కులం పేరుతో దూషించి గోడ్డలి తో కొట్టిన వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష -న్యాయమూర్తి కుమార్ వివేక్ ఆదిలాబాద్ : క్రైమ్ 1. అక్షరతెలంగాణ
షెడ్యూల్ ట్రైబల్ వ్యక్తిని కులం పేరుతో దూషించి గుడ్డలి తో కొట్టిన వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష మరియు రూ 2000/- జరిమానా విధించిన ఎస్సీ ఎస్టీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కుమార్ వివేక్.
కోర్టులో నందు శిక్షలు పడుతూ నేరస్తులకు మార్పులు రావాలని ఆకాంక్ష.
శిక్ష పడటంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.
జైనథ్ మండలానికి చెందిన గూడ గ్రామస్థుడు బాధితుడు మడవి రాజు మరియు తన భార్యతో కలిసి తేదీ 31.01.2022 రోజున ఉదయం తన బంధువుల ఇంటికి పిట్టగూడా గ్రామానికి వెళ్లి తిరిగి రాత్రి 8 గంటల సమయంలో గూడ గ్రామానికి వస్తుండగా అదే గ్రామస్తుడు నిందితుడు బండారి దేవన్న (62) తండ్రి రాములు అనే వ్యక్తి దారికి (రోడ్డు కు)అడ్డుగా వచ్చి మద్యం తాగడానికి డబ్బులు అడగగా, నా దగ్గర లేవు రేపు ఇస్తాను అని తిరిగి వెళుతుండగా, గోండోడ (కులాన్ని చెబుతూ అవమానించి) డబ్బులు ఇవ్వు అని తిట్టినాడు. ఇంకా గొడ్డలి పట్టుకొని వచ్చి తనను వెనక నుండి కొట్టగా తన కుడి కన్ను కనత భాగంలో దెబ్బ తగిలి గాయం కాగా వెంటనే మడావి రాజు 108 అంబులెన్స్ లో రిమ్స్కు తరలించి చికిత్సను అందించినారు.
మడావిరాజు దరఖాస్తు మేరకు అప్పటి జైనథ్ ఎస్సై బిట్ల పెర్సస్ కేసు నమోదు చేయగా డిఎస్పి వి ఉమేందర్ దర్యాప్తు చేసి సెక్షన్ 294 బి 324 ఐపిసి 3 (1)(r)(s) 43 (2)(va) 7 ఎస్సీ ఎస్టీ ఆక్ట్ నందు కేసు నమోదు చేయగా చార్జిషీటు దాఖలు చేయగా.
ప్రత్యేక పిపి ముస్కు రమణారెడ్డి 12 మంది సాక్షులను విచారించి నేరం రుజువు చేయగా ప్రత్యేక న్యాయమూర్తి ఎస్సీ ఎస్టీ కోర్టు కుమార్ వివేక్ తీర్పును వెలువరిస్తూ బండారి దేవన్న కు పైన సెక్షన్ 324 ఐపిసి కింద ఆరు నెలల పాటు సాధారణ జైలు,రూ 500/- జరిమానా, 3(1)(2) ప్రకారం ఆరు నెలలు మరియు 2000 రూపాయల జరిమానా, 3 (1)(s) ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష రూపాయలు 500 జరిమానా, మొత్తం అన్ని సెక్షన్లకి కలిపి ఆరు నెలల జైలు శిక్ష రూపాయల జరిమానా విధించడం జరిగింది.
ఇట్టి కేసు నందు కోర్టు డ్యూటీ అధికారి ఎంఏ జమీర్, జైనథ్ సిఐ డి సాయినాథ్, కోర్టు లైసెన్ధికారి పండరి సాక్షులను ప్రవేశపెట్టడంలో కీలకపాత్ర పోషించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
ప్రజలను మోసం చేసే ఎంతటి వారినైనా విడిచి పెట్టేది లేదని హెచ్చరిక.ఆదిలాబాద్ డిఎస్పీ యల్ జీవన్ రెడ్డి.
ఆదిలాబాద్ : క్రైమ్ 02. అక్షరతెలంగాణ :
నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్ యజమానులను దౌర్జన్యం చేసి హద్దులు తొలగించిన 8 మంది వ్యక్తులపై కేసు నమోదు, అయిదుగురు అరెస్ట్.
ఆస్తిని నష్టపరిచి చంపేస్తానని బెదిరించిన నిందితులు.
బాధితుల ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.
అధికారిక రిజిస్ట్రేషన్ ఉన్న ప్లాట్‌లో అక్రమంగా ప్రవేశించి బెదిరింపులు, ఫెన్సింగ్ ధ్వంసం – 8 మందిపై కేసు నమోదు.
ప్రజలను మోసం చేసే ఎంతటి వారినైనా విడిచి పెట్టేది లేదని హెచ్చరిక.ఆదిలాబాద్ డిఎస్పీ యల్ జీవన్ రెడ్డి.
A1) సయ్యద్ హైమద్ – (అరెస్ట్ పెండింగ్)
A2) పత్తి ముజ్జు @ మహ్మద్ ముజాహిద్( 54), బడ్కా మొహల్లా, ఆదిలాబాద్ పట్టణం. (అరెస్ట్ )
A3) వకులాభరణం ఆదినాథ్ – (అరెస్ట్ పెండింగ్)
A4) ఇస్మాయిల్ @ తౌఫిక్ @ మహ్మద్ తౌఫీక్ అహ్మద్,( 33), బొక్కలగూడ, ఆదిలాబాద్ పట్టణం. (అరెస్ట్)
A5) షేక్ ఆబిద్,( 28) సంవత్సరాలు, బొక్కలగూడ, ఆదిలాబాద్. (అరెస్ట్)
A6) అతిక్ – (అరెస్ట్ పెండింగ్).
A7) షేక్ అదిల్, (24), బొక్కలగూడ, ఆదిలాబాద్ పట్టణం. (అరెస్ట్)
A8) సర్ల బుచన్నా @ సరళ పొచన్నా, (54) కేఆర్‌కే కాలనీ, మావాలా, ఆదిలాబాద్. (అరెస్ట్)
గుడిహత్నూర్ మండలానికి చెందిన జాధవ్ రమేశ్ అనే వ్యక్తి ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివరాల ప్రకారం, జాధవ్ రమేశ్ తన తల్లి జాధవ్ సుందరాబాయి పేరు మీదగా నల్ల పద్మ అనే మహిళ నుండి 2004లో ఆదిలాబాద్ పట్టణంలోని సర్వే నెం. 68/బ/44/1, ప్లాట్ నెం. 91 (30x50) ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెం. 1233/2004, తేదీ: 02.04.2004 ద్వారా కొనుగోలు చేసినట్టు తెలిపారు. అప్పటి నుంచి వారు ఆ ప్రాంతంలో నివాసం ఉంటూ, ప్లాట్ చుట్టూ గోడలు, ఫెన్సింగ్ నిర్మించారు. పక్కా పత్రాలు ఉన్నప్పటికీ, పలువురు దుండగులు అక్రమంగా వారి స్థలంలోకి ప్రవేశించి గోడలు ధ్వంసం చేశారు.
2023 జనవరి 21న ఉదయం 11 గంటల సమయంలో సయ్యద్ హైమద్, ముజాహిద్ అలియాస్ పత్తి ముజ్జు, ఇస్మాయిల్ అలియాస్ తౌఫిక్, అటిక్, ఆబిద్, అదిల్, సర్ల బుచన్నా తదితరులు కూలి వర్కర్లతో కలిసి ప్లాట్‌లోకి బలవంతంగా చొచ్చుకువచ్చి ఫెన్సింగ్ ధ్వంసం చేశారు. బాధితులు వారిని అడ్డుకోవడంతో తమ వద్ద ఉన్న అసలైన డాక్యుమెంట్లు లాక్కొని నకిలీ పత్రాలు చూపిస్తూ ఈ భూమి తమదేనని బెదిరింపులకు దిగారు. తమను చంపేస్తామంటూ, కర్రలతో కొడతామంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ప్లాట్‌ను తక్కువ ధరకు అమ్ముకోవలసిందిగా లేదా వదిలివేయాలంటూ బెదిరింపులు చేశారని తెలిపారు.
ఒక నెల తరువాత, పత్తి ముజ్జు, వకులాభరణం ఆదినాథ్ ఇతరులతో కలిసి బాధితులను వినాయక్ చౌక్‌లోని ముజ్జు ఇంటికి పిలిపించి – “ప్లాట్‌లకి కొంత డబ్బు ఇచ్చి తీసుకొండి, లేదా మేమిచ్చిన డబ్బులు తీసుకుని ప్లాట్ వదిలివేయండి, లేదంటే మీ అంతు చూస్తాం” అని మరోసారి బెదిరించినట్టు తెలిపారు.
వీరి దౌర్జన్యానికి భయపడి ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయలేకపోయామని తెలిపారు. ఇంకా తమ ప్లాట్ స్థానాన్ని మార్చి నకిలీ పత్రాలు సృష్టించి సర్వే నెం. 346గా చూపిస్తూ అక్రమ ఫెన్సింగ్ నిర్మిస్తూ ఆక్రమణ ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ ప్రజలకు హమీ ఇస్తూ – ఇటువంటి అక్రమ ఆక్రమణల కేసుల్లో, భూ ఆక్రమణ కేసుల్లో అక్రమ ల్యాండ్ గ్రామర్ ల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయబడుతుంది బాధితులు భయపడకుండా ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయించాలని కోరుతోంది. చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయబడుతుంది. మిగిలిన నిందితులను పట్టుకోవడంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి త్వరలో పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ రూరల్ సీఐ కే ఫణిదర్, ఎస్ఐ వి విష్ణువర్ధన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పశువుల వ్యాపారి నీ దౌర్జన్యం చేసిన ఇద్దరు వ్యక్తుల. పై కేసు నమోదు ఒకరి అరెస్ట్, రిమాండ్ - రెండవ పట్టణ ఇన్స్పెక్టర్ సిహెచ్ కరుణాకర్ రావు.
ఆదిలాబాద్ : క్రైమ్ 03 : అక్షరతెలంగాణ
ప్రధాన నిందితుడి పరారీ, అన్వేషణను ప్రత్యేక బృందం ఏర్పాటు.
విచారణలో ఇంకా ఎవరి హస్తము ఉన్న వారిపై చట్ట ప్రకారం చర్యలు.
నిజామాబాద్ పశువుల వ్యాపారి వద్ద డబ్బులు వసూలు చేసిన ముఠా.
సుమారు 15-20 రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి, తేదీ 14.07.2025 మధ్యాహ్నం 3:00 గంటలకు మొహమ్మద్ సలీం ఖురేషీ (వయస్సు: 48 ఏళ్లు), వృత్తి: వ్యాపారం, నివాసం: జంకంపేట్, యేడపల్లి మండలం, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ టూ టౌన్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో పేర్కొచ్చిన వివరాల ప్రకారం, పశువుల కొనుగోలు మరియు అమ్మకానికి సంబంధించిన వ్యాపారం చేస్తున్న సమయంలో, ఆదిలాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు A-1 *దుర్ల సత్తన్న* (గడియార్ మొహల్లా) మరియు A-2 *మజార్* (ఖుర్షీద్ నగర్) అతని వ్యాపారాన్ని అడ్డుకుంటూ, డబ్బులు ఇవ్వాలని బెదిరించారని తెలిపారు.
ఖుర్షీద్ నగర్ కాలనీలోని CWC గోడౌన్ సమీపంలో వాహనం ఆపి, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని, వాహనం తీసుకుంటామని బెదిరించారని, భయంతో మజార్‌కు రూ. 30,000/-, దుర్ల సత్తన్నకు రూ. 20,000/- మొత్తంగా రూ. 50,000/- నగదు ఇచ్చినట్లు తెలిపారు.
అంతేకాక, అదే విధంగా షేక్ మాన్సూర్ (తాటిగూడ) మరియు షేక్ జావీద్ (ఆర్మూర్) అనే ఇతర వ్యాపారుల నుండి కూడా డబ్బులు వసూలు చేసినట్టు ఫిర్యాదులో వెల్లడించారు.
ఈ మేరకు ఇద్దరు నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తులో డబ్బులు వసూలు చేసిన నిందితులలో ఇంకెవరిదైనా హస్తం ఉన్నదని తేలిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. నిందితుడికి 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్ తరలించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments