనాలు గల అహార పదార్థాలను తయారు చేస్తారు. పులుసు, వేపుడు కూర, పొడి చేసుకుని భోజన ప్రియులు ఇష్టంగా తింటారు. ఈ బోడకాకరకాయల్లో రుచి మాత్రమే కాదు పోషక విలువలు, ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి.
ఇక బోడ కాకరకాయల గురించి తెలిసిన వాళ్ళు సీజన్ వచ్చిందంటే చాలు ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ బోడ కాకరకాయ కిలో 150 రూపాయలుపైన పలికినా.. దీనిని కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
బొడ కాకరతో ప్రయోజనాలు..
బోడ కాకరలో పోషక విలువలతో పాటు ఔషధ విలువ మెండుగా ఉంటాయి.బోడకాకరతో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. అలాగే దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
బోడకాకరలో ఫోలేట్స్ అధికశాతం ఉంటాయి. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది
బోడకాకర గర్భిణీలు తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.
బోడకాకరలోని కెరోటినాయడ్స్ కంటి సంబంధిత వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది.
బోడ కాకరకాయ క్యాన్సర్ సహా ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడగకుండా రక్షిస్తుంది.
బోడకాకరలో ఉండే ఫ్లవనాయిడ్లు వయస్సు మీరి వచ్చే ముడతలను నియంత్రిస్తాయి.
బోడ కాకరకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
బోడ కాకర కాయలు తినడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి.
బోడ కాకరకాయలు శరీరంలోని కొవ్వును తగ్గించడానికి, బరువు తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి.
బోడ కాకర కాయలు తింటే బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయి.
ఫైటో న్యూట్రిషన్ కలిగిన బోడ కాకరకాయ శరీరంనుండి నీరసాన్ని తగ్గిస్తాయి. ఇది రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది.
బోడ కాకర కాయలలో ఫైబర్ ఉంటుంది. ఇది అజీర్ణాన్ని, మలబద్ధకాన్ని, గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యలను తగ్గిస్తుంది.
బోడ కాకర కాయలు యాంటీ అలర్జీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి సీజనల్ వ్యాధుల నుంచి కాపాడతాయి.
Comments