ADB: బాధితుని కారు ను అక్రమంగా తాకట్టు పెట్టు కున్న వ్యక్తి అరెస్ట్ -ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్
అదిలాబాద్ : అక్షరతెలంగాణ
బాధితుడు కి అప్పు ఇచ్చి తీర్చిన తర్వాత కూడా తాకట్టు పెట్టిన కారూ ను తిరిగి ఇవ్వకుండా ఉన్న నిందితులు.
నిందితుడు ముమ్మడివార్ రామ్ కుమార్ అరెస్ట్ రిమాండ్.బాధితుడు మంచాల మోహన్ రెడ్డి ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీ చెందిన వ్యక్తి ముమ్మడివార్ కృష్ణ వద్ద 90 వేల రూపాయల నగదును అప్పుగా తీసుకొని, తన కారును కృష్ణకు హామీగా అప్పగించడం జరిగింది. ఐదు నెలల తర్వాత మంచాల మోహన్ రెడ్డి తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా 1,50,000 తిరిగి చెల్లించడంతో కారును తిరిగి అందించాలని తెలపడంతో, నిరాకరించి, కారును అందించకపోవడంతో. అదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించగా వన్టౌన్ సీఐ బి సునీల్ కుమార్ క్రైమ్ నెంబర్ 206/25 తో కేసు నమోదు చేయడం జరిగిందని అతనిపై 420 మరియు 406 ఐపిసి కింద కేసు నమోదు చేసి విచారణ జరపగా, నిందితులు ముమ్మడివార్ కృష్ణ మరియు అతని తమ్ముడు ముమ్మడివార్ రామ్ కుమార్
అనే వారు మోహన్ రెడ్డి కారును మహారాష్ట్రలోని పూసద్ వద్ద మూడున్నర లక్షలకు డబ్బును తీసుకొని కారును తాకట్టు పెట్టినట్టు విచారణలో తేలగా, ఈరోజు ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ సిబ్బంది కారును తిరిగి స్వాధీనం చేసుకొని కోర్టు నందు హాజరు పరచడం జరుగుతుందని తెలిపారు. ఇందులో ముమ్మడి వార్ రామ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందని ఇతనిపై ఇదివరకే ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఓపెన్ చేయడం జరిగిందని తెలిపారు. వీరిద్దరూ ఒక హత్య కేసునందు నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. ఇతనిని రిమాండ్ కు పంపగా 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ కేటాయించడం జరిగిందని తెలిపారు. పట్టణంలో జిల్లాలో మరే ఇతర ప్రజలు నిందితులచే బాధింపబడ్డవారు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.నిషేధిత గడ్డి మందు రవాణా చేస్తూ పట్టుబడ్డ యువకుని పై కేసు నమోదు. - ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ .
మహారాష్ట్ర నుండి అక్రమంగా తీసుకు వస్తున్న యువకుడు.- గ్లైఫోసేట్ నిషేధిత గడ్డి మందు 30 బాటిల్లు స్వాధీనం.
గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు విచారణ.వాహన తనిఖీల్లో ముత్నూర్ ఎక్స్ రోడ్డు వద్ద లభ్యమైన నిషేధిత గడ్డి మందు.
గుడిహత్నూర్ పోలీసులు ముత్తునూర్ ఎక్స్ రోడ్ వద్ద మంగళవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా సభల గంగాధర్, సిరికొండ కు చెందిన వ్యక్తి మహారాష్ట్ర బోధిడీ నుండి నిషేధిత గడ్డి మందు గ్లైఫోసేట్ 30 రౌండప్ బాటిల్లను అక్రమంగా రవాణా చేయగా పట్టుబడడం జరిగిందని ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్ తెలిపారు. ఈ నిషేధిత గడ్డి మందు వల్ల ప్రజలకు భయానక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం దీనిని తెలంగాణ నందు నిషేధించడం జరిగిందని తెలిపారు.
నకిలీ విత్తనాలు మరియు నిషేధిత మందులను అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఇతనిపై గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ భయానకమైనటువంటి వ్యాధులను సృష్టించగల క్యాన్సర్ లాంటి వాటివి ఈ నిషేధిత మందులను వాడడం వల్ల వచ్చే అవకాశం ఉన్నందున వాటిని వాడవద్దని ప్రజలకు సూచించారు.నకిలీ పత్రాలు సృష్టించి భూములను కబ్జా చేస్తే ఖబర్దార్. - డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి
అదిలాబాద్ మావల పోలీస్ స్టేషన్ నందు నకిలీ పత్రాలు సృష్టించి, భూమి కబ్జా కు పాల్పడిన ముఠాలోని ప్రధాన నిందితుడు షేక్ అర్బాజ్ అరెస్ట్.
ఐదుగురిపై కేసు నమోదు, ప్రధాన నిందితుడు అరెస్ట్. కైలాస్ నగర్ నందు గల సొసైటీలోని రెండు ప్లాట్లు అక్రమ పత్రాలు సృష్టించి కాజేయాలనే పన్నాగం.
రూరల్ పోలీస్ స్టేషన్ నందు నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తి అరెస్ట్ రిమాండ్.
1970 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కైలాస్ నగర్ నందు 20 ఎకరాల స్థలాన్ని నాన్ గెజిటెడ్ అధికారులకు సొసైటీకి కేటాయించడం జరిగింది. ఈ సొసైటీ 1977 సంవత్సరంలో కైలాష్ నగర్ నందు 225 ప్లాట్ లు గా విభజించి సభ్యులకు కేటాయించింది అందులో 8 ప్లాట్లను సొసైటీ సభ్యులు ప్రాంత అభివృద్ధికి మరియు పార్కు, యుటిలిటీస్ కి సంబంధించి వదిలీ వేయడం జరిగింది. ఈ వదిలివేసిన ఎనిమిది ప్లాట్ లలోని రెండు ఫ్లాట్లను ఎలాగైనా కబ్జా చేయాలని దురుద్దేశంతో ఆదిలాబాద్ పట్టణంలోని నకిలీ పత్రాలు సృష్టించిన నేరస్తుల ముఠా దానిని కబ్జా చేయాలని నకిలీ పత్రాలను సృష్టించారు.
1) షేక్ అర్బజ్ తండ్రి షేక్ అక్బర్, (అరెస్ట్ రిమాండ్) 2) షేక్ సమీ 3) సయ్యద్ ఇమ్రాన్ 4) పర్వీన్ బేగం 5) షేక్ నూర్జహాన్
లు కలిసి రెండు ప్లాట్లను కొట్టేయాలని పన్నాగం చేశారు. ఈ ఐదుగురిలో కీలక సూత్రధారి ముఖ్యుడు *షేక్ అర్బజ్* ఈరోజు స్థానిక దస్నాపూర్ వద్ద మావల ఎస్సై ముజాహిద్ పట్టుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా ఈ వివరాలను తెలియజేస్తూ షేక్ అర్బస్ 2002 సంవత్సరంలో సొసైటీలోని రెండు ప్లాట్లు (4,5 నెంబర్లు కలిగినవి ) ఎలాగైనా కొట్టేయాలనే దురుద్దేశంతో నకిలీ గా ఎమ్మార్వో కేటాయించడం జరిగిందని పత్రాలను సృష్టించాడు, ఈ సృష్టించిన పత్రాలు ఆధారంగా మున్సిపాలిటీ నుండి హౌస్ నెంబర్లను తీసుకొని వాటికి ఓపెన్ ప్లాట్ టాక్స్లు చెల్లిస్తూ ఉండడం జరిగింది. మొదట సయ్యద్ షమీ మరియు పర్వీన్ బేగం ల పై రెండు ప్లాట్లకు సంబంధించిన నకిలీ పత్రాలను సృష్టించి వాటిని మొదటగానే తన ముఠా సభ్యులైన సయ్యద్ ఇమ్రాన్ మరియు షేక్ నూర్జహాన్ లపై సెల్ డిడ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. ఈ ఘటనపై 2024 సంవత్సరంలో కమిటీ సొసైటీ సభ్యులైన లోక ప్రవీణ్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఆవల పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 275/24 తో కేసు నమోదు చేయగా నిందితులపై 447, 341, 420, 468,471, 467, 129 (b) r/w 34 ఐపిసి కింద కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇదివరకే ఈ ప్రధాన నిందితుడిపై పలు పట్టణంలో వివిధ కేసులు నమోదయినట్లు తెలిపారు. నకిలీ పత్రాలు సృష్టించి భూములను కాజేయాలని కబ్జా చేయాలని ఉద్దేశం కలవారిని జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. నకిలీ పత్రాలు సృష్టించి మున్సిపాలిటీ ద్వారా అక్రమంగా హౌస్ నెంబర్ ను తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే పూర్తి హక్కులు లభించమని ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లింక్ డాక్యుమెంట్లు ఉండాలని తెలిపారు. భూమి వారికి ఎలా కేటాయించబడింది దానికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు ప్రభుత్వ భూమా గిఫ్ట్ భూమా అనేది వివరాలు పూర్తిగా ఉన్నవారికి భూమి యొక్క అధికారాలు ఉంటాయని తెలిపారు. అక్రమ పత్రాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
అదేవిధంగా నిన్న రూరల్ పోలీస్ స్టేషన్ నందు గొడ్డల శ్రీనివాస్ అనే వ్యక్తి నకిలీ పత్రాలను సృష్టించి భూఆక్రమణలు చేస్తూ అదే విధంగా సర్వేనెంబర్ 68 నందు స్థలాలు ఆక్రమణ, భూ ఆక్రమణలు చేస్తూ ఉండడంతో అతనిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు.